షూటింగ్లో గాయపడిన అమీషా పటేల్ | Ameesha Patel gets injured while shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్లో గాయపడిన అమీషా పటేల్

Published Wed, Jan 29 2014 3:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

షూటింగ్లో గాయపడిన అమీషా పటేల్

షూటింగ్లో గాయపడిన అమీషా పటేల్

కహోనా ప్యార్ హై చిత్రంతో తెరంగేట్రం చేసిన అమీషా పటేల్.. తాజాగా ఓ చిత్రం షూటింగులో యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటూ గాయపడింది. 37 ఏళ్ల అమీషా పటేల్, గత వారం ఓ సినిమా కోసం ఫైటింగు చేస్తుండగా ఆమె మోకాలికి దెబ్బ తగిలింది. కొన్ని రోజుల క్రితం ఈ గాయం తగిలిందని, ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తుంటే పడిపోయానని, మోకాలుకు దెబ్బ తగిలిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని, తనను పలకరించిన వారందరికీ కృతజ్ఞతలని కూడా ఆమె చెప్పింది. తాను గాయపడిన వెంటనే సెట్ వద్దకే డాక్టర్ను పిలిపించారని, తనకు వెంటవెంటనే మందులు, ఇంజెక్షన్లు ఇచ్చారని అంది. గత వారమే ఇదంతా జరిగినా అప్పుడే ఎవరికీ చెప్పనందుకు క్షమాపణలు కూడా కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement