Elon Musk Shocking Tweet On Talibans For Not Wearing Masks - Sakshi
Sakshi News home page

Elon Musk Tweet On Taliban: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్‌ మస్క్‌, వైరల్‌

Published Sun, Aug 22 2021 3:52 PM | Last Updated on Sun, Aug 22 2021 6:14 PM

Elon Musk Tweet On Taliban About Mask Goes Viral - Sakshi

వాషింగ్టన్‌: స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్‌ మస్క్‌ మొదటిసారిగా తాలిబన్లపై స్పందించారు. తాలిబన్లు మాస్క్‌లు లేకుండా ఓ చోట సమావేశమైన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్‌ గురించి తాబలిన్లకు తెలియదా.. దాని గురించి వినలేదా అని ఎలన్ మస్క్ తాలిబన్లకు ట్విటర్‌ వేధికగా ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరలువుతోంది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. "నిజమేనా? మీరు దానిపై తాలిబన్లను విమర్శించబోతున్నారా? యూఎస్ 20 సంవత్సరాల పాటు చేయలేనిది.. వారు 19 రోజుల్లో సాధించిన దాని గురించి కాదా.. అది అంత ప్రాధాన్యం లేనిదా? ఈ సమయంలో డెల్టాకు ప్రాధాన్యత లేదని నేను భావిస్తున్నాను" అని ఓ ట్విట్టర్ వినియోగదారు వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. "అవును, అది దృష్టి పెట్టవలసిన ప్రధాన అంశం" అంటూ చమత్కరించాడు.

చదవండి: కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు మృతి

కాగా తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో.. ఆ దేశాధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయాడు.  గత పదిహేను రోజులుగా తాలిబన్లకు, అఫ్గన్‌ దళాలకు జరిగిన పోరులో ఆ దేశ రక్షణ దళాలు చేతులెత్తేశాయి దీంతో తాలిబన్లు గతవారం రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. దీంతో అమెరికా, జర్మనీ తమ పౌరులను కాబూల్‌ విమానాశ్రయానికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ గందరగోళం మధ్య ఆస్ట్రేలియా రాత్రికి రాత్రే అనేక మంది తమ దేశ పౌరులను అఫ్గాన్‌ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ప్రకటించింది. అయితే కనీసం 15,000 మంది అమెరికన్లు, 50,000-60,000 మంది అఫ్గాన్‌ మిత్రదేశాలకు చెందిన వారు ఆ దేశం నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
 

చదవండి: లోకేష్‌ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం
 

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement