టీమ్‌వర్క్‌తో మంచి ఫలితాలను సాధించడం గొప్ప నైపుణ్యం. అది కొందరిలోనే ఉంటుంది. అది సానుకూల ధోరణితోనే సాధ్యమవుతుంది. మనలో ఆ నైపుణ్యం ఉందా? ఒకసారి చెక్ చేసుకుందాం.
1. పని అనుకున్నట్లుగా పూర్తికాకపోతే నెపాన్ని ఎవరో ఒకరి మీదకు తోసివేయకుండా రూట్‌కాజ్‌ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
2. నిరాశావాదం, ప్రతికూలమైన ఆలోచనల లాగానే సానుకూల దృక్పథం కూడా ఒక వ్యాధి లాంటిదే. మనం దేనిని మనసావాచా స్వాగతిస్తే అదే మన నైజంగా స్థిరపడుతుంది.
ఎ. అవును బి. కాదు
3. వర్క్‌ప్లేస్‌లో సంభాషణ, సమావేశాల్లో చర్చించే అంశాలు పాజిటివ్‌గా ఉంటేనే, ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నమ్ముతారు.
ఎ. అవును బి. కాదు
4. చర్చలు, సంభాషణలు నెగెటివ్ ధోరణిలో సాగితే ఆ ప్రదేశమంతా నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆ ప్రభావం పని మీద పడుతుంది.
ఎ. అవును బి. కాదు
5. సమస్యను అధిగమించడానికి ఏం చేయాలన్న దాని మీదనే దృష్టిని కేంద్రీకరించాలి తప్ప, మరొకరి మీద అభియోగం మోపి శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. మీ ముందున్న లక్ష్యాన్ని చేరడానికి తగినట్లుగా మీ కింది ఉద్యోగులను ఉత్తేజపరచడం, చైతన్యవంతం చేయడం మీకు అలవాటు.
ఎ. అవును బి. కాదు
7. సానుకూల ధోరణితోనే సత్సంబంధాలను కొనసాగించవచ్చు, నాయకత్వ లక్షణాల్లో ఇది ప్రధానమైంది.
ఎ. అవును బి. కాదు
8. డివైడ్ రూల్ విధానం కొన్నిసార్లు తాత్కాలికంగా ప్రయోజనాలను ఇచ్చినా దీర్ఘకాలంలో అది ప్రతికూలమైన ఫలితాలనిస్తుందని మీ భావన.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సానుకూలదృక్పథంతో ముందుకు పోవడం ఎలాగో మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే మీలో బృందాన్ని నడిపించగలిగిన లక్షణాలు తక్కువనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment