Nanavati Hospital
-
వరవరరావు పరిస్థితి విషమం
ముంబై: ‘ఎల్గార్ పరిషత్’ కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. దాంతో వరవర రావును ప్రత్యేక కేసుగా పరిగణించి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చి, 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వరవరరావును చూసేందుకు ఆసుపత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి తక్షణమే నానావతి ఆసుపత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు మరణశయ్యపై ఉన్న ఒక 80 ఏళ్ల వ్యక్తికి తలోజా జైళ్లోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్తారు?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రి అయిన నానావతి హాస్పిటల్లో వరవర రావు చికిత్సకు అయిన ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవర రావే భరించాలన్న ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే వాదనను.. వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవన్న కారణాన్ని ప్రభుత్వాలు చూపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘ప్రస్తుతం ఆయన మీ కస్టడీలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలి. అందువల్ల చికిత్స ఖర్చును మీరే భరించాలి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో, ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే రాష్ట్ర హోం మంత్రిని ఫోన్లో సంప్రదించారు. అనంతరం, వరవరరావుకు 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, భవిష్యత్తులో ఈ తరహా కేసులకు దీన్ని ఉదాహరణగా చూపకూడదని అభ్యర్థించారు. ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను.. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దానికి, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ సమాధానమిచ్చారు. అభియోగాల నమోదుకు ఇంకా కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకంటే ఆ అభియోగాలన్నీ ప్రాథమికంగా కంప్యూటర్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని వరవరరావు తరఫున జైసింగ్‌తో పాటు వాదనలు వినిపించిన ఆనంద్ గ్రోవర్ కోర్టుకు వివరించారు. చనిపోతే ఎవరిది బాధ్యత? విచారణ ఇలాగే కొనసాగితే వరవరరావు జైళ్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఇందిర జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పారిపోకూడదనే ఉద్దేశంతోనే విచారణ ఖైదీలను జైళ్లో పెడతారని, కానీ, మానసికంగా దుర్బలమై, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వీవీ పారిపోయే అవకాశమే లేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత? ఆసుపత్రిలో ఆయనకేమైనా అయితే, అది కస్టోడియల్ మరణమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. జైళ్లో సహచరులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా వరవరరావును చూసుకుంటున్నారని, కానీ, వారు వైద్యంలో శిక్షణ పొందినవారు కాదని కోర్టుకు వివరించారు. ఆసుపత్రిలో ఉండగా, వరవరరావుకు చేసిన వైద్య పరీక్షలపై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అవి తప్పై ఉండొచ్చని, వాటిపై ఆయన వయసు 54 ఏళ్లు అని ఉందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. నానావతి హాస్పిటల్లో జరిపిన వైద్య పరీక్షల నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. కోర్టుకు తెలియజేయకుండా ఆయనను ఆసుపత్రి నుంచి పంపించేయవద్దని ఆదేశించింది. వీవీ భార్య హేమలత వేసిన రిట్ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆయనను నానావతి ఆసుపత్రికి మార్చే అంశానికే బుధవారం నాటి వాదనలను పరిమితం చేద్దామని కోర్టు సూచించడంతో, బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగలేదు. విచారణను డిసెంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది. -
వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి
ముంబై: బీమా కోరెగావ్ కేసులో తలోజా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రా యపడింది. వరవరరావు బెయిలు విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. వరవరరావు భార్య హేమలత, తన భర్తని మెరుగైన చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి మార్చాలని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్వతంత్ర వైద్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని, వరవరరావుకు ఉన్న ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర వ్యాఖ్యానించారు. -
నేను మాటంటే మాటే
‘‘నేను ఏదైనా మాట అంటే ఆ మాట మీద ఉంటాను’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. కరోనా పాజిటివ్‌తో అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్సానంతరం నెగటివ్ రావడంతో అమితాబ్, ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ మాత్రం ఆస్పత్రిలో ఉండిపోయారు. శనివారం రిపోర్ట్‌లో ఆయనకు కూడా నెగటివ్ వచ్చింది. ‘‘ఫ్రెండ్స్.. నేను మీకు ముందే చెప్పాను కదా. కరోనాపై విజయం సాధిస్తానని. నేను మాటంటే మాటే. మీరు (అభిమానులు, శ్రేయోభిలాషులు) చేసిన ప్రార్థనల వల్లే నేను, మా ఫ్యామిలీ కరోనా నుండి సురక్షితంగా బయటపడ్డాం. మాకు సేవ చేసిన నానావతి ఆస్పత్రి డాక్టర్లకు, అక్కడి నర్సింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అన్నారు అభిషేక్. షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ చిత్రంలోని ‘యూహీ చలా చల్రాహి...’ పాటను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో విన్నారట. ‘‘ఆ పాట నాకు స్ఫూర్తినిచ్చింది. ఎంతో నమ్మకం కలిగించింది’’ అని కూడా అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. -
నేను ఇంకా ఆస్పత్రిలోనే: అభిషేక్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో అభిషేక్‌కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు అభిషేక్ తెలిపారు. ‘ నాన్న అమితాబ్‌కు తాజా టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. ఇక ఇంటిలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. మీ అందరి ప్రార్థనలు ఫలించడంతో నాన్న కోలుకున్నారు. అందరికీ ధన్యవాదాలు’ అని అభిషేక్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్న అమితాబ్) అదే సమయంలో తనకు మాత్రం మరోసారి జరిపిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని అభిషేక్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ నా శరీరంలో ఇంకా కోవిడ్-19 అవశేషాలు ఉన్నాయి. ఆస్పత్రిలోనే మరికొన్ని రోజులు చికిత్స తీసుకోవాల్సి ఉంది. మా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ థాంక్స్. నేను త్వరలోనే కరోనాను జయిస్తా. ఆరోగ్యంగా తిరిగి వస్తా’ అని అభిషేక్ మరొక ట్వీట్లో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డ అమితాబ్, అభిషేక్‌లు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం అమితాబ్ కరోనాను గెలిచి ఇంటికి వెళ్లగా అభిషేక్ మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంది. అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే వీరిద్దరూ కోలుకున్న సంగతి తెలిసిందే.(వాళ్లకు భూమ్మీద బతికే అర్హత లేదు) I, Unfortunately due to some comorbidities remain Covid-19 positive and remain in hospital. Again, thank you all for your continued wishes and prayers for my family. Very humbled and indebted. 🙏🏽 I’ll beat this and come back healthier! Promise. 💪🏽 — Abhishek Bachchan (@juniorbachchan) August 2, 2020 🙏🏽 my father, thankfully, has tested negative on his latest Covid-19 test and has been discharged from the hospital. He will now be at home and rest. Thank you all for all your prayers and wishes for him. 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) August 2, 2020 -
కరోనా నుంచి కోలుకున్న అమితాబ్
ముంబై: కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. కరోనా నుంచి అమితాబ్ బచ్చన్ కోలుకొని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌తో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్.. నేడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కరోనా పరీక్షల్లో అమితాబ్‌కు నెగటివ్ వచ్చిందనే నకలీ వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీని పై అమితాబ్ ఘాటుగానే స్పందించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వార్తలను ప్రచారం చేయవద్దని అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య, ఇద్దరు కోలుకున్నారు. (వాళ్లకు భూమ్మీద బతికే అర్హత లేదు) -
వీవీని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై : భీమా కొరేగావ్ కేసులో నిర్భంధంలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును(వీవీ) కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు వారికి అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్‌కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు వీవీ ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) కాగా, భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వీవీ ఏడాదిన్నరగా తలోజా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీవీని కలిసేందుకు తమకు అనుమతించాలని.. ఆయన తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంఘాలు కూడా ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
నానావతి ఆస్పత్రికి వరవరరావు
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును పోలీసులు నానావతి ఆస్పత్రికి తరలించారు. శనివారం రోజున ఆయనను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించాలని, అందుకయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో, కరోనా వైరస్ బారిపడిన ఆయనను శనివారం అర్ధరాత్రి సమయంలో నానావతి హాస్పిటల్‌కు తరలించినట్లు సెయింట్ జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. (మౌనం ఒక యుద్ధ నేరం) కాగా.. మహారాష్ట్రలోని తలోజా జైలులో భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా వరవరరావు ఏడాదిన్నరగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఆయనకు జరిపిన కోవిడ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనకు కోవిడ్ చికిత్సను అందించడానికి ముంబైలోని నానావతి ఆస్సత్రికి తరలించారు. (‘వీవీ విడుదలకు జోక్యం చేసుకోండి’) -
ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ (77) ఆస్పత్రి నుంచి శుక్రవారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. ఆయన వెంట సతీమణి జయాబచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా నాలుగు రోజుల క్రితం ఆయన నానావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమితాబ్.. ఆ చికిత్సలో భాగంగా క్రమం తప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్‌బీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా వరుసగా రెండు ట్వీట్లు చేసి అభిమానులను పలుకరించారు. తొలుత జయాబచ్చన్‌తో కార్వా చౌత్ పండుగలో పాల్గొన్న ఓ ఫొటోను షేర్ చేసిన అమితాబ్ .. దానికి అందమైన క్యాప్షన్ జత చేశారు. ‘నాలో సగం. అందుకే హాఫ్ ఇమేజ్ కనిపించేటట్టు షేర్ చేశా. మిగతా సగం కనిపించాల్సిన అవసరమేముంది’అని ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో జయాతో కలిసి వారం క్రితం పాల్గొన్న ఒక ఈవెంట్ ఫొటో షేర్ చేశారు. ఇదిలాఉండగా.. 20 ఏళ్ల క్రితం కూలీ నెం.1 సినిమా షూటింగ్లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆసమయంలో జరిగిన ఓ పొరపాటు బిగ్‌బీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. సరైన రక్తం ఎక్కించని కారణంగా ఆయన కాలేయం చెడిపోయింది. తన కాలేయంలో కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తుందని, అయినప్పటికీ వైద్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని బిగ్‌బీ ఓ సందర్భంలో చెప్పారు. ఇక అమితాబ్ తాజాగా ‘చెహ్రే అండ్ గులాబో సితాబో’ చిత్రంలో నటిస్తున్నారు. దాంతోపాటు కౌన్ బనేగా కరోడ్ పతి 11వ సీజన్‌కు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. T 3520 - .. the better half .. !! 🌹 quite obviously the other half is irrelevant .. and therefore unseen 🤣🤣🤣 pic.twitter.com/0Fivuw5cwY — Amitabh Bachchan (@SrBachchan) October 17, 2019 -
షారుక్ ఖాన్‌కు గాయాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ గురువారం నాడు ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. దాంతో వెంటనే ఆయనను ముంబైలోని డాక్టర్ బాలాభాయ్ నానావతి ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ జరుగుతుండగా షారుక్ ఖాన్‌కు సెట్స్ మీద చిన్నపాటి ప్రమాదం జరిగిందని, కొద్దిగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించామని, ఆయనిప్పుడు క్షేమంగానే ఉన్నారని షారుక్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలో షారుక్ ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 'హేపీ న్యూ ఇయర్' అనే చిత్రం షూటింగులో ఉండగా 48 ఏళ్ల షారుక్ ఖాన్ గాయపడ్డారని ఆయన సన్నిహితుడు కరీం మొరానీ తనకు చెప్పినట్లు సినిమాల ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా తెలిపారు. షారుక్ ఖాన్‌కు నుదుటి మీద చిన్న కోత పడిందని, ఆయనను ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స చేసి డిశ్చార్జి చేశారని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ షూటింగులో పాల్గొంటున్నారని చెప్పారు. ఆస్పత్రిలో షారుక్ వెంట ఆయన భార్య గౌరీఖాన్ ఉన్నారు. అయితే.. షారుక్ విడుదల కావడానికి కొద్ది ముందుగానే గౌరి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆస్పత్రి వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. SRK injured on the sets of #HappyNewYear. Minor injuries, his associate Karim Morani just informed me. — taran adarsh (@taran_adarsh) January 23, 2014