‘‘కోవిడ్ బాధితులకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. ఇందులో భాగంగా నేను సైతం అంటూ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారామె. ఈ విషయం గురించి రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితులు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఆక్సిజన్, బెడ్స్, వైద్య పరికరాల కొరత వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు.
గివ్ ఇండియా (ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ కోవిడ్ బాధితుల కోసం మొదలు పెట్టిన ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్) కోసం నేను విరాళాలు సేకరిస్తున్నాను. వీరు ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సంట్రేటర్స్, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్స్‌ను తిరిగి నింపడం వంటి కార్యక్రమాలను చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇవి ఎంతోమంది కోవిడ్ బాధితులకు ఉపయోగపడతాయి. మీరు (ప్రజలు) చేసేది వంద రూపాయల సాయమైనా కావొచ్చు.. అది ఈ క్లిష్ట సమయాల్లో ఎవరికో ఒకరికి మేలు చేస్తుంది. ఈ సంక్షోభ సమయంలో ఎవరికి వారు తోచినంత సహాయం చేసి, కోవిడ్ బాధితుల జీవితాలను కాపాడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment