
‘ఎలా ఉన్నారు?’ అంటే ‘వెరీ కూల్’ అన్నట్లుగా సమాధానం చెబుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నెగటివ్ అయ్యారు కదా.. అందుకే కూల్ అన్నమాట. అసలు విషయంలోకి వస్తే.. ఈ నెల 22న తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన రకుల్‌ప్రీత్ సింగ్ మంగళవారం మళ్లీ పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని తెలియజేశారు.
‘‘ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. 2021ని ఆరోగ్యంతో ప్రారంభిస్తాను. అందరూ మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి, ముందు జాగ్రత్త కోసం తగిన జాగ్రత్తలు తీసుకోండి’’ అన్నారు రకుల్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా, ‘ఇండియన్ 2’, ఓ తమిళ సినిమా, హిందీలో ‘మేడే’తో పాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.