Kondaveedu
-
Vemana: వేమనకు కొండంత వెలుగు
వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా నిలుస్తారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరు కున్నారు. ఉన్న స్థితి నుండి సమాజం మరో అడుగు ముందుకు సాగాలని తపించారు. ఆటవెలదులనే ఈటెలతో సమాజ సంస్కరణకు పూనుకొన్నారు. ఆ తర్వాత అనేక తరాల కవులకు మార్గ దర్శకంగా నిలిచారు. దేశ విదేశాల పండితులను సైతం వేమన పద్యాలు ఆకర్షించాయి. పాశ్చాత్య భాషలలోనూ అనువాదమయ్యాయి. తెలుగు సమాజానికి వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న వేమన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించింది. డిసెంబర్ 30న ఈ విషయమై జీఓ 164ను విడుదల చేసింది. కర్ణాటక ప్రాంతంలో తెలుగువారు స్వచ్ఛందంగా వేమన జయంతిని జరుపుకొనే సంప్రదాయం ఉంది. వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహం కూడా అందులో ఉంది. ప్రజల ఆకాంక్ష లను గుర్తించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 22న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు... మొత్తం అరవై తొమ్మిదిలక్షల రూపాయలు ప్రతి ఏడాదీ కేటాయిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ధార్వాడ విశ్వ విద్యాలయంలో 1980లలోనే ‘వేమన పీఠం’ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాంస్కృతిక శాఖ వేమన జయంతిని కర్ణాటక రాష్ట్రంలో లాగా నిర్వహించాలని 2018 లోనే వేమన సంఘాలు, అభిమానులు కోరడమైంది. అప్పటి మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమయింది. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉంది. స్థానికుల ఒత్తిడితో అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019న అసెంబ్లీలో ప్రశ్నించారు. కనీస చర్చ కూడా జరగడానికి సభాపతి అవకాశం ఇవ్వలేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. వేమనపై కనీసం ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని వేమన సంఘాలు కోరుతూ వచ్చాయి. 2019 నుండి ఈ ప్రక్రియ మొదలై నేడు అది సాకార మైంది. వేమన రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించబోతున్న ఈ సందర్భంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలోని కటారుపల్లి గ్రామంలోని వేమన సమాధి ప్రాంతంలో ప్రారంభ రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఒకో సంవత్సరం ఒకోచోట కార్యక్రమం ఉండేలా చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 19న కార్యక్రమాలు చేయాలి. విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా వేమన పద్యపోటీలు, సదస్సులు నిర్వహించాలి. మాజీ డీజీపీ పర్యాటకశాఖ సంస్థ ఛైర్మన్ చెన్నూరు అంజనేయరెడ్డి 2003లో ప్రత్యేక శ్రద్ధతో కటారుపల్లిలో వేమన సమాధిప్రాంతం, పరిసరాలలో అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. కోటిన్నర రూపాయల దాకా ఖర్చు జరిగింది. మిగతా నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు. తక్షణం నిధులు కేటాయించి పూర్తి స్థాయి పనులు చేపట్టాలి. వేమన సాహిత్యంపై అధ్యయనానికీ, విస్తరణకూ ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థనూ, గ్రంథాలయాన్నీ నెలకొల్పాలి. ఆధునిక తరానికి వేమన గురించి తెలిసేలా ప్రత్యేక వెబ్సైట్ నడపాలి. ప్రామాణిక వేమన పద్యప్రతిని రూపొందించడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమనతో ముడిపడిన కొండవీడు, గండికోట, నల్లచెరువు, పామూరు తదితర స్థలాలకు గుర్తింపు తీసుకురావాలి. జాతీయకవిగా వేమన గుర్తింపునకై కృషి జరగాలి. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) - డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి కార్యదర్శి; వేమన ఫౌండేషన్, అనంతపురం -
‘కొండవీడు’ మూవీ రివ్యూ
టైటిల్ : కొండవీడు నటీనటులు : శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ తదితరులు నిర్మాతలు: మధుసూధనరాజు, బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి రచన,దర్శకత్వం: సిద్ధార్థ్ శ్రీ సంగీతం : కనిష్క సినిమాటోగ్రఫీ: రఘు రాయల్ ఎడిటర్: శివ శర్వాణి విడుదల తేది: జులై 8, 2022 ‘కొండవీడు’ కథేంటంటే.. కొండవీడు అటవీ ప్రాంతానికి చెందిన బాకు బాబ్జీ(ప్రతాప్ రెడ్డి) అడవిలోని చెట్లను నరుకుతూ కలప స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతని చీకటి వ్యాపారానికి అడ్డొచ్చిన ఫారెస్ట్ అధికారులను చంపుతూ.. కంటపడిన ఆడపిల్లలపై హత్యాచారానికి పాల్పడుతుంటాడు. అతని అగడాలను అట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రొఫెసర్‌కు వంశీకృష్ణ, సామావేద (శ్వేతా వర్మ) కలుస్తారు. అసలు బాకు బాజ్జీ అక్రమాలను ప్రొఫెసర్ ఎందుకు అడ్డుకొంటాడు? అడవిలోకి వంశీకృష్ణ, సామావేద ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వంశీ, సామవేదల ప్రేమ ఎక్కడికి దారి తీసింది? బాకు బాబ్జి చేతికి చిక్కిన ఈ ముగ్గురు.. ఎలా బయటపడ్డారు? బాకుల బాబ్జీ అక్రమాలను ఎవరు చెక్ పెట్టారు? అనేదే ‘కొండవీడు’ కథ. ఎలా ఉందంటే..? అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అక్రమ రవాణా నేపథ్యంలో ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కిన చిత్రం `కొండవీడు' ప్రకృతికి హాని కలిగించే కలప స్మగ్లర్లకు గుణపాఠం చెబుతూనే ప్రేక్షకులను కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సిద్ధార్థ్ శ్రీ. చెట్లను నరుక్కుంటూ పోతే సహజంగా దొరికే ఆక్సిజన్‌ను లక్షల రూపాయలు పెట్టి కొనే దుస్థుతి వస్తుందనే సందేశాన్ని ప్రేక్షకులు అందించాడు. అయితే ఈ కథను పూర్తిస్తాయిలో విస్తరించి, తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకొని ఉండే సినిమా స్థాయి మరోలా ఉండేది. సినిమాలో చాలావరకు కొత్త నటులే అయినా..వారిని నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. తొలి సినిమా అయినా.. చాలా నిజాయితీగా మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అడవి సంపద, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తెలిసిన వారికి ‘కొండవీడు’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ‘బిగ్‌బాస్’ఫేమ్ శ్వేతా వర్మ. సామావేద పాత్రకి ఆమె న్యాయం చేసింది. గ్లామర్ పరంగా, హావ భావాల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో శ్వేతా వర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కలప స్మగ్లర్ బాకు బాబ్జీగా ప్రతాప్ రెడ్డి నేచురల్‌గా విలనిజం ప్రదర్శించాడు.వంశీకృష్ణగా శ్రీకృష్ణ తనదైన నటనతో ఆకట్టకున్నాడు. అన్ని రకాల ఎమోషన్స్ పండించే ఆస్కారం దొరికింది. మిగిలిన నటీనటులు కొత్తవారే అయినా.. తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికొస్తే..కనిష్క సంగీతం బాగుంది. ‘ఎదలో జరిగే ప్రణయాన్ని ఎలా ఆపడం’ అనే పాట తెర మీద కూడ అంతే ఎఫెక్టివ్‌గా కనిపించింది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ రఘు రాయల్ తన కెమెరాలో చక్కగా బంధించాడు.విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి.శివ సర్వాణి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
మరోసారి హీరోయిన్గా బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతా వర్మ..
Swetha Varma Kondaveedu Movie: నటి, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతా వర్మ మరోసారి మంచి ఛాన్స్ కొట్టేసింది. దసరాజు గంగాభవాని సమర్పణలో బి. పి. ఆర్ సినిమా పతాకంపై శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్, నవీన్‌రాజ్ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'కొండవీడు'. సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో మధుసూధనరాజు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్ మీట్లో చిత్రబృందం పాల్గొంది. 'మా "కొండవీడు" సినిమా టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్, సునీల్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం. దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను చాలా ఫారెస్ట్ లొకేషన్స్ లలో చిత్రీకరించాం. ఇందులో శ్వేతావర్మతో పాటు మిగిలిన నటీ నటులు, టెక్నిషియకన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సినిమా బాగా వచ్చింది' అని నిర్మాత ప్రతాప్ రెడ్డి తెలిపారు. చిత్ర దర్శకుడు సిద్దార్థ శ్రీ మాట్లాడుతూ.. 'సినిమా తీస్తున్నప్పుడు ఫారెస్ట్లోకానీ ఇతర లొకేషన్స్‌లో ఫైట్స్, పాటల విషయంలో ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. 'కరోనా టైమ్‌లో చాలా సినిమాలు చేశాను. నేను బిగ్ బాస్‌లో ఉన్నపుడు ప్రతాప్ రెడ్డి చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాను మొదట ఓటీటీలో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ చూసి మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు. ఇందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతలు కోవిడ్ టైమ్ లో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మంచి ఔట్ పుట్ వచ్చే వరకు మాతో వర్క్ చేయించుకున్నాడు. ఇలాంటి మంచి దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా చిత్రాన్ని మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని శ్వేతా వర్మ తెలిపింది. -
‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడు..
చారిత్రక ప్రాభవానికి, తెలుగు వారి పౌరుషానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన కొండవీడు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మలిచేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. మహోన్నత చరిత్ర, ప్రాచీన సంపద కలిగిన కొండవీడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిది. హైదరాబాద్‌కు వన్నె తెచ్చిన ‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడుకు పూర్వవైభవాన్ని తెచ్చే ఆలోచన చేస్తోంది. ఇందుకు ఆద్యుడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. రాజన్న 2005 జులైలో రూ.5 కోట్ల నిధులిచ్చి కొండవీడు అభివృద్ధికి తొలిబీజం వేశారు. ఆ బీజమే సందర్శకులను ఆకర్షించే ‘ఘాట్‌రోడ్డు’ అనే మహావృక్షంగా రూపుదాల్చింది. పచ్చని ప్రకృతి.. ఆహ్లాద వాతావరణం సొంతం చేసుకున్న ఈ గిరిదుర్గం నేడు దశల వారీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యడ్లపాడు: కొండవీడు కోటను అభివృద్ధి చేసే దిశలో భాగంగా నగర వనం నిమిత్తం రూ.13.35 కోట్లు విడుదలయ్యాయి. వీటితో తలపెట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీహెచ్ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే విడదల రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రానున్నారు. చదవండి: ఏడు ఊర్లు కలసి హాల్వి.. దీనికో చరిత్ర ఉంది! అత్యంత ప్రాధాన్యంగా.. నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని ప్రాధాన్యతనిచ్చిన అభివృద్ధి పనుల్లో కొండవీడు పర్యాటకం ఒకటి. శతాబ్దాల ఘన చరిత్రలో భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కొండవీడు ప్రగతికి నడుంబిగించారు. అన్నిశాఖల వారిని సమన్వయం చేసుకు ని బృహత్తర ప్రణాళికలు రూపొందించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రమంతుల్ని సైతం కొండవీడుకు తీసుకువచ్చి పర్యాటకంగా చేయాల్సిన పనులను గురించి వివరించారు. వారితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి నివేదికలను సమర్పించారు. దీంతో కొండవీడు అభివృద్ధికి సుమారు వంద కోట్ల నిధులు వచ్చేలా మార్గం సుగమం అయ్యింది. చూడముచ్చటైన అందాలు! ఘాట్‌రోడ్డు ప్రారంభంలో చెక్‌పోస్టు నిర్మించగా..కొండపై చారిత్రక ప్రాంతం ప్రారంభంలో విభిన్నంగా నిర్మించిన ప్రవేశద్వారం (ఆర్చి) అటవీ అందాలకు ప్రతీకగా దర్శనమిస్తోంది. సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల పార్కు, వాహనాల పార్కింగ్, నడకదారుల ఏర్పాటు ఫ్లోరింగ్ టైల్స్‌తో సుందరీకరణ చేశారు. వాటర్ ఫౌంటెన్, సోలర్ విద్యుత్తు దీపాల ఏర్పాటు తదితర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, ఆంజనేయస్వామి గుడి పక్కన 10వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్ నిర్మాణం కొనసాగుతోంది. కొండపై ఉన్న చెరువుల గట్లపై నడకదారి..దానికిరువైపులా మొక్కలు..రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం చెట్ల కొమ్మల ఆకారంలో బల్లలు, అక్కడక్కడా చెట్ల చుట్టూ అరుగులు ఏర్పాటు చేసి సుందరీకరణ చేశారు. కొండవీడు రాకపోకలకు అనువుగా రూ.24 కోట్ల వ్యయంతో దింతెనపాడు వయా కొండవీడు, ఫిరంగిపురం రోడ్డు(డీఎస్ రోడ్డు) పనులు కొనసాగుతున్నాయి. చరిత్ర పేజీలో అభివృద్ధి అక్షరాలు లిఖించాలి చారిత్రక, పర్యాటక ప్రాంతాల ప్రగతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొండవీడు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపే చొరవ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఇప్పటికే కోటిన్నర నిధులతో ప్రగతి సాధించగా, తాజాగా వచ్చిన కేంద్ర అటవీ అనుమతులతో రూ.11.80 కోట్ల తో రెండోదశ ఘాట్‌రోడ్డు, రూ.3.5 కోట్లతో విద్యుత్‌సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నాం. ఇలా కొండవీడు చరిత్ర పుస్తకంలో అభివృద్ధి అక్షరాలతో లిఖించిన పేజీల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్ష. – విడదల రజిని, ఎమ్మెల్యే -
ఆంధ్ర గోల్కొండగా పిలిచే ప్రాంతమేదో తెలుసా?
యడ్లపాడు(గుంటూరు): కొండవీడు అంటే రెడ్డిరాజుల సుదీర్ఘ పాలన గుర్తొస్తుంది. కాని శత్రుదుర్భద్యమైన ఈ రాజ్యాన్ని మరెందరో రాజులు, రారాజులు పరిపాలించారు. అందుకే ఇక్కడ గుట్టను తాకినా, ఏ కొండరాయిని కదిలించిన గత చరిత్ర వైభవాలను ఆనావాళ్లుగా చూపించి ఆకట్టుకుంటాయి. గుంటూరు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన ఉన్న ఈ కొండవీడును పర్యాటక ప్రేమికులు ఆంధ్ర గోల్కొండగా పిలుచుకుంటారు. బాగ్దాద్ నుంచి భారతదేశానికి ఆధ్యాత్మిక పరిమళాలను పంచేందుకు వచ్చిన ఓ మహనీయుని చరిత్ర ఇది. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాదాపీర్ అసలు పేరు... ఫిరంగిపురం నుంచి వస్తుండగా గ్రామ ప్రారంభంలో కొండవీడు కొండల పక్కనే కనిపించే దర్గా ఇది. ‘హజ్రత్ సయ్యద్ ఖుదాదే ఫకీర్షా ఔలియా’ అన్నది దర్గా అసలు పేరు. స్థానికులు వాడుకలో పిలుచుకునే పదం ‘దాదాపీర్’ దర్గా. సృష్టికర్త అల్లాహ్ గొప్పతనాన్ని, ఆయన్నూ ఆరాధించే విధానాన్ని చైతన్యం చేయాలని ఆధ్యాత్మిక గురువులకు గురువైన మహబూబ్ సుభాని సంకల్పించారట. దీంతో బాగ్దాద్‌కు చెందిన బీబీహాజీర దంపతులు సుమారు నాలుగు శతాబ్ధాల క్రితం భారతదేశానికి వచ్చారట. (చదవండి: పోణంగిలో అశ్లీల నృత్యాలు ) చివరి మజీలి కొండవీడు.. తొలుత ఉత్తరభారత్‌లో ప్రారంభమైన బాబావారి ఆధ్యాత్మిక బోధనలు.. క్రమేణ దక్షిణప్రాంతాలకు విస్తరించాయి. దాదాపీర్ వారి చివరి మజీలిగా కొండవీడును ఎంచుకున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. అనంత కరుణామయుడు అల్లాహ్ ఆజ్ఞలను అందరికీ తెలపడం కోసమే దాదాపీర్ జీవితాన్ని గడిపారు. ఖురాన్లో సందేశాలను పాటిస్తూ అందరిని అదేమార్గంలో నడిపించడంతో ఆయన్నూ దైవదూతగా భావించారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా అత్తరు విక్రయాలతో జీవనం.. కొండవీడు పరిపర ప్రాంతాల్లో లభించే పుష్పాలు, మూలికలతో వివిధ రకాల అత్తరు పరిమళాలను దాదాపీర్ దంపతులు తయారు చేసేవారు. దాదాపీర్ వద్ద నిత్యం అత్తరు సువాసనలు గుభాళిస్తాయట. తాము తయారు చేసిన పరిమళాలను సమీప గ్రామాల్లో విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగించారట. కేవలం ఒక్కరూపాయికే అత్తరును ఇచ్చేవారట? ప్రకృతి అంటే బాబావారికి ఎంతో ప్రీతి. ఆయన చివరి మజీలిగా పచ్చగా పరిఢవిల్లే కొండవీడును ఎంచుకున్నరని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. కొండవీడులోని దాదాపీర్ దర్గా దాపరికంతో జరిగే అనర్థాలు.. పవిత్ర ఖురాన్, నమాజ్, దువా, బయాన్ తదితర అంశాల గురించి నిత్యం వివరించడంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారట. రేపటికి (మరణం తర్వాత) మనిషికి అవసరమైంది పుణ్యమేగాని, సంపాదన కాదని చెప్పెవారట. దాచుకోవడం వల్ల దోచుకోవడం అలవరుతుందని, తద్వార స్వార్ధం, సోమరితనం ఏర్పడతాయని బోధించేవారు. మనిషి ఎక్కువగా సంపాదించుకోవాల్సింది దైవంపై విశ్వాసం మాత్రమే అంటూ వివరించేవారు. శతాబ్ధాల కిందటి మసీదులో నేటికీ నమాజులు... ఈ ప్రాంతంలో ముస్లిం రాజుల కాలం నాటి అతి పురాతన రెండు మసీదులు ఉన్నాయి. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ మసీదుల్లో ఒకటి కొండవీడు కొండలపై ఉండగా, రెండోది కొండ దిగువన కొండవీడు గ్రామంలో ఉంది. అయితే కొండపై ఉన్న మసీదును ముస్లింరాజు నిర్మించారు. అందులో గుప్తనిధుల కోసం దుండగుల మసీదును కొంతభాగం ధ్వంసం చేయగా, కొండకింద దర్గా ప్రాంగణంలో ఉన్న మసీదు నేటికీ చెక్కుచెదరలేదు. ఇప్పటికి దర్గాకు వచ్చిన వారంతా ఆ మసీదులోనే నమాజ్, ఖురాన్ పఠనం చేయడం విశేషం. (చదవండి: ‘అమూల్’ ఒప్పందంతో మీకేంటి నష్టం?) దర్గా ప్రాంగణంలో దాదాపీర్ నిర్మించిన చెక్కుచెదరని మసీదు ముస్లిం రాజు నిర్మించిన దాదాపీర్ దర్గా దాదాపీర్ నిర్మించిన ఆ మసీదును అంతా భారీ కొండబండరాళ్లతో నిర్మితమైంది. ఏనుగులు సైతం మోయలేని ఆ బండరాళ్లను సునాయాసంగా తెచ్చి మసీదు నిర్మాణం చేస్తున్న దాదాపీర్ మహిమను కొండవీడును పాలించే అప్పటి రాజు పఠాన్మథాన్ఖాన్ కళ్లారా చూశాడట. ఎవరి సాయం లేకుండా స్వయంగా ఆయనే మసీదు నిర్మించడాన్ని చూసి ఆనందపరవశుడై నాటి నుంచి ఆయన భక్తునిగా మారిపోయాడు. అంతేకాదు కొన్నాళ్లకు స్వర్గస్తులైన ఆ దంపతుల సమాధులకు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దర్గా నిర్మించారు. దర్గా ఉత్సవాలకు నిర్వహణకు మరో 91 ఎకరాల భూమిని వంశీయులకు ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. బక్రీద్ పండుగ నాడు ఉరుసు ఉత్సవాలు.. ప్రతియేటా బక్రీద్ పండుగనాడు ఈ దర్గా ఉరుసు మహోత్సవ వేడుకలను వస్తాయి. నాలుగు శతాబ్ధాల కాలం నుంచి బాబావారి వంశీయులు, గ్రామ ముజావర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దాదాపీర్ దర్గాను సందర్శిస్తారు. ప్రస్తుతం దాదాపీర్ వంశీయులైన నౌషద్ నేతృత్వంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. (చదవండి: కర్నూల్లో సింగర్ సునీత సందడి) -
కొండవీటి కోట.. ఔషధాల తోట
కొండవీటి కోట... ఈ కోటలో పర్యటిస్తే ‘కొండవీటి చాంతాడు’ అనే నానుడి గుర్తుకు వస్తుంది. పదిహేడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ కోట. కోట ఆవరణలో ఉన్న వందల అడుగుల లోతైన బావుల్లోని నీటిని తోడడానికి చాంతాడు ఎంత పొడవు ఉండాలి? ఇక్కడ బావుల్లోని నీటి కోసం చాంతాడు పొడవే కాదు, కోట గురించి చెప్పుకుంటూ పోతే ఆ వివరాల జాబితా నిడివి కూడా అంత పొడవూ ఉంటుంది. కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, ఫ్రెంచ్ పాలకులు, ఆ తర్వాత ఈ ప్రదేశం బ్రిటిష్ పాలకుల అధీనంలోకి వెళ్లింది. ఒకప్పుడు రాజధానిగా వెలిగింది. ఇప్పుడు గ్రామంగా మిగిలింది. ప్రస్తుతం మంచి పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటోంది. ఔషధాల కొండ కొండవీడు గ్రామం గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలో ఉంది. అనపోతారెడ్డి 14వ శతాబ్దంలో రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చి కోటను అభివృద్ధి చేశాడు. కోట చుట్టూ ఉన్న గోడ 20 కిలోమీటర్లు ఉంటుంది. పదిహేడు వందల ఎత్తులో ఉన్న ఈ గిరిదుర్గంలో ఏడాది పొడవునా నీటి లభ్యత కోసం మూడు చెరువులు, ఒక కోనేటిని తవ్వించారు. ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో వర్షపు నీటిని వృథా పోనివ్వకుండా గొప్ప వాటర్‌మేనేజ్‌మెంట్ విధానాన్ని అనుసరించిన తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొండ దిగువ నుంచి కొండ మీదకు వెళ్లే ఆరు కిలోమీటర్ల దారితోపాటు కోట లోపల రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌లో నడక ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. స్వయంగా పెడలింగ్ చేస్తూ పడవలో విహరించవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి మంచి చిల్డ్రన్స్ పార్క్ కూడా సిద్ధం కానుంది. ఇటీవల వారాంతపు విడిదికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఈ ఏడాది జనవరి తొమ్మిదో తేదీన అధికారికంగా టూరిజానికి ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఆదివారాల్లో రెండు వందలకు పైగా కార్లు, ఆరు వందలకు పైగా టూ వీలర్లు కోట మీదకు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం ‘నగరవనం’ కార్యక్రమంలో భాగంగా కోట పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతోంది. రాశివనం, పంచవటి వంటి థీమ్ పార్కులు సిద్ధమవుతున్నాయి. ఈ కొండల్లో నాగముష్టి, తిప్పతీగ, పాషాణభేదితోపాటు లెక్కలేనన్ని ఔషధమొక్కలున్నాయి. ఈ కొండమీదున్న వందల ఏళ్ల నాటి వెదురు చెట్లకు వెదురు బియ్యం పండుతోంది. పిల్లలకు విజ్ఞానంతో కూడిన విహార ప్రదేశం ఇది. కొండలను కలిపే ద్వారం కోటలోపల నరసింహ ఆలయం, లక్ష్మీ నరసింహ ఆలయం, రెండు శివాలయాలు, గంగాధర రామేశ్వరాలయం, మసీదు, దర్గా, వేమన మండపం, నేతి కొట్టు, గుర్రపుశాలలు, భోజనశాల చూడాల్సిన ప్రదేశాలు. రాజ మందిరాన్ని బ్రిటీష్ పాలకులు బంగ్లాగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ బంగ్లాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుగా ఉపయోగిస్తోంది. ఇవన్నీ కాకుండా ఈ కోటకు రక్షణగా 23 బురుజులుండేవి, ఇప్పుడు అందులో కొన్ని శిథిలమై నామావశిష్టాలుగా మిగిలిపోయాయి. చుక్కల కొండ, జెట్టి, నెమళ్ల బురుజు, సజ్జా మహల్, మిరియాల చట్టు బురుజు వంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఒక ఎత్తయితే... రెండు కొండలను కలుపుతూ రెండు వందలకు పైగా వెడల్పు ఉన్న రెండతస్థుల తూర్పు ద్వారం ఆనాటి నిర్మాణ కౌశలానికి దర్పణం. నమూనా కోట ఈ కోటలో పర్యటించడానికి ముందు కొండవీడు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరాన ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేశ్ గ్రామంలో ‘రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల’ను చూస్తే బాగుంటుంది. ఈ మ్యూజియం అక్షరాలను శిల్పాలుగా, చిత్రాలుగా మలుచుకున్న ఒక గ్రంథాలయం. ఇందులో కొండవీటి కోట నమూనా ఉంది. ఆ నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కొండవీడు దారి పడితే కోటలో చూడాల్సిన వాటిలో దేనినీ మిస్ కాకుండా చూడగలుగుతాం. ఈ కోటకు వెళ్లే కొండ దిగువ నుంచి ధూమపానం, మద్యపానం నిషేధం అనే విషయాన్ని పర్యాటకులు మర్చిపోకూడదు. ఈ నిబంధన కచ్చితంగా అమలవుతోంది. -
ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట
-
ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట
సాక్షి, గుంటూరు : రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీకగా ఉన్న 'కొండవీడు కోట'ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత హామీనిచ్చారు. స్థిరమైన వారసత్వ సంపదను సంరక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక రామన్నపేట లోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో 'కొండవీడు అభివృద్ధి' సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సుకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నిముషం పాటు మౌనంతో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి సమర్పణలో ప్రముఖ తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వం చేసిన ' కొండవీడు చరిత్ర వ్యాసాలు' సంకలన గ్రంథాన్ని హోం మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ శత్రు సైన్యాన్ని బంధించడానికి బలంగా పెనవేసిన తాడు వంటిది కొండవీటి దుర్గం అని గుర్తుచేశారు. బాల్యంలో తాను స్థానికంగా కొండవీడు కోట కొండలను చూస్తూ పెరిగానని, అప్పట్లో కోట చేరే మార్గం సరిగా ఉండేది కాదని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కొండవీడు అభివృద్ధికి భారీ ప్రణాళికతో విశాల మనసును చాటారని చెప్పారు. కోవిడ్ పరిస్థితులు మారాక కోట అభివృద్ధి కార్యక్రమాలు శరవేగం అవుతాయన్నారు. ఫిరంగిపురం నుంచి కొండవీడు రోడ్డుమార్గం ఇరుకుగా ఉందని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ శివారెడ్డి తన దృష్టికి తెచ్చారని చెప్పారు. గుంటూరు నుంచి కొండవీడుకు చేరుకునే పర్యాటకులకు ప్రత్యామ్నాయ మార్గంగా అమీనాబాద్ నుంచి కొండవీడుకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేయాలని సుచరిత ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారసత్వ చారిత్రక సంపదగా ఉన్న కొండవీడు సంస్కృతి, సాహితీవైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యమన్నారు. చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజని మాట్లాడుతూ.. కోట అవశేషాలు, చరిత్ర నమూనాలతో ప్రపంచ స్థాయిలో పర్యాటకులకు విలువైన విజ్ఞానమందించే ప్రాంతంగా కొండవీడును అభివృద్ధిలోకి తెస్తామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో కొండవీడు అభివృద్ధిపై నిరంతర సమీక్షలకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎ. శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కొండపల్లి ఖిల్లా, కొండవీడు కోట రెండూ రెడ్డిరాజుల పాలనలో నిర్మించినవేనన్నారు. పరాక్రమమంటే ఇష్టపడే మహావీరులకు సరైన నివాస స్థానం కొండవీడు అన్నారు. ఓటమిని అంగీకరించిన వారికి సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించే సంప్రదాయం కొండవీటి రెడ్డి రాజుల సొంతమని, ఉత్తమ జాతి అశ్వాలకు, వీరులకు, సంపదలకు, మదపుటేనుగులకు పెట్టింది పేరని, రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ.1325 నుంచి క్రీ.శ. 1425 మధ్య రెడ్డి రాజుల పాలన సాగిందన్నారు.శత్రు దుర్భేద్యంగా నిర్మిచిన ఇక్కడి గిరి దుర్గం చారిత్రక సంపదగా వెలురొందిన కొండవీడు ఇక్కడ ఉండటం గుంటూరు జిల్లాకు గర్వకారణమన్నారు. రెడ్డి రాజులు తెలుగును అధికార భాషగా చేసి.. శాసననాలను తెలుగులో రాయించారని, వారి ఆస్థానంలో యర్రాప్రగడ కవిగా.. శ్రీనాథుడు విద్యాధికారిగా పని చేసినట్లు చరిత్ర చెబుతున్నట్లు కలెక్టర్ గుర్తుచేశారు. కోట ముఖద్వారం వద్ద ఆర్చి నిర్మాణం చేసి పర్యాటకుల నుంచి ప్రవేశరుసుం వసూలుపై పరిశీలిస్తామన్నారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ, హెరిటేజ్ సొసైటీ కార్యదర్శి శివారెడ్డి కొండవీడు చరిత్ర ప్రాశస్థ్యం వివరించారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కొండవీడులో ఇక్కడ యోగి వేమన మండపం ఉండేదని చరిత్ర చెబుతుందని.. 15వ శతాబ్దానికి చెందిన కొండవీటి రాయసం పేరయ్య ‘నవనాథ సిద్ధసారం’ అనే ఆయుర్వేద గ్రంథాన్ని ఇక్కడే రచించి ప్రసిద్ధుడయ్యారని గుర్తుచేశారు. కొండవీడుకు ఉన్న విశిష్టత మరే ప్రదేశానికి లేదని, ఇది కాలుష్య రహిత ప్రదేశమన్నారు. దీనిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదాలని కోరారు. జిల్లా ఫారెస్టు రేంజి అధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కోట పర్యాటక అవశేషాలను రక్షించడంలో తమవంతు బాధ్యతను సమర్ధంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ స్వరాజ్య పోరాటయోధుడు సైరా చిన్నప్పరెడ్డి ముది మనుమడు సుబ్బారెడ్డి తన ముత్తాత చరిత్ర పుస్తకాన్ని హోంమంత్రి, కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. -
కొండవీడు దుర్గం.. చారిత్రక అందం
వయ్యారాలు పోయే ఒంపుల దారిలో ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను రా..రమ్మని స్వాగతిస్తుంది. పచ్చల హారం అద్దుకున్న ప్రకృతి కాంత ఆప్యాయంగా పలకరిస్తుంది. కోట బురుజులు.. విశాలమైన ప్రాకారాలు.. వాటి మధ్య తటాకాలు.. అలనాటి ధాన్యాగారాలు.. ఆలయాలు అబ్బురపరుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారసత్వ సంపదగా.. రక్షిత కట్టడంగా వెలుగొందుతున్న కొండవీటి కోటలోకి ఓ సారి తొంగిచూస్తే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. మనసు ఉల్లాసంతో నిండిపోతుంది. శత్రు సైన్యాన్ని బంధించడానికి బలంగా పెనవేసిన తాడు వంటిది కొండవీటి దుర్గం. పరాక్రమమంటే ఇష్టపడే మహావీరులకు సరైన నివాస స్థానం. ఓటమిని అంగీకరించిన వారికి సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించే సంప్రదాయం కొండవీటి రెడ్డి రాజుల సొంతం. ఉత్తమ జాతి అశ్వాలకు, వీరులకు, సంపదలకు, మదపుటేనుగులకు పెట్టింది పేరైన కొండవీడు.. దేవతల రాజధాని అమరావతికి సరిజోడుగా నిలుస్తుంది. - కవి సార్వభౌముడు శ్రీనాథుడి వర్ణనకు సంక్షిప్త రూపం సాక్షి, అమరావతి బ్యూరో: కొండవీడు.. గుంటూరు జిల్లాలోని చారిత్రక ప్రదేశం. పర్యాటకుల స్వర్గధామంగా వెలుగొందుతున్న ఇక్కడి గిరి దుర్గాన్ని రెడ్డి రాజులు నిర్మించారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ.1325 నుంచి క్రీ.శ. 1425 మధ్య రెడ్డి రాజుల పాలన సాగింది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఇక్కడి గిరి దుర్గం చారిత్రక సంపదగా వెలుగొందుతోంది. రెడ్డి రాజులు తెలుగును అధికార భాషగా చేసి.. శాసననాలను తెలుగులో రాయించారు. వారి ఆస్థానంలో యర్రాప్రగడ కవిగా.. శ్రీనాథుడు విద్యాధికారిగా పని చేసినట్లు చరిత్ర చెబుతోంది. పర్యాటకులు ఈ కోటను చేరుకోవడం గతంలో కష్టమయ్యేది. ఇటీవల రోడ్డు నిర్మాణం పూర్తి చేసి.. సౌకర్యాలు కల్పిస్తుండటంతో అక్కడకు సులభంగా చేరుకుని, ప్రకృతి ఒడిలో సేదతీరే అవకాశం కలిగింది. అలనాటి ఆలయాలు.. ఆధ్యాత్మిక లోగిళ్లు రెడ్డి రాజుల అనంతరం కొండవీడును అనేక రాజవంశాలు పాలించాయి. వారంతా శైవ, వైష్ణవ ఆలయాల్ని నిర్మించారు. వాటిలో ఒక శివాలయాన్ని, ఒక లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మిస్తోంది. కుతుబ్షాహి కాలంలో నిర్మించిన రెండు మసీదులు కూడా ఇక్కడ ఉన్నాయి. కోట దిగువ భాగంలో అతి పెద్దదైన గోపీనాథ ఆలయం ఉంది. దీనిని విజయ నగర రాజుల కాలంలో నిర్మించారు. 40 స్తంభాలతో గర్భ గుడి, అంతరాలయం, అర్ధ మండపం, ముఖ మండపం, ప్రాకారం, దీపపు స్తంభాలు ఇక్కడి ప్రత్యేకత. అచ్యుత రాయల కాలంలో రామయ్య భాస్కరుడు అనే మంత్రి తన వద్ద పని చేసిన 72 మంది పాలెగాళ్లు తిరుగుబాటు చేయగా.. వారిని గోపీనాథ ఆలయ ఉత్సవాలకు పిలిచి.. గుడి బావిలో కత్తులు అమర్చి.. వారు అందులో పడి మరణించేలా పథకాన్ని రచించాడని కొండవీటి చరిత్ర చెబుతోంది. కొండల పాదాన గల చంఘిజ్‌ఖాన్ పేటలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వెన్నముద్ద బాలకృష్ణుడు కొలువయ్యాడు. అమీనాబాద్‌లోని చిన్న కొండపై రెడ్డి రాజుల కుల దైవం మూలాంకురేశ్వరిదేవి కొలువై ఉంది. సిద్ధమైన వారసత్వ ప్రదర్శన శాల గతంలో ఇక్కడ యోగ వేమన మండపం ఉండేదని చరిత్ర చెబుతోంది. దీంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య సుమారు రూ.10 కోట్లు వెచ్చించి కొండవీడు వారసత్వ ప్రదర్శన శాల పేరుతో అధునాతన మ్యూజియం నిర్మించింది. ఇవీ ప్రత్యేకతలు - కోటలో మొత్తం 23 బురుజులు ఉన్నట్లు కొండవీడు కైఫీయత్ వెల్లడిస్తోంది - కోటకు నలువైపులా గల చక్కలకొండ బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజు, బి.ఖిల్లా బురుజు శత్రు మూకలను పసిగట్టి సైన్యాన్ని అప్రమత్తం చేయటానికి ఉపయోగపడేవి - అన్ని బురుజుల్లో చుక్కల కొండ బురుజు పెద్దది కాగా.. నెమళ్ల బురుజు అత్యంత పొడవైనది - ఇక్కడి అడవుల్లో 56 రకాల ఔషధ మొక్కలు లభ్యమవుతున్నట్లు వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు - క్రీ.శ. 15వ శతాబ్దానికి చెందిన కొండవీటి రాయసం పేరయ్య ‘నవనాథ సిద్ధసారం’ అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించి ప్రసిద్ధుడయ్యారు ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి కొండవీడుకు ఉన్న విశిష్టత మరే ప్రదేశానికి లేదు. ఇది కాలుష్య రహిత ప్రదేశం. చారిత్రక విశేషాలెన్నో ఇక్కడ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఇదో గొప్ప ప్రాంతం. దీనిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదాలి. - కల్లి శివారెడ్డి, జనరల్ సెక్రటరీ, కొండవీటి హెరిటేజ్ సొసైటీ, గుంటూరు సొగసైన ఘాట్ రోడ్డు - కొండవీటి కోటకు ఘాట్ రోడ్డు మణిహారంగా నిలుస్తుంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది - ఇది 5.1 కిలోమీటర్ల పొడవు.. 30 అడుగుల వెడల్పు.. 17 మలుపులతో మెలికలు తిరిగి ఉంటుంది. కింది నుంచి చూస్తే కొండపైకి భారీ నల్ల త్రాచు వెళుతున్నట్లు అనిపిస్తుంది - రోడ్డుపై ప్రయాణిస్తున్నంత సేపూ ఊటీ లేదా కొడైకెనాల్లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుంది. రాత్రివేళ రహదారి మొత్తం విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతుంది సర్కారు ప్రత్యేకదృష్టి కొండవీడు కోటను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకుల సౌకర్యం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.70 లక్షలతో 7 గజబులు నిర్మిస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.11.80 కోట్లను ఖర్చు చేస్తున్నారు. -
ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును మారుస్తామని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దించేందుకు రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యడ్లపాడు మండలంలోని కొండవీడు సమీపంలో రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల ప్రారంభానికి విచ్చేసిన ఆయన కొండవీడు కోటను శనివారం సందర్శించారు. ఎమ్మెల్యే విడదల రజని, మాజీ ఎమ్మెల్సీ జి.వి.కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డితో కలిసి ఘాట్ రోడ్డు, మహాద్వారం, కొండపై ఉన్న శివాలయం, మూడు చెరువులను పరిశీలించారు. ఇప్పటివరకు కొండవీడులో చేసిన పనుల వివరాలను కలెక్టర్ మంత్రికి తెలియజేశారు. కొండవీడు అభివృద్ధికి సంబంధించి చిన్నారుల పార్కు, వెహికల్ పార్కింగ్‌ల ఏర్పాటు, మూడు చెరువుల అభివృద్ధి, తూర్పువైపు ప్రధాన ద్వారం అభివృద్ధితో పాటు 0.75 కి.మి ఘాట్ రోడ్డు రెండో దశ పనులు, కొండలపై 20 కి.మి మేర ఉన్న కోటగోడ, శిథిలమైన బురుజులను, విద్యుత్తు సబ్‌స్టేషన్, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే విడదల రజని లిఖిత పూర్వకంగా రాసిన లేఖను మంత్రికి అందించారు. నాటి చారిత్రాక అంశాలను, జాతి సంపదకు దుండగుల బారి నుంచి రక్షణ కల్పించాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి మంత్రిని కోరారు. కొండవీడు అభివృద్ధికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజని, అన్నిశాఖల ఉన్నతాధికారులతో ఈ నెల 18న సమీక్షను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. తొలుత జరిగిన మ్యూజియం ప్రారంభోత్సవ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. ప్రపంచపటంలో వై.ఎస్.జగన్ నిలుపుతారు : ఎమ్మెల్యే రజని కొండవీడు అభివృద్ధికి తొలి సంతకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని ఎమ్మెల్యే విడదల రజని చెప్పారు. ఘాట్రోడ్డుతోనే ప ర్యాటక రంగంగా మారుతుందని గ్రహించి ని ధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ము ఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హ యాంలో కొండవీడు పర్యాటక రంగంలో ప్ర పంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. ప్రాచీన సంపదను భావితరాలకు చూపించాలని ప్రైవేటు సంస్థ ఇంతటి బాధ్యత తీసుకొని దిగ్విజయంగా పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే అంశం అన్నారు. ఆంధ్ర చారిత్రక దినంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే గోపిరెడ్డి కొండవీటి చరిత్రను తెలుగులోకి అనువదించిన ప్రముఖ రచయిత మల్లంపల్లి సోమశేఖరశర్మ జయంతి (డిసెంబర్ 9)ని ఆంధ్ర చారిత్రక దినంగా ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యం, పాలనా వైభవాన్ని మాతృభాషలో అందరికీ అందించిన శర్మ జయంతిని చారిత్రక దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి గతంలోనే నివేదించామన్నారు. అనేక ప్రాంతాల్లో రెడ్ల సమాఖ్య పలు కార్యక్రమాలు నిర్వహించిందని, మన ప్రాంతంలో మ్యూజియం నిర్మించడం అభినందనీయమన్నారు. మ్యూజియం ఏర్పాటుకు పట్టుబట్టా : ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి కొండవీటి రెడ్డిరాజుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ఏర్పాటు చేసిన వారసత్వ మ్యూజియంను నాడు అంతా అమీనా బాద్‌లో ఏర్పాటు చేయాలని సూచిం చినా, చిన్న గ్రామమైన హౌస్ గణేష్‌పాడులో ఏర్పా టు చేయాలని తాను కోరినట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. మ్యూజి యం అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి నిధులు ఇచ్చి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కొండవీడు రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, రజని, శ్రీదేవి తదితరులు భావితరాలకు చేరువ చేయండి : నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పూర్వీకుల ఆదర్శాలకు నిదర్శంగా రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోల్కోండ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి, సమాఖ్య పూర్వ అధ్యక్షుడు జంగం శ్రీనివాసరెడ్డి, వి.బాలమద్దిలేటిరెడ్డి, అధ్యక్షుడు వనం వెంకట రామిరెడ్డి, కార్యదర్శి తాతిరెడ్డి, కోశాధికారి తోడేటి నర్సింహ్మారెడ్డి, కల్లి శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, నాయకులు బాలవిజయచంద్రారెడ్డి, బసెల శివరామకృష్ణ, జాకీర్, విడదల లక్ష్మీనారాయణ, బేరింగ్ మౌలాలి, సింగారెడ్డి కోటీరెడ్డి, కాట్రగడ్డ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రారంభోత్సవం ఇలా.. వేదపండితులు ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. ముందుగా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మ్యూ జియం భవనం ప్రారంభించారు. పల్నాటి నాగమ్మ విభాగాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రోలయవేమారెడ్డి విభాగం, కొండవీడు నమూనా విభాగాలను ఎమ్మెల్యే విడదల రజని, రేచర్ల రుద్రారెడ్డి విభాగాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, నంది విగ్రహాన్ని ఎంపీ బ్రహ్మానందరెడ్డి, గ్రంథాలయాన్ని గోల్కోండ గ్రూప్ హోటల్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి ప్రాంభించారు. అతిథులంతా ప్రత్యేక పూజలు చేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. -
కొండగుట్టల్లో.. చారిత్రక ఆనవాళ్లు!
సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : శతాబ్దాల నాటి చరిత్రను పుటలుగా దాచుకున్న కొండవీడుకోటలో అప్పుడప్పుడు అలనాటి అవశేషాలు కనిపిస్తూ అందరిని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. చరిత్ర ఖజాన కొండవీడు కొండలపై గురువారం ఓ రాతితొట్టి బయల్పడింది. అసలు యంత్రాలు ఊసేలేని నాటి కాలంలో ఏకరాతిని ఏమాత్రం పగళ్లు రాకుండా తొలచి 4 అడుగుల పొడవు, 1.5 వెడల్పు, అడుగులోతుతో తయారు చేసిన ఈ తొట్టె క్రీ.శ.1400 నుంచి 1500 శతాబ్దాల కాలానికి చెందినదిగా తెలుస్తోంది. ఆనాటి కొండవీడు రాజధానిలోని అశ్వాలకు నీరు తాగించేందుకు దానిని ఉపయోగించి ఉంటారని కొందరు అభిప్రాయ పడుతుండగా.. అంతకు పూర్వం బౌద్ధభిక్షువులు ఈతొట్టిని ఏర్పాటు చేసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. నాడు అరిటాకు ‘రాతి’ విస్తరి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొండవీడు ఉత్సవాల సమయంలో సందర్శకులకు వసతుల ఏర్పాటు చేస్తున్న క్రమంలో అరిటాకును పోలిన రాతి విస్తరి దొరికింది. అరటి ఆకు, దాని ముందు 8 గిన్నెలను రాతిపై అద్భుతంగా ఏకరాతిపై చెక్కి ఉన్న రాతి విస్తరిని రెడ్డిరాజులు తమ పూజా కార్యక్రమంలో వినియోగించి ఉంటారని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. అంతకు కొద్ది రోజుల ముందే రాముడికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి భారీ ప్రతిమను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఈ విగ్రహానికి పైభాగాన శ్రీనివాసుని శంఖు, చక్రాలు కూడా చెక్కి ఉండటం అధికారులనే కాదు పర్యాటకులను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లోనే వీటికి రంగులు వేసి పర్యాటకులకు సందర్శనార్థం ప్రదర్శనుకు ఉంచారు. ఆ తర్వాత మ్యూజియంకు తరలించారు. వెలుగుచూసిందిలా.. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి కొండవీడు కొండలపై ప్రాంతాలను పరిశీలిస్తుండగా శిథిలమైన ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌కు పశ్చిమాన ఉన్న మార్గం మధ్యలో రాతి తొట్టి కనిపించింది. వెంటనే పురావస్తు, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యంలో పనిచేసే ఉద్యోగులు తమ అశ్వాలకు నీటిని తాగించేందుకు ఈ ప్రాంతంలో తొట్టిని ఏర్పాటు చేసి ఉంటారని, ఈ తొట్టి లభించిన ప్రాంతానికి సమీపంలోనే మత్తడి (నీటివనరు) ఉండటం కూడా వారి వాదనను బలపరుస్తోంది. ఇదే ప్రాంతంలో అలనాటి నివాసాల ఆనవాళ్లు, రోళ్లు పడి ఉన్నాయి. దీనికి అత్యంత సమీపంలోనే కొండరాయి చుట్టూ మర్రిఊడలు అల్లుకున్న సహజ సుందర దృశ్యం పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉంది. -
కోటయ్య కేసు.. నీరుగారుస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: పోలీస్ శాఖ, ప్రభుత్వంపై మచ్చ తెచ్చే ఏ కేసునైనా ప్రభుత్వ పెద్దలు రాజకీయం చేసి నీరుగారుస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొండవీడు ఉత్సవాల్లో భాగంగా సీఎం సభ నేపథ్యంలో మృతి చెందిన బీసీ కౌలు రైతు కోటేశ్వరరావు కేసు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నిలిచింది. పోలీసుల దాడిలోనే కోటేశ్వరరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘రైతు మృతికి పోలీసుల తప్పో లేక ఇంకోటో కావచ్చు. ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తాం’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రకటించారు. సాక్షాత్తూ సీఎం నోటి నుంచి రైతు మృతుకి పోలీసుల ప్రవర్తన కారణం కావచ్చు అని వచ్చినప్పటికీ పోలీసులు పారదర్శకంగా కేసు దర్యాప్తు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు చేయకుండానే ఆత్మహత్యని ప్రకటన ఓ వైపు రైతు కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటన స్థలంలో గొడవ జరిగినట్టు బొప్పాయి చెట్లు విరిగిపోయి కనిపిస్తున్నాయి. బొప్పాయి తోటలోనే పోలీసులు మద్యం తాగి, పేకాడినట్టు పేక ముక్కలు, మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ కేసు దర్యాప్తు మాత్రం పోలీసుల తప్పులేదన్న కోణంలోనే సాగుతోంది. ఎటువంటి దర్యాప్తూ చేయకముందే కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సాక్షాత్తూ జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు నిర్ధారించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీతో విచారణ చేయిస్తామని ఎస్పీ ప్రకటించి ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ ఉన్నతాధికారే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీ నిస్పక్షపాతంగా దర్యాప్తు ఎలా చేస్తారని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల రాజకీయం.. సీఎం పర్యటన సందర్భంగా కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలుగుతుందని టీడీపీ పెద్దలు భావించారు. వెంటనే రైతు మృతిని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దీనికితోడు కేసులో ప్రత్యక్ష సాక్షి, కౌలు రైతు కోటేశ్వరరావు పాలేరు పున్నారావు ఘటన జరిగిన మరుక్షణం నుంచి మాయమై, మంత్రి ప్రెస్మీట్లో ప్రత్యక్షమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ప్రెస్‌మీట్ అనంతరం పున్నారావు తిరిగి కనిపించడంలేదు. ఈ తీరు చూస్తుంటే పున్నారావును బెదిరించి కేసును తొక్కిపట్టే ప్రయత్నాల్లో భాగంగానే టీడీపీ నాయకులు అతడిని నిర్బంధించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.(కోటయ్య ఫోన్ ఎందుకు మాయం చేశారు?) బాధ్యత గల మంత్రి ప్రత్తిపాటి సైతం తన నియోజకవర్గంలో జరిగిన రైతు మృతిపై పూర్తి విచారణ జరపాల్సిందిపోయి, హెలీప్యాడ్ స్థలం అతనిది కాదంటూ కేసును పక్కదారి పట్టిం చేలా మాట్లాడటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తండ్రి పురుగుమందు తాగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదని కోటేశ్వరరావు కుమారుడు వీరాంజనేయులు మొత్తుకుంటున్నారు. అయితే పోలీసులు మా త్రం కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో వెపు ఈ ఘటనపై ఎస్పీ స్పందించిన తీరుకు, సిబ్బంది చెబుతున్న మాటలకు పొంతన కుదురడంలేదు. రైతును రక్షించే సమయంలో అతని కుమారుడు ఘటన స్థలంలో ఉన్నాడని పోలీసులు చెబుతుంటే, మృతుని కుమారుడు మాత్రం పోలీసులే తన తండ్రి మృతదేహాన్ని రోడ్డుపైకి ఎదురు తెచ్చిచ్చారని స్పష్టంచేస్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు సర్వత్రా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కోటేశ్వరరావు భార్య ప్రమీలను ఓదార్చుతోన్న వైఎస్సార్సీపీ చిలకలూరి పేట సమన్వయకర్త విడదల రజని(ఫైల్) కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది? -
రైతు ఉసురు తీసిందెవరు?
చేనుకు చీడ పడితే రైతు కలత పడతాడు. నెత్తురును చెమటచుక్కలుగా మార్చి సాదుకుంటున్న పంట పొలాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొత్త పాలెం గ్రామంలో తన పొలం మీదికి పోలీసులొచ్చారని విన్నప్పుడు రైతు కోటేశ్వరరావు అంతే కంగారుపడ్డాడు. ఆదరాబాదరాగా అక్కడికెళ్లిన ఆ రైతు కాసేపటికే తన కుమారుడికి ఫోన్ చేసి ‘పోలీసులు కొడుతున్నార’ంటూ ఆర్తనాదాలు చేశాడు. అటు తర్వాత కొద్దిసేపటికే విగతజీవుడిగా మారాడు. ల్యాండ్ పూలింగ్తో మొదలుపెట్టి గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎదుర్కొం టున్న వేధింపుల పరంపరలో ఈ ఉదంతం అత్యంత క్రూరమైనది. ముక్కారు పంటలతో, పచ్చని పరిసరాలతో మెరిసే ప్రాంతాన్ని రాజధాని అమరావతి పేరు చెప్పి కాంక్రీటు కీకారణ్యంగా మార్చ డానికి అంకురార్పణ చేసింది మొదలు ఆ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు తప్పడం లేదు. ఇంతకూ రైతు కోటేశ్వరరావు చేసిన నేరమేమిటి? సోమవారం కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పాల్గొన్న బహిరంగసభకు వాహనాల పార్కింగ్ కోసం పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా తీసుకున్న పోలీసులు అందులోని బొప్పాయి తోటను నాశనం చేశారు. దీన్ని ప్రత్య క్షంగా చూసి తట్టుకోలేక ‘ఇదేం అన్యాయమ’ని నిలదీయడమే ఆ రైతు చేసిన నేరం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన ప్రజాప్రస్థానాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ‘యాత్ర’ చిత్రంలో ఒక దృశ్యం అందరినీ కదిలించింది. పంటకు గిట్టుబాటు ధర లభించక నిరాశ చెందిన ఒక రైతు తన కంఠానికి ఉరి బిగించుకున్నప్పుడు అక్కడున్నవారంతా అతడిని ఆదరా బాదరాగా ఆసుపత్రికి చేరుస్తారు. అతడి ప్రాణాలు నిలబడినా మాట పడిపోతుంది. ఏదో చెప్పాలని తాపత్రయపడి చెప్పలేకపోతున్న ఆ రైతుకు వైఎస్ పాత్రధారి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అని భరో సాగా మాట్లాడతాడు. కానీ చంద్రబాబు రాజ్యంలో రైతు కోటేశ్వరరావుకు ఆ అదృష్టం లేక పోయింది. నిక్షేపంలా ఎంతో ఆరోగ్యంతో ఉన్న కోటేశ్వరరావు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడమే కాదు... అయినవారు వచ్చేసరికి కొన ఊపిరితో మిగిలాడు. ఆయన్ను వాహనంలో ఆసుపత్రికి తర లించడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా పోలీసులు వమ్ము చేశారు. సకాలంలో వైద్యం అందివుంటే ఆయన జీవితం నిలబడేదేమో! కానీ అందుకు ప్రభుత్వమే అవరోధంగా నిలబడింది. తండ్రికి వైద్యం చేయించేందుకు తీసుకెళ్తామని ప్రాధేయపడిన అతడి కుమారుడితో ‘సీఎం వచ్చే సమ యమైంది కనుక ఇప్పుడు కుదరద’ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెప్పారు. అంతా అయ్యాక కోటేశ్వ రరావు ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగసభ వేదికపై నుంచి చంద్రబాబు ప్రకటించడమే కాదు... అందుకు పోలీసుల వైఖరో, కుటుంబసమస్యలో కారణం కావొచ్చునని కూడా చెప్పారు. పనిలో పనిగా– సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని హితవు కూడా పలికారు! ఆయన ఎంతో ఉదారంగా రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించడానికి చాలాముందే అధి కారులు రూ. 3 లక్షలిస్తామని కుటుంబంతో బేరసారాలకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న తర్కం వింతగా ఉంది. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే భుజంపై మోసుకెళ్లి రక్షించేందుకు ప్రయత్నించామని, ఇందుకు తమపైనే అభాండాలు వేస్తున్నారని వారు వాపోతున్నారు. వారికి ఉద్యోగం చేయాలంటేనే భయంగా ఉందట! పోలీసుల నైతిక సై్థర్యం దెబ్బతింటే సమాజమే కుప్పకూలుతుందని కూడా వారు సెల విస్తున్నారు. కానీ ఏది చెప్పినా అతికినట్టుండాలి. 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో బొప్పాయి, మునగ, కనకాంబరం తోటల్ని సాగుచేస్తూ అప్పులే లేని కోటేశ్వరరావుకు ఉన్నట్టుండి జీవితంపై ఎందుకు విరక్తి కలిగింది? తన పొలం పాడుచేస్తున్నారన్న కబురందుకుని వెళ్లినవాడు పోలీసులు కొడుతున్నారంటూ ఎందుకు ఫోన్ చేయాల్సివచ్చింది? పురుగుమందు తాగినవారి నోటివెంబడి నురుగలొస్తాయి. కానీ కోటేశ్వరరావు భౌతికకాయంపై నోటివద్ద పురుగుమందు పోసి నట్టుగా ఎందుకుంది? కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆయనతోపాటున్న జీత గాడు పున్నారావు వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం ఎందుకీయలేకపోయాడు? అతడిని పోలీసులు తమ వాహనంలో ఎందుకు బంధించాల్సివచ్చింది? అసలు చావుబతుకుల్లో ఉన్న కోటేశ్వరరావును ఆసుపత్రి వరకూ తరలించకుండా మధ్యలోనే ఒక చెక్‌పోస్టు దగ్గర పోలీ సులు ఎందుకు విడిచిపెట్టారు? పక్కనే ఉన్న హెలిపాడ్ సమీపంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది ఉండగా... దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు ఎందుకునుకున్నారు? ఇంతకూ బాధితుడి సెల్‌ఫోన్ ఏమైంది? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. అడిగితే ‘మా ఆత్మసై్థర్యం దెబ్బతిం టుందిసుమా’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులకు కొత్త కావొచ్చుగానీ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంత పల్లెలు అనునిత్యం ఇలాంటి దౌర్జన్యాలనే చవిచూశాయి. పీపుల్స్‌వార్ పార్టీని అణిచివేసే పేరిట పోలీసులు, వారి మద్దతుతో నయీముద్దీన్ వంటి ప్రైవేటు గూండాలు ఆరోజుల్లో సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. గత నాలుగేళ్లుగా ఏపీలో ఈ పోకడలే కనిపిస్తున్నాయి. అందుకే ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అరటి తోటలకు నిప్పు పెట్టడం మొదలుకొని అన్ని రకాల వింతలూ అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రైతు ఉసురు తీసిన ఉదంతంలో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. అది నిష్పాక్షికంగా సాగాలంటే ఆరోపణలొచ్చినవారందరినీ సస్పెన్షన్‌లో ఉంచాలి. రైతు మరణంపై మర్కట తర్కం చేస్తున్న ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంతకుమించిన దోవ లేదు. -
కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: జిల్లాలోని కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీ రైతు కోటయ్య మృతికి గల వాస్తవాలను వెలికితీసేందుకు యడ్లపాడు మండలం పుట్టకోట పర్యటనకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు వారిని గ్రామంలోకి వెళ్లనీయలేదు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్ సీపీ నేతలు తమ వాహనాలను అక్కడే వదిలేసి గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్ సీపీ నేతలు వెళ్లిన పావుగంట తర్వాత పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు. (రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..) బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య మృతికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన రోజు రైతు కోటయ్య అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై ఎన్నో రకాల అనుమానాలు తలెత్తడంతో.. వాస్తవాలను గుర్తించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలోని ఈ నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉన్నారు. -
కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, విజయవాడ : గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు పొలాన్ని ఆక్రమించడం, చేతికొచ్చిన బొప్పాయి తోటను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన పాపానికి చితకబాదడం.. ఇవీ కోటేశ్వరరావు మృతికి ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా పోలీసులు చివరి సమయంలో అనుసరించిన తీరు కూడా వివాదస్పదమవుతోంది. గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు మాత్రం కోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ముందే ఆత్మహత్య చేసుకున్నాడని మీడియాకు తెలిపారు. తమ పోలీసులే కోటయ్యను భుజాలపై ఆసుపత్రికి మోసుకెళ్లారని చెప్పారు. కానీ, ఎస్పీ వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ చెప్పినదాంట్లో కొంతమాత్రమే నిజమని, కోటయ్యను పోలీసులు మొదటి చెక్‌పోస్ట్ వరకే తీసుకొచ్చి.. వదిలేశారని, దీంతో అక్కడి నుంచి తాము భుజాల మీద రెండో చెక్‌పోస్ట్ వద్దకు తెచ్చామని వారు స్పష్టం చేస్తున్నారు. కోటయ్యను పోలీసులే ఆస్పత్రి వరకు తీసుకెళితే.. మధ్యలో రైతుల భుజాలపైకి ఆయన ఎలా వచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య పొలంలో వాడని పురుగుల మందుడబ్బా అక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కోటయ్య ఆత్మహత్యాయత్నం చేశారని చెబుతున్న పోలీసులు.. వెంటనే ఆయనను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? కోటయ్య ముఖంపై గాయలు ఎలా అయ్యాయని స్థానికులు అడుగుతున్నారు. కోటయ్యను మొదటి చెక్‌పోస్ట్ వరకు పోలీసులు తీసుకొచ్చి వదిలేయడంతో.. అక్కడి నుంచి రెండో చెక్‌పోస్ట్ వరకు తాము భుజాలపై మోసుకెళ్లామని, అక్కడి నుంచి ఫిరంగిపురం ఆస్పత్రికి తీసుకొచ్చినా.. అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారని, దీంతో మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపై కూర్చున్నామని, ముఖ్యమంత్రి వస్తున్నాడని పోలీసులు తరిమేశారని వాపోతున్నారు. -
కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?
-
ఆ రైతును మీరే చంపేశారు : వైఎస్ జగన్
-
కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
-
కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కోటయ్య మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం పూర్తయింది. ఈ సాయంత్రం పుట్టకోటలో కోటయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కోటయ్య మృత దేహానికి పోస్టు మార్టం జరిగింది. వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజేశేఖర్, విడదల రజని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
‘అన్నదాత సుఖీభవ అంటూ రైతు ఉసురు తీశారు’
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అంటూనే రైతు ఉసురు తీశారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్వీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై ఆయన స్పందించారు. మంగళవారం బాధిత కుటంబాన్ని పరామర్శించిన నాగిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం హెలిప్యాడ్ కోసం రైతు కోటయ్య పచ్చటి పొలాన్ని బలవంతంగా తీసుకున్నారని, తోటను మొత్తం చిందరవందగా తొక్కేసారన్నారు. దీన్ని ప్రశ్నించిన కోటయ్యను ఇష్టారీతిగా కొట్టారని, పోలీసుల దెబ్బలకే అతను చనిపోయాడని తెలిపారు. కోటయ్య లాంటి రైతు మరణంపై సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడరని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సాక్షి లేకపోతే ఈ విషయం వెలుగు చూసేదా? అని నిలదీశారు. బీసీ కౌలు రైతు మీద జరిగిన దాడి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, చంద్రబాబుకు అన్నదాత సుఖీభవ అనే అర్హత లేదన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పురుగుల మంది తాగినట్లు చిత్రీకరించారని, ఈ కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కోటయ్య కుటంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. చారిత్రక కొండవీడు కోట ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా సోమవారం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలోని కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇందులో బొప్పాయి, మునగ, కనకాబరం తోటలు సాగు చేస్తున్నాడు. సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా పార్కింగ్ కోసం లాక్కున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన రైతుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. -
రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? : కన్నా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చారిత్రక కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. మీ రైతు వ్యతిరేక వైఖరితో మరో రైతుని బలిచేశారని చంద్రబాబుపై కన్నా ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. 'పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు, విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా? కొండవీడు ఉత్సవాల ఏర్పాట్ల కోసం కోటయ్యకు చెందిన పచ్చని పంటపొలాలను తన సమ్మతి లేకుండా తీసుకునే హక్కు మీకు, పచ్చ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులకు ఎవరిచ్చారు?! సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అని పేర్కొన్నారు. @ncbn, మీ రైతు వ్యతిరేక వైఖరికి మరో రైతుని బలిచేశారు. పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు,విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా?#ShameOnYouCM — Kanna Lakshmi Narayana (@klnbjp) February 19, 2019 ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా పోలీసులు అందుకు అంగీకరించలేదు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు. -
ఆ రైతును మీరే చంపేశారు : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కొండవీడులోని కోటయ్యను కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్లో పేర్కొన్నారు. హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో కోటయ్య తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగాడు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించపోవడంతో రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ? — YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 2019 చదవండి.. సీఎం సభ కోసం రైతును చంపేశారు -
సాక్షి ఎఫెక్ట్: కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం
సాక్షి, గుంటూరు: ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన ఓ రైతు కుటుంబంలో విషాదం నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ రైతు కోటయ్యకు చెందిన కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను పోలీసులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా కోటయ్యను తన పొలంలోకి రానివ్వకుండా అవమానించారు. ఆ తర్వాత కాసేపటికే కోటయ్య అనుమానస్పద రీతిలో మృతి చెందారు. రైతు మృతిని అధికార యంత్రాగం తేలికగా తీసుకుంది. కోటయ్య మృతిపై సాక్షి మీడియా కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. కోటయ్య మృతి చెందిన 20 గంటల తర్వాత పోలీసులు స్పందించారు. అందులో భాగంగా పుట్టకోట చేరుకున్న సీఐ విజయచంద్ర, యడ్లపాడు ఎస్ఐ శ్రీనివాస్ కోటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.(సీఎం సభ కోసం రైతును చంపేశారు) కాగా, పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించలేదని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పార్టీ నాయకులతో కలిసి సీఎం రాకముందే కొత్తపాలెం గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆమెను, పార్టీ నాయకులను మృతుడి ఇంటివద్దకు వెళ్లకుండా గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం వెళ్లిపోయిన అనంతరం పోలీసులు రజనిని అనుమతించటంతో రాత్రి కొత్తపాలెం చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీసీ వర్గాల ఆందోళన.. బీసీ రైతు కోటయ్య మృతిపై బీసీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. బీసీ ఓటర్లు తమ వెంటే ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. ఓ బీసీ రైతు చనిపోతే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నిస్తున్నారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఇదేనా అని పుట్టకోట రైతులు నిలదీశారు. కోటయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అతని కుటుంబానికి 20లక్షల రూపాయల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం రాకకు ముందు శవం తరలింపు...
-
చంద్రబాబు సభ కోసం రైతును చంపేశారు
చిలకలూరిపేట: చారిత్రక కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించలేదు. సీఎం హెలికాప్టర్ దిగేందుకు.. చారిత్రక కొండవీడు కోట ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా ప్రభుత్వం రెండురోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సోమవారం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇందులో బొప్పాయి, మునగ, కనకాబరం తోటలు సాగు చేస్తున్నాడు. సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా పార్కింగ్ కోసం లాక్కున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన పున్నారావుతో కలిసి కోటేశ్వరరావు తన పొలం వద్దకు వెళ్లగా తోటలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం వస్తున్నందున ఈ ప్రాంతమంతా తమ ఆధీనంలో ఉందంటూ అడ్డు చెప్పారు. పోలీసులు కొడుతున్నారంటూ ఫోన్ చేసి చెప్పిన రైతు.. కాపుకొచ్చిన బొప్పాయి తోటలో చొరబడి నాశనం చేయడంతోపాటు ఇష్టారాజ్యంగా కాయలు కోయడాన్ని చూసి ఇదేం అన్యాయమంటూ కోటేశ్వరరావు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు విచక్షణా రహితంగా రైతు కోటేశ్వరావుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండటంతో రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో తనను పోలీసులు తీవ్రంగా కొడుతున్నారంటూ బంధువులకు ఫోన్ ద్వారా కోటేశ్వరరావు సమాచారం అందించాడు. ఈ విషయం తెలియడంతో కోటేశ్వరరావు కుమారుడు ఆంజనేయులు పలువురు గ్రామస్తులతో కలిసి పొలానికి చేరుకున్నారు. అక్కడ తన తండ్రి కనిపించకపోవటంతో పోలీసులను ప్రశ్నించాడు. అయితే ఎక్కడున్నాడో తమకు తెలియదని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అనంతరం పొలంలో గాలించగా కోటేశ్వరరావు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ కనిపించాడు. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు... కొన ఊపిరితో ఉన్న తన తండ్రి కోటేశ్వరరావును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ ఆంజనేయలు పోలీసులను ప్రాధేయపడ్డాడు. ‘మీ కాళ్లు పట్టుకుంటా.. నాన్నను తీసుకువెళ్లనివ్వండి’ అంటూ కన్నీటితో బతిమలాడినా.. ‘సీఎం వచ్చే సమయమైంది. ఇప్పుడు కుదరదు’ అంటూ కరకు సమాధానం లభించిందని ఆంజనేయులు కన్నీటి పర్యంతమయ్యాడు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు. సీఎం రాకకు ముందు శవం తరలింపు... సీఎం రాకకు కొద్ది క్షణాల ముందు కోటేశ్వరరావు మృతదేహాన్ని గ్రామంలోకి వ్యానులో తెచ్చి ఇంటి సమీపంలోని బజారులో దించేశారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు వారంతా సిద్ధమవుతుండగా.. చనిపోయాక తీసుకువెళ్లి ప్రయోజనం ఏముంటుందని పోలీసులు పేర్కొనడంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు అక్కడే నిరసనకు దిగారు. మృతదేహం వద్ద విలపిస్తూ గంట పాటు బైఠాయించి ఆందోళనకు చేపట్టారు. అధికారుల చర్చలు... అనంతరం పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని... ‘జరిగిందేదో జరిగింది. వివాదం ఎందుకు? మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లండి’ అని వారిని ఆదేశించారు. పోలీసులు భారీగా చుట్టుముట్టి మృతదేహాన్ని ఇంట్లోకి తరలించారు. పోలీసుల తీరుపై మృతుడి బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, ఆర్డీవో కె.శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మృతుడి బంధువులతో చర్చలు జరిపారు. అలాంటి అనవాళ్లే లేవన్న గ్రామస్థులు.. పోలీసులతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కోటేశ్వరరావు మనోవ్యధతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొనడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మండిపడ్డారు. కోటేశ్వరరావు ఎంతో ధైర్యవంతుడని, ఆత్మహత్యకు పాల్పడే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. పురుగుమందు తాగితే వెంటనే చనిపోరని, నోటినుంచి నురగ రావటం సర్వసాధారణమని, అయితే కోటేశ్వరరావు విషయంలో అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని పేర్కొంటున్నారు. కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే పురుగులమందు డబ్బా తెచ్చి మృతదేహం సమీపంలో చల్లారని ఆరోపిస్తున్నారు. పండుగ పేరుతో రైతు ఊసురు తీశారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రచారం చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సైతం... అనంతరం సభ ముగిసే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల వైఖరి కారణంగానో, కుటుంబ సమస్యల కారణంగానో పిట్టల కోటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బహిరంగ వేదిక నుంచి ప్రకటించారు. కారణాలు ఏవైనా ఆత్మహత్యకు పాల్పడరాదని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సీఎం పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షలు నష్ట పరిహారంగా అందించనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు... కోటేశ్వరరావు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పార్టీ నాయకులతో కలిసి సీఎం రాకముందే కొత్తపాలెం గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆమెను, పార్టీ నాయకులను మృతుడి ఇంటివద్దకు వెళ్లకుండా గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో విడదల రజని ఫిరంగిపురంలోని పార్టీ నేత భాస్కరరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమెను అనుసరించిన పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. సీఎం వెళ్లిపోయిన అనంతరం అనుమతి.. సీఎం వెళ్లిపోయిన అనంతరం పోలీసులు రజనిని అనుమతించటంతో రాత్రి కొత్తపాలెం చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ కొత్తపాలెం చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.