ట్యూరిన్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల ఈ దిగ్గజ స్ట్రయికర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్యూరిన్‌లోని సొంతింట్లో చికిత్స తీసుకుంటూ ఐసోలేషన్‌కే పరిమితమయ్యాడు. 19 రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువెంటస్ క్లబ్ సంతోషం వెలిబుచ్చింది. ‘రొనాల్డో కులుకున్నాడు. ఇక అతని ఐసోలేషన్ ముగిసింది. తాజా స్వాబ్ టెస్టులో నెగెటివ్ రిపోర్టు వచ్చింది’ జట్టు వర్గాలు తెలిపాయి. కోవిడ్ సోకడంతో యువెంటస్ క్లబ్ తరఫున గత మూడు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. సిరీ ‘ఎ’లో క్రొటోన్, వెరోనా జట్లతో, చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనాతో జరిగిన మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. నేడు యువెంటస్... స్పెజియా క్లబ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో లేదంటే బుధవారం ఫెరెంక్వారోస్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా అతను బరిలోకి దిగే అవకాశలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment