
సిడ్నీ: న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్‌కు కరోనా లేదని తేలింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలి వన్డే అనంతరం తనకు గొంతు నొప్పి ఉందని ఫెర్గూసన్ చెప్పడంతో అతడికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో కరోనా లేదని తేలడంతో అతడు న్యూజిలాండ్ వెళ్లడానికి మార్గం సుగమం అయింది.