
వాషింగ్‌టన్: అమెరికాలో కరోనా వైరస్ ఉధృతరూపం దాలుస్తున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వైద్య పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైట్ హౌస్ ఊపిరి పీల్చుకుంది. ఫ్లోరిడాలో గత వారం ట్రంప్‌ని కలుసుకున్న బ్రెజిల్ కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోకు కరోనా సోకడంతో ట్రంప్‌కి కూడా ఈ మహమ్మారి సోకుతుందా అన్న సందేహాలు చుట్టుముట్టాయి. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సియాన్ కోన్లీ ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అమెరికా మరిన్ని చర్యలు చేపట్టింది. బ్రిటన్, ఐర్లాండ్ ప్రయాణాలపై నిషేధం విధించింది. ఇప్పటికే అగ్రరాజ్యంలో 2,100 కేసులు నమోదు కాగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment