Satyadev Counter to Netizen Who Asks 3 Tickets For Three Girl Friends - Sakshi
Sakshi News home page

Satyadev: ముగ్గురు ప్రియురాళ్ల కోసం టికెట్లు అడిగిన నెటిజన్‌, కౌంటరిచ్చిన హీరో

Published Thu, Dec 8 2022 7:50 PM | Last Updated on Thu, Dec 8 2022 9:02 PM

Satyadev Counter to Netizen Who Asks 3 Tickets for Three Girl Friends - Sakshi

గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో సత్యదేవ్‌. కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన లవ్‌ మాక్‌టైల్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్‌ సంయుక్తంగా నిర్మించారు. రేపు (డిసెంబర్‌ 9న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు సత్యదేవ్‌. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.

'బ్రో, నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. స్టోరీ కూడా కనెక్ట్‌ అయింది. మూడు టికెట్స్‌ ఇవ్వొచ్చు కదా బ్రో' అని ఓ నెటిజన్‌ అడగ్గా.. 'మూడు టికెట్సా? అంటే నువ్వు రావట్లేదా?' అని కౌంటరిచ్చాడు. 'అన్నా రిప్లై ఇవ్వకపోతే సినిమా చూడను ప్లీజ్‌ రిప్లై.. నీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మహేశ్‌బాబు 28వ సినిమా అప్‌డేట్‌ ఇప్పించు అన్నా' అని ఓ వ్యక్తి కోరగా.. 'నా ఇన్‌ఫ్లూయెన్స్‌తో గుర్తుందా శీతాకాలం టికెట్‌ ఇప్పించగలను కానీ ఆ అప్‌డేట్‌ ఎలా సాధ్యమవుతుందనుకున్నావు?' అని రిప్లై ఇచ్చాడు.

రెబల్‌ స్టార్‌ గురించి ఒక్క మాటలో చెప్పమని అడగ్గా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని, అల్లు అర్జున్‌ను ఐకాన్‌గా పేర్కొన్నాడు సత్యదేవ్‌. మీకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటన్న ప్రశ్నకు కరకరలాడే అప్పడాలని చెప్పాడు. రీమేక్స్‌ అంటే జనాలిష్టపడట్లేదు, అయినా అంత నమ్మకంగా థియేటర్‌లో ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారు. ఓటీటీకి ఇవ్వొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా ఓటీటీకి అడిగారు. కానీ ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా' అని బదులిచ్చాడు సత్యదేవ్‌.

చదవండి: లగ్జరీ కారు కొన్న సోనూసూద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement