
వాషింగ్టన్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ సోకినట్టు తేలిన బ్రెజిల్ ప్రతినిధి బృందం తన ఫ్లోరిడా రిసార్ట్‌కు వచ్చిన సందర్భంలో వారితో ట్రంప్ సన్నిహితంగా మెలగడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ట్రంప్‌నకు నిర్వహించిన టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అధ్యక్షుడి వైద్యులు సీన్ కోన్లీ తెలిపారు. బ్రెజిల్ బృందంతో డిన్నర్‌లో పాల్గొన్న వారం రోజుల అనంతరం ట్రంప్‌నకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ఆయన చెప్పారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ అమెరికాలో ఇప్పటికే 51 మంది మరణించగా దేశవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండగా..స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment