షూటింగ్లో మళ్లీ గాయపడ్డ 'టెర్మినేటర్' | Arnold Schwarzenegger Injured again in shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్లో మళ్లీ గాయపడ్డ 'టెర్మినేటర్'

Published Mon, May 5 2014 10:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

షూటింగ్లో మళ్లీ గాయపడ్డ 'టెర్మినేటర్'

షూటింగ్లో మళ్లీ గాయపడ్డ 'టెర్మినేటర్'

ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటున్నాడు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ (66). నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినిమా కెరీర్లో దాదాపు ప్రతి సారీ ఆయన గాయపడుతూనే ఉన్నాడు. వాటిలో చాలాసార్లు ఆయన ఎమర్జెన్సీలోకూడా చేరాడు. ఇప్పుడు మరోసారి యాక్షన్ సినిమాలో నటిస్తూ ఈ బాడీబిల్డర్ హీరో గాయపడ్డాడు.

తాను గాయపడటం నిర్మాతలకు ఏమాత్రం ఇష్టం ఉండదని, అలా గాయపడితే కొన్నాళ్ల పాటు సినిమా ఆగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారని, అయినా కూడా సినిమాల్లో అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో చేసేటప్పుడు గాయాలు తప్పవని ఆయన అన్నాడు. చాలా సార్లు తాను ఎమర్జెన్సీ రూం నుంచి నేరుగా వచ్చి షూటింగులో పాల్గొన్నానని, కానీ కాలో చెయ్యో విరిగితే మాత్రం కొన్నాళ్ల పాటు అన్నీమూసేయక తప్పదని చెప్పాడు. గతంలో బాడీబిల్డింగ్ ఛాంపియన్గా కూడా నిలిచిన ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్.. టెర్మినేటర్ లాంటి సినిమాలతో భారత ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement