
ఆగంతకుడు దాడులు జరిపిన బస్సు
వాషింగ్టన్: ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలైన ఘటన బుధవారం వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలో చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడు ముందుగా ఒక వాహనం దగ్గరికి వెళ్లి అందులోని మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత సమీపంలోని మెట్రో బస్సు మీద దాడికి తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కూడా సదరు డ్రైవర్ బస్సును ఆగంతకుడికి దూరంగా తీసుకెళ్లి, ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు. కొద్ది క్షణాలకే ఆ డ్రైవర్ మరణించాడు.
విషయం తెలుసుకున్న పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సదరు కారు డ్రైవర్ కూడా మరణించాడని.. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరిపి, నిందితుడ్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. బస్పు దాడిలో గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడికి కూడా గాయాలవడంతో అతడిని హార్బోర్‌వ్యూ మెడికల్ సెంటర్‌లో చేర్పించి పోలీసుల గస్తీలో ఉంచారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment