
అమితాబ్ బచ్చన్
‘‘కరోనా పరీక్షల్లో నాకు నెగటివ్ వచ్చిందనే వార్తల్లో నిజం లేదు’’ అని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలు కరోనా బారిన పడి, చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమితాబ్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిందని, కోవిడ్ 19 నుంచి ఆయన కోలుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా సంతోషించారు. దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ– ‘‘తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చిందనే వార్త తప్పు.. ఇది బాధ్యతారాహిత్యంతో కూడుకున్న ప్రచారం.. నకిలీ వార్త.. పూర్తిగా అబద్ధం’’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment