Bigg Boss Beauty Swetha Varma Participated in Kondaveedu Movie Press Meet - Sakshi
Sakshi News home page

Bigg Boss Swetha Varma: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా 'కొండవీడు'.. రిలీజ్‌ ఎప్పుడంటే ?

Published Tue, Jul 5 2022 7:00 PM | Last Updated on Wed, Jul 6 2022 10:06 AM

Bigg Boss Beauty Swetha Varma Kondaveedu Movie Press Meet - Sakshi

Swetha Varma Kondaveedu Movie: నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ శ్వేతా వర్మ మరోసారి మంచి ఛాన్స్ కొట్టేసింది. దసరాజు గంగాభవాని సమర్పణలో  బి. పి. ఆర్ సినిమా పతాకంపై శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్, నవీన్‌రాజ్ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'కొండవీడు'.  సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో మధుసూధనరాజు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్ మీట్‌లో చిత్రబృందం పాల్గొంది. 

'మా "కొండవీడు" సినిమా టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసిన  శ్రీకాంత్‌, సునీల్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం. దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ  సినిమాను చాలా ఫారెస్ట్ లొకేషన్స్ లలో చిత్రీకరించాం. ఇందులో శ్వేతావర్మతో పాటు మిగిలిన నటీ నటులు, టెక్నిషియకన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సినిమా బాగా వచ్చింది' అని నిర్మాత ప్రతాప్ రెడ్డి తెలిపారు. చిత్ర దర్శకుడు సిద్దార్థ శ్రీ మాట్లాడుతూ.. 'సినిమా తీస్తున్నప్పుడు ఫారెస్ట్‌లోకానీ ఇతర లొకేషన్స్‌లో ఫైట్స్, పాటల విషయంలో ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. 

'కరోనా టైమ్‌లో చాలా సినిమాలు చేశాను. నేను బిగ్ బాస్‌లో ఉన్నపుడు ప్రతాప్ రెడ్డి చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాను మొదట ఓటీటీలో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్‌ రామకృష్ణ చూసి మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా థియేటర్‌లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు. ఇందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతలు కోవిడ్ టైమ్ లో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మంచి ఔట్  పుట్ వచ్చే వరకు మాతో వర్క్ చేయించుకున్నాడు. ఇలాంటి మంచి దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా చిత్రాన్ని మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని శ్వేతా వర్మ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement