
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీలు నష్టపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 39802 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11924 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో ,మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
వరుసగా ఆరు రోజుల లాభాలకు అమెరికా స్టాక్ మార్కెట్లో బ్రేక్ పడింది. ట్రేడర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మంగళవారం స్వల్పంగా వెనకడుగు వేశాయి. ఆసియా మార్కెట్లు ఇదే బాటలోఉన్నాయి. ఇది మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇండియా బుల్స్, ఎస్‌బ్యాంకు జీఎంటర్‌టైన్‌మెంట్, హిందాల్కో, భారతి ఎయిర్టెల్ హీరో మోటా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ ఆసియన్ పెయింట్స్ నష్టాలతో మార్కెట్లు నష్టాల దిశగా పయనిస్తున్నాయి.