
సత్యదేవ్, అతిరా రాజీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి, కృష్ణమ్మ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఏమవుతుందో మనలో..’ అనే మెలోడి సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు.
‘‘ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘ఏమవుతుందో మనలో..’ పాట ఉంటుంది. సన్ని కూరపాటి విజువల్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.