
సీఎం చంద్రబాబు సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కొండవీడులోని కోటయ్యను కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు. హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో కోటయ్య తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగాడు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించపోవడంతో రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.
కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 2019
చదవండి.. సీఎం సభ కోసం రైతును చంపేశారు