
కరోనా అనుమానంతో కివీస్‌తో తొలి వన్డేకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్‌కు ప్రమాదం ఏమీ లేదని తేలింది. ఉదయం అతనికి జరిపిన పరీక్షల్లో ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చింది. తొలి వన్డేకు ముందు రిచర్డ్సన్ గొంతు నొప్పితో బాధపడ్డాడు. అతడిని పరిశీలించి వైద్య బృందం సూచన మేరకు జట్టు నుంచి తప్పించి విడిగా ఉంచారు. ఇటీవలే అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో సందేహం పెరిగింది. దాంతో మ్యాచ్‌లో ఆడనివ్వకుండా వైద్య పరీక్షలకు పంపారు.