వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్‌లో కొత్తగా రెండు వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్‌వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు.
ఇటీవలే సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్‌ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment