ప్రపంచయాత్ర చేయాలని ఉంది | Chit chat with actor Rakul Preet Singh | Sakshi
Sakshi News home page

ప్రపంచయాత్ర చేయాలని ఉంది

Published Fri, May 15 2020 12:11 AM | Last Updated on Fri, May 15 2020 5:15 AM

Chit chat with actor Rakul Preet Singh - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

అటు సౌత్‌ ఇటు నార్త్‌ ఇండస్ట్రీస్‌లో హీరోయిన్‌గా మంచి జోరు మీద ఉన్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు బంద్‌ కావడంతో రకుల్‌ స్పీడ్‌కు బ్రేక్‌ పడ్డట్లయింది. దీంతో ఇంటికే పరిమితమైన రకుల్‌ వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే అభిమానులతో మాట్లాడాలనుకున్నారు. ‘ఏమైనా అడగండి.. చెబుతా’ అని ఫ్యాన్స్‌ని కోరారు. ఆ చిట్‌ చాట్‌ విశేషాలు.

► మీ దృష్టిలో విజయానికి నిర్వచనం?
మనం ఎంత సంతోషంగా ఉంటున్నామన్నదే మన విజయాలకు చిహ్నం. మన జీవితంలో సంతోషం లేనప్పుడు ఎంత డబ్బు, ఎంత కీర్తి ఉంటే మాత్రం ఏం లాభం?

► ఎలాంటి వ్యక్తులను మీరు ఇష్టపడరు?
టైమ్‌ వేస్ట్‌ చేసేవారంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. అలాగే ఎవరైతే వారి పని పట్ల అంకితభావంతో ఉండరో వారు కూడా నాకు నచ్చరు.

► విజయాల ప్రభావం మీపై ఎంతవరకూ ఉంటుంది?
నా ఆలోచనలు కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాయి. అతిగా ఆనందపడటం, అతిగా బాధపడటం అనేది ఉండదు. ప్రస్తుతం విజయాలకు, అపజయాలకు అంతగా ప్రభావితం కాని స్థితిలో ఉన్నాను.

► ఒక డేటింగ్‌ చిట్కా ఇవ్వమంటే ఏం చెబుతారు?
మీరు మీలా ఉండండి.

► లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ను నమ్ముతారా?
నమ్మను. తొలిచూపులోనే ప్రేమ పుట్టదనుకుంటున్నాను. అది ఆకర్షణ మాత్రమే.

► మీ తొలిప్రేమ గురించి?
నేనింకా ప్రేమలో పడలేదు. ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నాను.

► ఒక పర్‌ఫెక్ట్‌ కిస్‌ గురించి మీ అభిప్రాయం?
అది మాటల్లో వర్ణించలేనిది. ఫీలవ్వాల్సిందే.

► ఒకవేళ మీ ప్రియుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలిస్తే మీరేం చేస్తారు?
ముందు అతను నన్ను ఎందుకు మోసం చేస్తున్నాడో అడుగుతాను. నిజానికి ఒక బంధంలో మోసానికి చోటు ఉండకూడదు. ఎందుకంటే జస్టిఫై చేయలేం. అందుకే అతన్ని నేను వదిలేస్తాను.

► ఒక మహిళ ఎప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తారని మీ భావన?
ఆమెలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు.

► మీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న ఓ విషయం గురించి చెప్పండి?
నా పట్ల నేను కఠినంగా ఉంటాను. ఉదాహరణకు నాకు ఉదయం 6 గంటలకు షూటింగ్‌ ఉందంటే ఆ రోజు నాలుగు గంటలకే లేచి వర్కౌట్, యోగా చేసి టైమ్‌కి సెట్‌లో ఉంటాను. షూటింగ్‌ అనే కాదు.. టైమింగ్స్‌ విషయంలో కరెక్ట్‌గా ఉండాలని అవసరానికి మించి నన్ను నేను కష్టపెట్టుకుంటాను. దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను.

► ప్రపంచంలో మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు?
వీలైతే ప్రపంచయాత్ర చేయాలని ఉంది. అలాగే వివిధ దేశాల్లోని భిన్న వంటకాల రుచిని ఆస్వాదించాలని ఉంది. ఎందుకంటే నేను భోజన ప్రియురాలిని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement