యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిలిం 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్‌తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి.
ఇంకా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌పైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా డైలాగ్స్‌పై వస్తున్న విమర్శలపై ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా స్పందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తానని.. వారిని బాధపెట్టేలా ఉన్న డైలాగులను తొలగిస్తామని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్‌లో రాస్తూ.. 'ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని గౌరవించడం రామాయణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం. ఆదిపురుష్ కోసం చాలా డైలాగ్స్ రాశాను. కానీ కొన్నింటి దగ్గర సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. నేను సీత, రాముని కోసం రాసిన డైలాగ్స్‌కు ప్రశంసలు దక్కలేదు. నా సొంత సోదరులే సోషల్ మీడియాలో నాపై, నా తల్లిపై అసభ్యకరమైన పదాలు వాడారు.
ప్రతి తల్లిని తన తల్లిగా భావించే శ్రీరాముడిని చూసిన సోదరులకు హఠాత్తుగా ఎందుకంత కోపం వచ్చింది. కానీ నాపై సనాతన ద్రోహి అనే ముద్ర వేసేందుకు మీరు ఎందుకు తొందరపడ్డారో తెలియడం లేదు. మేము సనాతన సేవ కోసమే ఆదిపురుష్‌ని సృష్టించాం. నా డైలాగ్స్‌కు నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను. కానీ ఇది మీ బాధను తగ్గించలేదు. కొన్ని డైలాగులు మిమ్మల్ని బాధపెట్టాయని గ్రహించిన నేను.. సినిమా నిర్మాత, దర్శకుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకున్నా. ఈ వారంలోనే అభ్యంతరకరంగా ఉన్న డైలాగ్స్‌లో మార్పులు చేస్తాం' అని పేర్కొన్నారు.
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…
Comments
Please login to add a commentAdd a comment