injured in shooting
-
షూటింగ్లో యంగ్ హీరోకు గాయాలు
బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో పోలీస్ ఫోర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ యాక్షన్ సీన్‌కు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేశాడు హీరో. ఇందులో ప్రత్యర్థిని చితకబాదుడుతున్నాడు సిద్దార్థ్. ఈ రియల్ ఫైటింగ్లో నిజంగానే హీరో చేతికి గాయాలయ్యాయి. మోచేతికి చిన్నచిన్న గాయాలై రక్తాలు కారాయి. ఈ ఫొటోను అతడు అభిమానులతో పంచుకోగా ఇది చూసిన ఫ్యాన్స్ కొందరు సిద్దార్థ్‌పై పొగడ్తలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి దెబ్బలు మాకు చాలానే తగిలాయిలే అని సెటైర్లు వేస్తున్నారు. కాగా పోలీస్ ఫోర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) చదవండి: సీక్రెట్‌గా సినిమా చూసిన సాయిపల్లవి, వీడియో వైరల్ తండ్రి ముందే బికినీలో కేక్ కటింగా? అంటూ ట్రోలింగ్.. గట్టి కౌంటరిచ్చిన ఐరా -
యంగ్ హీరోకు తీవ్ర గాయాలు
యువ హీరో నాగశౌర్య ఓ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. ‘ఛలో, నర్తనశాల’ తర్వాత నాగశౌర్య సొంతబ్యానర్లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో నాగశౌర్య కాలికి తీవ్ర గాయమైంది. ఎటువంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో వైద్యులు అతన్ని 25 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే నాగశౌర్య సిబ్బంది అతన్ని వీల్‌చైర్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
సియాటెల్‌లో దుండగుడి కాల్పులు, ఇద్దరు మృతి
వాషింగ్టన్: ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలైన ఘటన బుధవారం వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలో చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడు ముందుగా ఒక వాహనం దగ్గరికి వెళ్లి అందులోని మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత సమీపంలోని మెట్రో బస్సు మీద దాడికి తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కూడా సదరు డ్రైవర్ బస్సును ఆగంతకుడికి దూరంగా తీసుకెళ్లి, ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు. కొద్ది క్షణాలకే ఆ డ్రైవర్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సదరు కారు డ్రైవర్ కూడా మరణించాడని.. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరిపి, నిందితుడ్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. బస్పు దాడిలో గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడికి కూడా గాయాలవడంతో అతడిని హార్బోర్‌వ్యూ మెడికల్ సెంటర్లో చేర్పించి పోలీసుల గస్తీలో ఉంచారని తెలుస్తోంది. -
షూటింగులో గాయపడిన నీతూచంద్ర
'గోదావరి' సినిమాలో రెండో హీరోయిన్గా నటించిన నీతూచంద్ర తమిళ సినిమా షూటింగులో గాయపడింది. తమిళ మ్యూజికల్ థ్రిల్లర్ సినిమా 'వైగై ఎక్స్‌ప్రెస్' షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సెట్ మీద ఆమె గాయపడింది. ఆమె కన్ను వాచిందని, చేతులు పలుచోట్ల కొట్టుకుపోయాయని సినిమా వర్గాలు తెలిపాయి. డైరెక్టర్ వెంటనే షూటింగు ఆపేశారని, నీతు గాయాల కారణంగా నొప్పితో బాధపడుతోందని అన్నారు. వైద్యులు ఆమెను పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్న 'వైగై ఎక్స్‌ప్రెస్' సినిమాలో నీతూచంద్ర కెరీర్లోనే తొలిసారిగా డబుల్ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో సుజా వరుణీ, కోమల్ శర్మ, నాజర్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. -
సినిమా షూటింగులో విశాల్‌కు గాయాలు
-
సినిమా షూటింగులో విశాల్‌కు గాయాలు
హీరో విశాల్‌కు ఓ తమిళ సినిమా షూటింగులో గాయాలయ్యాయి. ఆంబల అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. అందులో ఓ ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, మధ్యలో వైరు తెగి పడింది. దాంతో విశాల్ కింద పడిపోయాడు. మధ్యాహ్నం ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. అందులో రోప్ కట్టుకుని కిందకు దూకాలి. అది తెగిపోవడంతో 20 అడుగుల పైనుంచి కిందకు పడ్డాడు. కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం కోయంబత్తూరు తరలించారు. ఒక కాలు బెణికిందని, మరో కాలు ఎముక చిట్లిందని అంటున్నారు. గాయాలు కావడంతో ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా స్వయంగా విశాలే. సి.సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో విశాల్ సరసన హన్సిక హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా ప్రభు, వైభవ్ రెడ్డి, మధురిమ, మాధవీలత, రమ్యకృష్్ణ, కిరణ్ రాథోడ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో ఉన్నారు. -
షూటింగ్లో మళ్లీ గాయపడ్డ 'టెర్మినేటర్'
ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటున్నాడు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ (66). నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినిమా కెరీర్లో దాదాపు ప్రతి సారీ ఆయన గాయపడుతూనే ఉన్నాడు. వాటిలో చాలాసార్లు ఆయన ఎమర్జెన్సీలోకూడా చేరాడు. ఇప్పుడు మరోసారి యాక్షన్ సినిమాలో నటిస్తూ ఈ బాడీబిల్డర్ హీరో గాయపడ్డాడు. తాను గాయపడటం నిర్మాతలకు ఏమాత్రం ఇష్టం ఉండదని, అలా గాయపడితే కొన్నాళ్ల పాటు సినిమా ఆగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారని, అయినా కూడా సినిమాల్లో అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో చేసేటప్పుడు గాయాలు తప్పవని ఆయన అన్నాడు. చాలా సార్లు తాను ఎమర్జెన్సీ రూం నుంచి నేరుగా వచ్చి షూటింగులో పాల్గొన్నానని, కానీ కాలో చెయ్యో విరిగితే మాత్రం కొన్నాళ్ల పాటు అన్నీమూసేయక తప్పదని చెప్పాడు. గతంలో బాడీబిల్డింగ్ ఛాంపియన్‌గా కూడా నిలిచిన ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్.. టెర్మినేటర్ లాంటి సినిమాలతో భారత ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. -
ఆగడు షూటింగ్లో గాయపడ్డ మహేష్
-
షూటింగ్లో గాయపడిన అమీషా పటేల్
కహోనా ప్యార్ హై చిత్రంతో తెరంగేట్రం చేసిన అమీషా పటేల్.. తాజాగా ఓ చిత్రం షూటింగులో యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటూ గాయపడింది. 37 ఏళ్ల అమీషా పటేల్, గత వారం ఓ సినిమా కోసం ఫైటింగు చేస్తుండగా ఆమె మోకాలికి దెబ్బ తగిలింది. కొన్ని రోజుల క్రితం ఈ గాయం తగిలిందని, ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తుంటే పడిపోయానని, మోకాలుకు దెబ్బ తగిలిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. Thank u my tweethearts 4 all the concern..got injured a few days ago.fell v badly during an action sequence..knee is hurt but recovering — ameesha patel (@ameesha_patel) January 29, 2014 ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని, తనను పలకరించిన వారందరికీ కృతజ్ఞతలని కూడా ఆమె చెప్పింది. తాను గాయపడిన వెంటనే సెట్ వద్దకే డాక్టర్‌ను పిలిపించారని, తనకు వెంటవెంటనే మందులు, ఇంజెక్షన్లు ఇచ్చారని అంది. గత వారమే ఇదంతా జరిగినా అప్పుడే ఎవరికీ చెప్పనందుకు క్షమాపణలు కూడా కోరింది. Doctor was called n I was administered medicines n injections immediately — ameesha patel (@ameesha_patel) January 29, 2014 Sorry didn't tell u all last week when it happened but didn't want it to worry anyone.. — ameesha patel (@ameesha_patel) January 29, 2014 -
షారుక్ ఖాన్‌కు గాయాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ గురువారం నాడు ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. దాంతో వెంటనే ఆయనను ముంబైలోని డాక్టర్ బాలాభాయ్ నానావతి ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ జరుగుతుండగా షారుక్ ఖాన్‌కు సెట్స్ మీద చిన్నపాటి ప్రమాదం జరిగిందని, కొద్దిగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించామని, ఆయనిప్పుడు క్షేమంగానే ఉన్నారని షారుక్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలో షారుక్ ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 'హేపీ న్యూ ఇయర్' అనే చిత్రం షూటింగులో ఉండగా 48 ఏళ్ల షారుక్ ఖాన్ గాయపడ్డారని ఆయన సన్నిహితుడు కరీం మొరానీ తనకు చెప్పినట్లు సినిమాల ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా తెలిపారు. షారుక్ ఖాన్‌కు నుదుటి మీద చిన్న కోత పడిందని, ఆయనను ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స చేసి డిశ్చార్జి చేశారని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ షూటింగులో పాల్గొంటున్నారని చెప్పారు. ఆస్పత్రిలో షారుక్ వెంట ఆయన భార్య గౌరీఖాన్ ఉన్నారు. అయితే.. షారుక్ విడుదల కావడానికి కొద్ది ముందుగానే గౌరి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆస్పత్రి వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. SRK injured on the sets of #HappyNewYear. Minor injuries, his associate Karim Morani just informed me. — taran adarsh (@taran_adarsh) January 23, 2014