ఆ ఆరుగురికి నెగెటివ్‌ | Another Six Players Will Go For England Series Says PCB | Sakshi
Sakshi News home page

ఆ ఆరుగురికి నెగెటివ్‌

Published Wed, Jul 1 2020 12:25 AM | Last Updated on Wed, Jul 1 2020 12:25 AM

Another Six Players Will Go For England Series Says PCB - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌తో సహా మొత్తం ఆరుగురు పాకిస్తాన్‌ క్రికెటర్లకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మంగళవారం ప్రకటించింది. దాంతో హఫీజ్, ఫఖర్‌ జమాన్, వహాబ్‌ రియాజ్, మొహమ్మద్‌ హస్‌నైన్, మొహమ్మద్‌ రిజ్వాన్, షాదాబ్‌ ఖాన్‌లకు ఇంగ్లండ్‌ వెళ్లేందుకు పీసీబీ పచ్చ జెండా ఊపింది. త్వరలోనే వీరంతా ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరిన మిగతా పాక్‌ జట్టుతో కలుస్తారని పీసీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే స్పిన్నర్‌ కాశిఫ్‌ భట్టి, పేసర్లు హరీస్‌ రవూఫ్, ఇమ్రాన్‌ ఖాన్‌లతో పాటు బ్యాట్స్‌మన్‌ హైదర్‌ అలీకి మరోసారి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వారిని స్వీయ నిర్బంధంలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు పీసీబీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement