సియాటెల్‌లో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు: స్పెషల్‌ ఫుడ్‌ డ్రైవ్‌ | Great leader YSR Jayanthi celebrated Seattle Washington | Sakshi
Sakshi News home page

సియాటెల్‌లో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు: స్పెషల్‌ ఫుడ్‌ డ్రైవ్‌

Published Tue, Jul 12 2022 10:46 AM | Last Updated on Tue, Jul 12 2022 11:00 AM

Great leader YSR Jayanthi celebrated Seattle Washington - Sakshi

వాషింగ్టన్‌: జులై 8న మహానేత డా.వైయస్సార్ 73వ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైయస్సార్ అభిమానులు ఫుడ్ డ్రైవ్ సేవాకార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలనతో, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన చెరగని ముద్రవేసి ప్రజలగుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానేత డా. వైఎస్సార్‌ అని కొనియాడారు. 

ఈ జయంతి వేడుకలు నార్త్ వెస్ట్ అమెరికాలోని సియాటెల్ ప్రాంత వైఎస్సార్ అభిమానులు రెండు వేల డాలర్లతో ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సేవాకార్యక్రమాలలో పాల్గొని స్వయానా ఫుడ్ డ్రైవ్ డ్రాప్ బాక్సులు, ఫుడ్ డ్రైవ్ ప్యాకెట్లు తయారు చేసివాటిని ఆకలితో ఉన్నవారికి అందించి మహానేత జయంతిని  ఘనంగా నిర్వహించారు. 

మహానేత సువర్ణపాలన, గొప్ప నాయకత్వ లక్షణాలు,  ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ పలువురు అభిమానులు  వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. ఆయన గొప్పతనం తెలుసుకున్న స్థానిక అమెరికన్లు సైతం అబ్బురపోవడం విశేషం. అలాంటి నాయకులను పొందడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ మహానేత పేరుతో క్రమం తప్పకుండా తమ ప్రాంతాలలో ఫుడ్ డ్రైవ్‌లు, సేవా కార్యక్రామాలు ఏర్పాటు చేస్తున్న అభిమానులని అభినందించి కృతజ్ఞతలు తెలియజేసారు..

 

ఈ వేడుకలలో భాగంగా ఫుడ్ డ్రైవ్ & సేవాకార్యక్రమాలలో తమ సహాయసహకారాలు అందించిన విక్రమ్ రెడ్డి గార్లపాటి సువీన్ రెడ్డి గారికి, చెన్నా రెడ్డి  మహీధర్ రెడ్డి రవి కిరణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కొల్లూరు జేసి రెడ్డిమునీశ్వర్ రెడ్డి , దామోదర్ అన్నకు, రామ్ , లోకనాథ్ , శేఖర్ గుప్త, విన్నకోట, భాస్కర్ రావికంటి , Dr వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ - USA అండ్ ఆళ్ళ రామిరెడ్డితోపాటు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయసహకారాలు అందించిన అందరికీ వైఎస్సార్ అభిమాని  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement