యంగ్‌ హీరోకు తీవ్ర గాయాలు | Naga Shaurya Got Injured In Shooting | Sakshi
Sakshi News home page

యంగ్‌ హీరోకు తీవ్ర గాయాలు

Published Fri, Jun 14 2019 11:13 PM | Last Updated on Fri, Jun 14 2019 11:13 PM

Naga Shaurya Got Injured In Shooting - Sakshi

యువ హీరో నాగశౌర్య ఓ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ‘ఛలో, నర్తనశాల’ తర్వాత నాగశౌర్య సొంతబ్యానర్‌లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో నాగశౌర్య కాలికి తీవ్ర గాయమైంది. ఎటువంటి డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో వైద్యులు అతన్ని 25 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే నాగశౌర్య సిబ్బంది అతన్ని వీల్‌చైర్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రమణ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement