ఆ డైరెక్టర్‌ ప్రతి సినిమాకు నేనే పని చేస్తా: డైలాగ్‌ రైటర్‌ | Dialogue Writer Lakshmi Bhupal About Gurtunda Seethakalam Movie | Sakshi
Sakshi News home page

Gurtunda Seethakalam Movie: చిరంజీవికి డైలాగ్స్‌ రాస్తున్నప్పుడు ప్రెజర్‌ ఉండదు, కానీ

Published Sun, Dec 4 2022 8:51 PM | Last Updated on Sun, Dec 4 2022 8:51 PM

Dialogue Writer Lakshmi Bhupal About Gurtunda Seethakalam Movie - Sakshi

మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్‌కు బాగా కనెక్ట్  అయ్యే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "గుర్తుందా శీతాకాలం". సత్యదేవ్, తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించారు. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్బంగా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

► 11 ఏళ్ల క్రితం అలా మొదలైంది సినిమా చేశాను. ఆ తర్వాత చందమామ కథలు వంటి లవ్ స్టోరీ రాశాను. తరువాత ఫ్యామిలీ, విలేజ్, గోదావరి స్లాంగ్ వంటి సినిమాలు, పొలిటికల్.. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్ కథలతో చాలా సినిమాలకు రాశాను.అయితే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు రాసిన జానర్‌ మళ్ళీ రాయలేదు.

► నేను ఏ సినిమాకైనా కథ  రాయాలి అంటే ఆ కథ నాకు ఇన్స్పిరేషన్ కలిగించాలి,అలాగే ఆ కథలో కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. చూసే అడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయినపుడే మనము సక్సెస్ అయినట్టు.

► గతంలో మనం చూసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రేమమ్ వంటి సినిమాలు 10 సంవత్సరాలకోసారి కూడా రావు. ఈ సినిమాలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. అతడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తనకు 90 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా చేయగలడు.

► ఈ మధ్య ప్రేక్షకులు రీమేక్ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. ఆర్థిస్టులు కూడా రీమేక్ సినిమాలను ఛాలెంజ్‌గా తీసుకొని పోటీపడి నటిస్తారు. ఎందుకంటే రీమేక్‌లో ఆర్థిస్టులు నటించిన దానికంటే ఇంకా బెటర్ గా చెయ్యాలని ట్రై చేస్తారు. అప్పుడు సినిమా బాగా వస్తుంది. ఆలా చేసిన ఈ సినిమా కూడా 90% ఒరిజినల్ ఉండేలా సినిమాను రెడీ చేశాము.

► చాలామంది పెద్ద నిర్మాతలు నన్ను డైరెక్షన్‌ చేయమని అడిగారు. కానీ నాకు డైరెక్షన్ చేయాలని థాట్ వచ్చినప్పుడే చేస్తాను.

► చిరంజీవి లాంటి స్టార్ వ్యక్తికి డైలాగ్స్ రాస్తున్నప్పుడు నాకు ఎక్కువ ప్రెజర్ ఉండదు కానీ ఎగ్జయిట్‌మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను రాసిన డైలాగులు చిరంజీవి గారి నోట్లోనుంచి వస్తే ఎలా ఉంటుందనే ఎగ్జయిట్‌మెంట్‌తో రాస్తాను. 

► నాకు జీవితంలో ఎటువంటి గోల్స్ లేవు. కానీ, మంచి సినిమాలకు కథలు రాయాలి, నేను వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకుంటాను.

► అందరూ ఈ టైటిల్ గురించి అడుగుతున్నారు. అయితే ఎండాకాలంలో ప్రేమికులకు లవ్ స్టోరీ బాగోదు, వానకాలం లవ్ అనేది పెళ్లైన వాళ్ళకు మాత్రమే బాగుంటుంది. శీతాకాలంలో లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి  ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు.

► నెక్స్ట్ మరీచిక, అన్నీ మంచి శకునములే సినిమాలకు పని చేస్తున్నాను. అలాగే నందిని రెడ్డి చేసే ప్రతి సినిమాకు కూడా రాస్తున్నాను అని ముగించారు.

చదవండి: క్రికెటర్‌తో లవ్‌లో నటి? ఈ మధ్య మాటలు కూడా బంద్‌ అయ్యాయట!
దయచేసి తండ్రి మాట వినొద్దు, అలాగైతేనే బన్నీలా అవుతారు: బండ్ల గణేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement