
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. బలహీన ప్రారంభంనుంచి మరింత దిగజారి సెన్సెక్స్ 255 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించింది. తద్వారా సెన్సెక్స్ 39వేల దిగువకు, నిఫ్టీ 11550 దిగువకు చేరాయి. బ్యాంకు నిఫ్టీ కూడా 30వేల దిగువకు చేరింది. ఇన్వెస్టర్ల అమ్మకాలు వరుసగా రెండో రోజు కూడా కొనసాగడంతో కీలక సూచీలు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంక్, ఆటో సెక్టార్ నష‍్టపోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్ర అలా అన్ని బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. ఇంకా టాటా మోటార్స్, టాటా స్టీల్, గ్రాసిం, హిందాల్కో, కోల్ ఇండియా, సిప్లా, వేదాంతా, భారతి ఇన్‌ఫ్రాటెల్ నష్టపోతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ హెచ్‌సీఎల్, యస్ బ్యాంకు, రిలయన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, స్పైస్ జెట్ లాంటి ఏవియేషన్ షేర్లు, లాభపడుతున్నాయి.