
డ్వేన్ బ్రావో
క్రికెట్ ప్రేమికులకు వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ డ్వేన్ బ్రావో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆల్‌రౌండర్‌గా క్రికెట్ గ్రౌండ్‌లో బ్రావో సాధించిన ఘనతలు ఆయన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాయి. ఇప్పుడు బ్రావో క్రికెటర్‌గా మాత్రమే కాదు ఆర్టిస్టుగా కనిపించనున్నారు. ‘మెన్ టేక్ లీడ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత.
‘ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్’ వంటి డాక్యుమెంటరీలను తెరకెక్కించిన ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కలిగించే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘‘ఇటీవల తమిళనాడులో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో ఇండియాలో ప్లాన్ చేసిన షూటింగ్ పూర్తయింది. ఈ నెలలో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్, టోబాగో లొకేషన్స్‌లో చిత్రీకరణ జరపబోతున్నాం. డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకురాలు ఆర్తి.
Comments
Please login to add a commentAdd a comment