gunmen attack
-
వర్గపోరాటంలో అమాయకులు బలి
పెషావర్: షియా, సున్నీ గిరిజన వర్గాల మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న పోరులో తాజాగా అమాయక ప్రజలు బలయ్యారు. గురువారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో పర్వతమయ ప్రాంతాల గుండా వెళ్తున్న సాధారణ ప్రయాణికుల వాహన శ్రేణిపై సాయుధ మిలిటెంట్లు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. ప్రాణభయంతో కొందరు వాహనాల సీట్ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. మృతులంతా మైనారిటీ షియా వర్గానికి చెందిన వాళ్లేనని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో షియా, సున్నీ గిరిజన సాయుధ ముఠాల మధ్య పరస్పర దాడులు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా గిరిజన మండలి ఒకటి కాల్పుల విరమణకు పిలుపునిచ్చాక ఈ మార్గంలో ఇటీవల పౌరుల రాకపోకలు మొదలయ్యాయి. పౌర వాహనాలకు రక్షణగా పోలీసు వాహనం ముందుగా ఎస్కార్ట్‌గా బయల్దేరగా దానిపై తొలుత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ముఠా ప్రకటించుకోలేదు. అయితే తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రసంస్థే ఈ కాల్పులకు పాల్పడి ఉంటుందని స్థానిక పాత్రికేయులు చెబుతున్నారు. పరాచినార్ నుంచి పెషావర్‌కు కాన్వాయ్‌గా వెళ్తున్న 50 వాహనాలపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒకే దాడిలో ఇంతమంది మరణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. At least 39 killed on Thursday (Nov 21) after gunmen opened fire on passenger vehicles in the #Kurram district of #Pakistan's Khyber Pakhtun.The convoy of vehicles was travelling from Parachinar to #Peshawar when unidentified gunmen attacked in the Uchat area of Kurram pic.twitter.com/U1SnQbOUzi— Ravi Pratap Dubey 🇮🇳 (@ravipratapdubey) November 21, 2024 -
బార్లోకి చొరబడి కాల్పులు.. 12 మంది మృతి!
మెక్సికో సిటీ: గుర్తు తెలియని కొందరు దుండగులు బారులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సెంట్రల్ మెక్సికో ఇరాపుటో నగరంలో శనివారం రాత్రి జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటన జరగటం ఇది రెండోది కావటం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు సిటీ ప్రభుత్వం తెలిపింది. నరమేధానికి పాల్పడిన దుండగుల కోసం భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. బార్లోకి చొరబడి కాల్పులు జరిపేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. గ్వానాజువాటో ప్రధానంగా ప్రపంచస్థాయి కార్ మేకర్స్‌కు తయారీ హబ్‌గా ఉంది. అయితే.. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ గ్యాంగ్స్ మధ్య భీకర పోరు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న గ్వానాజువాటోలోని ఓ బార్లో కాల్పులు జరగటం వల్ల 10 మంది మరణించారు. 2018లో అధికారం చేపట్టిన అధ్యక్షుడు అండ్రెస్ మన్యూయెల్ లోపేజ్ ఒబ్రేడర్.. గ్యాంగ్ హింసలను తగ్గించారు. అయితే.. డ్రగ్స్ ముఠాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఇదీ చదవండి: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి -
సియాటెల్‌లో దుండగుడి కాల్పులు, ఇద్దరు మృతి
వాషింగ్టన్: ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలైన ఘటన బుధవారం వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలో చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడు ముందుగా ఒక వాహనం దగ్గరికి వెళ్లి అందులోని మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత సమీపంలోని మెట్రో బస్సు మీద దాడికి తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కూడా సదరు డ్రైవర్ బస్సును ఆగంతకుడికి దూరంగా తీసుకెళ్లి, ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు. కొద్ది క్షణాలకే ఆ డ్రైవర్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సదరు కారు డ్రైవర్ కూడా మరణించాడని.. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరిపి, నిందితుడ్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. బస్పు దాడిలో గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడికి కూడా గాయాలవడంతో అతడిని హార్బోర్‌వ్యూ మెడికల్ సెంటర్లో చేర్పించి పోలీసుల గస్తీలో ఉంచారని తెలుస్తోంది. -
ఆఫ్ఘనిస్ధాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
ముష్కర దాడికి ఏడాది
‘పేట’లో భద్రత డొల్ల..! హైటెక్ బస్టాండ్‌లో కానరాని పోలీస్ ఔట్‌పోస్టు.. నేతల హామీలు ప్రకటనలకే పరిమితం పనిచేయని సీసీ కెమెరాలు.. అత్యాధునిక ఆయుధాలు కరువు.. సరిగ్గా ఏడాది క్రితం.. ఏప్రిల్ 1వ తేదీన అర్ధరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో సీఐ మొగిలయ్య ఆధ్వర్యంలో పోలీసులు తని ఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని కిందికి దించి విచారిస్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు తేరుకునే లోపే కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ నేలకొరగగా.. సీఐ వై.మొగలయ్య, మరో హోంగార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. ముష్కర మూక దాడికి ఏడాది పూర్తయిన సూర్యాపేటలో భద్రత డొల్లగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. - సూర్యాపేట రెండు రాష్ట్రాలను కలుపుతూ.. అత్యంత రద్దీగా ఉండే 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ పట్టణాల్లో సూర్యాపేట హైటెక్ బస్టాండ్ పేరుగాంచింది.ఈ బస్టాండ్‌కు నిత్యం వేలాది బస్సులు వచ్చిపోతుంటాయి.. లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ముష్కరులు దాడి చేసి పరారైన వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు, హోంశాఖామంత్రి, మంత్రులు బస్టాండ్‌ను సందర్శించారు. అదే సమయంలో పేటలో, హైటెక్‌బస్టాండ్ ఆవరణలో పకడ్బందీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేయడంతో పాటు పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నేటికీ ప్రకటనలకే పరిమితమైంది. సూర్యాపేట పట్టణంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాతీయస్థాయిలో చర్చించుకునే విధంగా ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకున్నప్పటికీ హైటెక్ బస్టాండ్‌లో నిఘా కరువైంది. వామ్మో.. హైటెక్ బస్టాండా.. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. అలాంటి బస్టాండ్‌కు ప్రతిరోజు వేలాది బస్సులతో పాటు లక్షల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. బస్టాండ్ బయటి నుంచి మొదలుకుని ఆవరణలో సైతం పోలీసులు నిరంతరం ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంది. కానీ బస్టాండ్‌లో కేవలం ఒక్కరిద్దరు హోంగార్డులు కూడా అడపాదడపా కనిపిస్తుంటారు. బస్టాండ్‌లో పోలీసు నిఘా లేకపోవడంతో రాత్రివేళ సూర్యాపేట హైటెక్‌బస్టాండ్ నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్లే ప్రజలు, అడపాదడపా వెళ్లే పెట్రోలింగ్ చేసే పోలీసులు సైతం వణుకుతున్నారు. రాత్రి 12 గంటలు దాటితే ఆ వైపు కన్నెత్తి చూడాలంటేనే పోలీసులు జంకుతున్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు , సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడంతో బస్టాండ్‌లో నిఘా కరువైంది. కొన్ని రోజులకే.. ఉగ్రవాదుల దాడి జరిగిన కొన్ని రోజులకే ఓ గుర్తు తెలి యని కారును హైటెక్ బస్టాండ్ ఆవరణలో వదిలేసి వెళ్లినప్పటికీ దానిని గమనించడంలో పోలీసులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఆ గుర్తు తెలియని కారులో నుంచి * కోటిన్నర బయటపడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ పట్టణ ప్రజల, ప్ర యాణికుల భద్రతకు అటు ఆర్టీసీ.. ఇటు పోలీసు యం త్రాంగం తీసుకున్న చర్యలు నామమాత్రం. అయినా బస్టాండ్‌లో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటుచేసి 24 గంటలు ప్రయాణికుల భద్రత కల్పించాల్సిన చర్యలు ఏవి తీసుకున్న దాఖలాల్లేవు. బస్టాండ్‌లో ఒక ఏఎస్ఐతో పాటు ము గ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు విధులు నిర్వహించాల్సి ఉండగా.. వారు ఏనాడు బస్టాండ్‌లో కన్పించిన దాఖలాలు లేవు. విధుల్లో భాగంగా బస్టాండ్ ఆవరణలో విధులు నిర్వహించాలి.. కానీ విధులకు వెళ్లిన సిబ్బంది ఎక్కువగా బస్టాండ్ బయట ప్రైవేటు వాహనాలను నిలిపి మామూళ్లు వసూళ్లు చేసేందుకే మక్కువ చూపుతున్నారనే ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే కంటితుడుపు చర్యగా కొద్దిరోజులు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి.. కొద్దిరోజులు కాగానే యథావి థిగా వదిలేశారు. ఇక ఇంత పెద్ద బస్టాండ్‌లో ఎనిమిది సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ అవి సరైన ప్రదేశంలో అమర్చకపోవడంతో ఎవరు వచ్చి వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో.. అందులో నిక్షిప్తం కావడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం పనిచేయడం లేదనే విమర్శలు లేకపోలేదు. సంబంధిత అధికార యంత్రాంగం చొ రవ చూపి పేటలో పటిష్టభద్రత ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. -
బర్కినా హోటల్‌పై ఉగ్ర దాడి
26 మంది మృతి ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగాలో శనివారం ఓ స్టార్ హోటల్‌పై అల్ కాయిదా ఉగ్రవాదులు తెగబడ్డారు. 26 మంది పౌరులను కాల్చి చంపారు. భద్రతా దళాలు... ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి 126 మందిని వారి చెర నుంచి రక్షించాయి. వీరిలో 33 మంది గాయపడ్డారు. తొలుత స్ప్లెన్‌డిడ్ ఫోర్ స్టార్ హోటల్, అనంతరం సమీపంలోని కాపుసినో రెస్టారెంట్‌పై దాడి చేసిన జీహాదీలు అందులోని వారిని బంధించారు. దగ్గర్లోని మరో హోటల్ వైబి నెక్ట్స్‌లో దాడి కొనసాగుతోందని ఆ దేశ మంత్రి కంపోర్ చెప్పారు. ఫ్రాన్స్ ప్రత్యేక దళాల సహకారంతో తమ భద్రతా దళాలు హోటల్లో గాలిస్తున్నాయన్నారు. దాడి నుంచి తప్పించుకున్నవారిలో కార్మిక శాఖ మంత్రి సవడోగో కూడా ఉన్నారన్నారు. ‘తెల్లవారుజామున హోటల్ ముఖ ద్వారం వద్ద కాల్పుల శబ్దం వచ్చింది.బయటనున్న దాదాపు పది వాహనాలను ఉగ్రవాదులు తగులబెట్టారు. ఆ సమయంలో అంతా నిద్రపోతున్నారు. వారిపై కాల్పులు జరిపారు’ అని యానిక్ చెప్పారు. అల్ కాయిదా అనుబంధ సంస్థ ఇస్లామిక్ మఘ్రెబ్ ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకుంది. మృతుల్లో నలుగురు విదేశీయులున్నారు. భారతీయుడు క్షేమం! బుర్కినా ఫాసోలోని హోటల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కిన 126 మంది బందీలలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. భద్రతా దళాల ఆపరేషన్‌తో ఆ భారతీయుడు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. బుర్కినా ఫాసోలో ఉన్న గౌరవ్ గార్గ్ అనే వ్యక్తి.. తన మిత్రుడు విరాజ్ ఉగ్రవాదులు చొరబడిన స్ప్లెన్‌డిడ్ హోటల్లో చిక్కుకుపోయినట్టు మొదట ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సైనికుల ఆపరేషన్ తర్వాత అతను క్షేమంగా బయటపడినట్టు వెల్లడించాడు. -
గన్ మెన్ కాల్పులు, కారు బాంబు పేలుళ్లు..
-
గన్ మెన్ కాల్పులు, కారు బాంబు పేలుళ్లు..
గన్ మెన్ కాల్పులు, కారుబాంబు పేలుళ్లు, 20 మంది మృతి బుర్కినా ఫాసో రాజధానిలో ఓ హోటల్ వద్ద దుర్ఘటన యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాలవాళ్ల తాకిడి ఎక్కువ ఔగాడుగు: కారు బాంబు పేలుళ్లు సహా గన్ మెన్ జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘటన ఆఫ్రికా లోని బుర్కినా ఫాసోలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధాని ఔగాడుగులోని ఫోర్ స్టార్ హోటల్ స్పెన్డిడ్ వద్ద ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. మొదటగా కొందరు గన్‌మెన్స్ హోటల్ ను చుట్టుముట్టారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుంటుండగానే గన్ మెన్ కారు బాంబులు పేల్చేశాడు. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందడంతో పాటు మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్య అని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. ఓ మంత్రి సహా 63 మందిని అల్ ఖైదా ఉగ్రవాదులు తమ బంధీలుగా అదుపులోకి తీసుకున్నారు. కారు బాంబు దాడులు, గన్ మెన్ కాల్పుల అనంతరం ఫ్రెంచ్ ఆర్మీ, అమెరికన్ బలగాలు రంగంలోకి దిగాయి. కొన్ని గంటలు అల్ ఖైదా ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపి 63 మందిని సురక్షితంగా వారి చెర నుంచి విడిపించాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ స్థానిక అల్ ఖైదా గ్రూపు అనుబంధ సంస్థ ఏక్యూఐఎమ్ ప్రకటించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. 15 మందికి బుల్లెట్ గాయాలు ఉన్నాయని, దాడినుంచి తప్పించుకునే యత్నంలో మరికొంతమందికి గాయాలయ్యాయని రాజధానిలోని యల్గాడో ఆస్పత్రి వైద్యులు వివరించారు. యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాల వాసులు ఎక్కువగా స్పెన్డిడ్ హోటల్ లో బస చేస్తుంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దు దేశం మాలిలోని రాడిసన్ హోటల్లోనూ గతేడాది ఇదేవిధంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మందికి పైగా మృతిచెందిన విషయం అందరికీ విదితమే. ఉగ్రదాడికి గురైన హోటల్ ఇదే.. -
షాపింగ్ మాల్ పై ఉగ్రదాడి
-
షాపింగ్ మాల్ పై ఉగ్రదాడి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. భారీ ఆయుధ సామాగ్రతో నగరంలోని అల్ జవహర్ షాపింగ్ మాల్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి ప్రారంభమైన ఈ మారణకాండలో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా సహా ఏడుగురు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు మరో 100 మందిని మాల్ లోపల బందీలుగా పట్టుకున్నారు. 'తొలుత షాపింగ్ మాల్ ఎదుట కారు బాంబును పేల్చిన దుండగులు లోనికి ప్రవేశించి కాల్పులు జరిపి పలువురిని బందీలుగా చేసుకున్నారని, బందీల్లో అత్యధికులు మహిళలేనని సైనికాధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒంటినిండా బాంబులు ధరించిన దాదాపు 20 మంది ఉగ్రవాదులు మాల్ లోపల ఉన్నారు. వారిలో కొందరు మాల్ పై భాగంలో నక్కి.. బందీలను విడిపించేందుకు లోపలికి వెళ్లజూసిన పోలీసులను పైనుంచి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇరాక్ ప్రత్యేక రక్షక బలగాల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
పారిస్ స్టోర్ బందీలకు విముక్తి
పారిస్: పారిస్ సమీపంలో సాయుధులు దాడి చేసిన షాపింగ్ మాల్లో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. సాయుధులు స్టోర్‌లో దోపిడీ చేసి పారిపోయాక.. వారి చెరలో కొన్ని గంటల పాటు బందీలుగా ఉన్న మొత్తం 18 మంది క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో సాయుధులు మాల్‌లోకి చొరబడి అక్కడ ఉన్నవారిని బందించారు. షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు మేసేజ్ చేసినట్టు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. పోలీసులు వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని వాహానాల రాకపోకలను నిషేధించి, ఇతర షాపులను మూసివేయించారు. భద్రత దళాలు బందీలను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే, సాయుధాలు దోపిడీ చేసి పారిపోయారు. ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు వచ్చినట్టు భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.