నేను మాటంటే మాటే | Abhishek Bachchan FINALLY Tests Negative For COVID-19 | Sakshi
Sakshi News home page

నేను మాటంటే మాటే

Published Sun, Aug 9 2020 5:53 AM | Last Updated on Sun, Aug 9 2020 5:53 AM

Abhishek Bachchan FINALLY Tests Negative For COVID-19 - Sakshi

‘‘నేను ఏదైనా మాట అంటే ఆ మాట మీద ఉంటాను’’ అంటున్నారు బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌. కరోనా పాజిటివ్‌తో అమితాబ్‌ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్సానంతరం నెగటివ్‌ రావడంతో అమితాబ్, ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్‌ అయ్యారు. అభిషేక్‌ మాత్రం ఆస్పత్రిలో ఉండిపోయారు. శనివారం రిపోర్ట్‌లో ఆయనకు కూడా నెగటివ్‌ వచ్చింది. ‘‘ఫ్రెండ్స్‌.. నేను మీకు ముందే చెప్పాను కదా. కరోనాపై విజయం సాధిస్తానని. నేను మాటంటే మాటే.

మీరు (అభిమానులు, శ్రేయోభిలాషులు) చేసిన ప్రార్థనల వల్లే నేను, మా ఫ్యామిలీ కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డాం. మాకు సేవ చేసిన నానావతి ఆస్పత్రి డాక్టర్లకు, అక్కడి నర్సింగ్‌ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అన్నారు అభిషేక్‌. షారుక్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలోని ‘యూహీ చలా చల్‌రాహి...’ పాటను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విన్నారట. ‘‘ఆ పాట నాకు స్ఫూర్తినిచ్చింది. ఎంతో నమ్మకం కలిగించింది’’ అని కూడా అభిషేక్‌ బచ్చన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement