cricket players
-
శుక్రవారం కోచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం
-
కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్ అయ్యాడు!
పుట్టుకతోనే దృష్టి లోపం.. దానికి తోడు కటిక పేదరికం.. సమస్యను సవాల్‌గా స్వీకరించాడు... కృషి, పట్టుదలతో అంధత్వాన్ని జయించాడు. అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా, క్రీడలోనైనా రాణించడం పెద్ద విషయమేమీ కాదు. కంటి చూపు సరిగా లేకపోయినా చదువుతో పాటు క్రికెట్లోనూ రాణిస్తూ పేరుతెచ్చుకున్న గణేష్ విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నల్లమాడ: సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన సరస్వతి, ప్రభాకర్ దంపతులు వ్యవసాయ కూలీలు. అరకొర సంపాదనతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమారుడు గణేష్.. పుట్టుకతోనే దృష్టి లోపంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శస్త్రచికిత్స చేస్తే చూపు మెరుగుపడుతుందన్న వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌నూ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. 30 శాతం కంటి చూపుతో ఉన్న కుమారుడి భవిష్యత్తు తలచుకుని నిరుపేద తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. చదువుల్లో టాప్.. గణేష్ విద్యాభ్యాసం ఆద్యంతం బ్రెయిలీ లిపిలోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ కదిరి సమీపంలోని మొటుకుపల్లి ఆర్డీటీ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదో తరగతి వరకూ అనంతపురం సమీపంలోని పంగల్ రోడ్డులో ఉన్న ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో, ఇంటర్ తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో, అక్కడే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన గణేష్ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. క్రికెట్ అంటే మక్కువ.. గణేష్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఐదో తరగతిలో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆయా పోటీల్లో ప్రతిభ చాటుకోవడంతో అతని క్రీడా ప్రస్థానం మలుపు తిరిగింది. 2012లో తిరుపతి జట్టు తరఫున ఆడి బీ2 (30 శాతం కంటి చూపు ఉన్నవారు) విభాగంలో ఆంధ్రా ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అనంతరం ఆంధ్రాజట్టులో స్థానం దక్కించుకుని ఆల్‌రౌండర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటివరకూ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించాడు. కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వరుసగా మూడు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్టులో గణేష్ ఆటతీరు కీలకంగా మారింది. అజయ్‌కుమార్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఇండియా జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యమని గణేష్ తెలిపాడు. సాధారణ క్రికెటర్లలాగే అంధ క్రికెటర్లను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. గణేష్ సాధించిన విజయాలు 2018 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ నుంచి పాల్గొని జట్టు విజయంలో కీలకంగా మారాడు. 2018లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్నాడు. 2019, 2020లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి నగేష్ ట్రోఫీని ఆంధ్ర జట్టు కైవసం చేసుకోవడంలో కీలకంగా మారాడు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. -
కోట్ల ఖర్చు.. తుస్సుమన్నారు!
-
ఆ ఆరుగురికి నెగెటివ్
లాహోర్: పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్‌తో సహా మొత్తం ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం ప్రకటించింది. దాంతో హఫీజ్, ఫఖర్ జమాన్, వహాబ్ రియాజ్, మొహమ్మద్ హస్నైన్, మొహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్లకు ఇంగ్లండ్ వెళ్లేందుకు పీసీబీ పచ్చ జెండా ఊపింది. త్వరలోనే వీరంతా ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన మిగతా పాక్ జట్టుతో కలుస్తారని పీసీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే స్పిన్నర్ కాశిఫ్ భట్టి, పేసర్లు హరీస్ రవూఫ్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు బ్యాట్స్‌మన్ హైదర్ అలీకి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని స్వీయ నిర్బంధంలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు పీసీబీ పేర్కొంది. -
మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోవిడ్–19 దెబ్బ గట్టిగా తగిలింది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... ఇప్పుడు మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలారు. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య పదికి చేరింది. తాజాగా ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్లకు కరోనా వచ్చినట్లు బయటపడింది. ఈ ఏడుగురు ఆటగాళ్లు కూడా ఫలితాలు వచ్చేవరకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఎసింప్టమిక్‌గానే కనిపించారు. షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్ తదితరుల పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉంది. సోమవారం షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్లకు పాజిటివ్ ఫలితం వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం 29 మందితో భారీ జట్టును పాక్ ప్రకటించగా... ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్‌లను ఎంపిక చేసిన పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది. జూన్ 25న పాక్ ఆటగాళ్లకు తర్వాతి దశ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. -
సఫారీ ఆటగాళ్లంతా సేఫ్
జొహన్నెస్‌బర్గ్: భారత పర్యటనకు వచ్చి... మహమ్మారి దెబ్బకు ఒక్క మ్యాచ్ అయినా ఆడకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు గత నెల తిరుగుముఖం పట్టింది. అయితే భారత్ నుంచి స్వదేశం చేరిన సఫారీ ఆటగాళ్లలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ప్రొటీస్ ఆటగాళ్లు మార్చి 18న దక్షిణాఫ్రికా చేరారు. వీళ్లందరిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచగా... గురువారంతో ఈ స్వీయ నిర్బంధం ముగిసింది. అనంతరం కరోనా పరీక్షలు చేయగా రిపోర్టులన్నీ నెగెటివ్‌గానే వచ్చాయని శుక్రవారం జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ శుయబ్ మంజ్రా తెలిపారు. వీళ్ల నిర్బంధం ముగిసినా మరో రెండు వారాలు ఎక్కడికీ వెళ్లే అవకాశాల్లేవు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలోనూ 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 1400 మందికిపైగా కరోనా బారిన పడగా... ఐదుగురు మృతి చెందారు. -
బంగ్లాదేశ్ వస్తుందా భారత్‌కు?
ఢాకా: భారత్‌లో బంగ్లా పర్యటనకు ఇంకా రోజుల వ్యవధే ఉంది కానీ... ఆటగాళ్ల అనూహ్య నిర్ణయం ఈ సిరీస్‌ను సందిగ్ధంలో పడేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమని మీడియా సమావేశంలో తెగేసి చెప్పారు. సమ్మె బావుట ఎగరేసిన వారిలో మేటి క్రికెటర్లు కెపె్టన్ షకీబుల్ హసన్, మహ్ముదుల్లా, ముషి్ఫకర్ రహీమ్ సహా మొత్తం 50 మంది ఆటగాళ్లున్నారు. దీంతో జాతీయ క్రికెట్ లీగ్‌తో పాటు భారత పర్యటనకు ఆటగాళ్ల సమ్మె దెబ్బ తగలనుంది. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. ఇందులో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగమైన 2 టెస్టుల సిరీస్, మూడు టి20లు ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాలో శిక్షణ శిబిరం మొదలు కావాల్సి ఉంది. ఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అంతర్గత వ్యవహారం. బీసీసీఐ పరిధిలో లేని అంశం. ఏదేమైనా సిరీస్ జరగాలనే ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో ఓ టెస్టు జరగనుంది. ఒకవేళ సిరీస్ జరగకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి పాయింట్ల (120)ను భారత్‌కే కేటాయిస్తుంది. -
ఆర్టిస్ట్ బ్రావో!
క్రికెట్ ప్రేమికులకు వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ డ్వేన్ బ్రావో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆల్‌రౌండర్‌గా క్రికెట్ గ్రౌండ్లో బ్రావో సాధించిన ఘనతలు ఆయన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాయి. ఇప్పుడు బ్రావో క్రికెటర్‌గా మాత్రమే కాదు ఆర్టిస్టుగా కనిపించనున్నారు. ‘మెన్ టేక్ లీడ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ‘ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్’ వంటి డాక్యుమెంటరీలను తెరకెక్కించిన ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కలిగించే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘‘ఇటీవల తమిళనాడులో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో ఇండియాలో ప్లాన్ చేసిన షూటింగ్ పూర్తయింది. ఈ నెలలో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్, టోబాగో లొకేషన్స్‌లో చిత్రీకరణ జరపబోతున్నాం. డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకురాలు ఆర్తి. -
నేనంటే మా క్రికెటర్లకు అసూయ
మెల్బోర్న్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి తన సహచర క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు తానంటే అసూయపడేవారని పీటర్సన్ అన్నాడు. సహచర ఆటగాళ్ల వల్ల తాను బలయ్యానని ఆరోపించాడు. ఏడాది క్రితం వివాదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పీటర్సన్.. సందర్భం వచ్చినప్పుడల్లా తన సహచరులపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కెవిన్ తన ఆత్మకథలో పలు విషయాలను ప్రస్తావించాడు. తన కెరీర్లో జరిగిన పలు సంఘటనల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ ఆరంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో కెవిన్ మాట్లాడుతూ.. ఇక్కడ అసూయ పడే ఆటగాళ్లు ఎవరూ లేరని అన్నాడు. అదే ఇంగ్లండ్‌లో అయితే అసూయ పడేవాళ్లకు కొదవేలేదని చెప్పాడు.