షారుక్ ఖాన్కు గాయాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి | Shah Rukh khan injured, discharged from Nanavati Hospital | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్కు గాయాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

Published Thu, Jan 23 2014 4:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షారుక్ ఖాన్కు గాయాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి - Sakshi

షారుక్ ఖాన్కు గాయాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ గురువారం నాడు ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. దాంతో వెంటనే ఆయనను ముంబైలోని డాక్టర్ బాలాభాయ్ నానావతి ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ జరుగుతుండగా షారుక్ ఖాన్కు సెట్స్ మీద చిన్నపాటి ప్రమాదం జరిగిందని,  కొద్దిగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించామని, ఆయనిప్పుడు క్షేమంగానే ఉన్నారని షారుక్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలో షారుక్ ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 'హేపీ న్యూ ఇయర్' అనే చిత్రం షూటింగులో ఉండగా 48 ఏళ్ల షారుక్ ఖాన్ గాయపడ్డారని ఆయన సన్నిహితుడు కరీం మొరానీ తనకు చెప్పినట్లు సినిమాల ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా తెలిపారు.

షారుక్ ఖాన్కు నుదుటి మీద చిన్న కోత పడిందని, ఆయనను ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స చేసి డిశ్చార్జి చేశారని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ షూటింగులో పాల్గొంటున్నారని చెప్పారు. ఆస్పత్రిలో షారుక్ వెంట ఆయన భార్య గౌరీఖాన్ ఉన్నారు. అయితే.. షారుక్ విడుదల కావడానికి కొద్ది ముందుగానే గౌరి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆస్పత్రి వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement