kane richardson
-
AFG Vs AUS: మ్యాచ్‌లో హైడ్రామా.. మ్యాక్స్‌వెల్‌పై బౌలర్ ఆధిపత్యం
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 19వ ఓవర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి పెద్ద హైడ్రామా నడిచింది. నవీన్ ఉల్ హక్ తొలుత రన్ అప్‌కు వచ్చి బంతి వేయకుండా పిచ్ మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. తన చర్యకు బ్యాటర్‌తో పాటు అంపైర్‌కు క్షమాపణ చెప్పాడు. ఇక రెండోసారి నవీన్ ఉల్ హక్ బంతిని వేద్దామనుకునే సమయానికి తనకు స్క్రీన్ అడ్డుగా వస్తుందని ఈసారి మ్యాక్స్‌వెల్ పక్కకు జరిగాడు. దీంతో నవీన్ ఉల్ హక్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. అలా ఒకసారి తాను ఆగిపోగా.. రెండోసారి మ్యాక్స్‌వెల్ ఆపడంతో నవీన్ ఉల్ హక్కు చిర్రెత్తింది. దీంతో మరుసటి బంతిని ఫుల్‌లెంగ్త్‌తో ఔట్‌సైడ్ వేయగా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న నవీన్ ఉల్ హక్ అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రిచర్డ్సన్ పిచ్ మధ్యలోకి రావడంతో కసితో డైరెక్ట్ త్రో వేయగా బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రిచర్డ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తానికి మ్యాక్స్‌వెల్ చర్యతో చిర్రెత్తిన నవీన్ ఉల్ హక్ తన రివేంజ్‌ను రిచర్డ్సన్పై చూపించడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Made it count 🧐 pic.twitter.com/zYBoVMlZtL — Aakash Srivastava (@Cursedbuoy) November 4, 2022 చదవండి: 27 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా విఫలం.. ఎట్టకేలకు NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్! -
అతడిని తప్పించారా? టీమ్ బస్సు మిస్ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు!
ICC Mens T20 World Cup 2022- Australia vs Afghanistan: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అని, ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించగల సత్తా ఉన్న బౌలర్‌ను పక్కనపెట్టడం ఏమిటని క్రీడా పండితులు ప్రశ్నిస్తున్నారు. కాగా గ్రూప్-1లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక టిమ్ డేవిడ్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి రాగా.. స్టార్క్ స్థానంలో కేన్ రిచర్డ్సన్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వేడ్ వెల్లడించాడు. ఫించ్ స్థానాన్ని కామెరూన్ గ్రీన్‌తో భర్తీ చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో స్టార్క్ లేకపోవడంపై ఆసీస్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్క్ వా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆసీస్ జట్టులో మిచెల్ స్టార్క్ లేడు. అతడు గాయపడ్డాడా లేదంటే తప్పించారా?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక టామ్ మూడీ సైతం... ‘‘మిచెల్ స్టార్క్‌ను తప్పించారా లేదంటే అతడు టీమ్ బస్ మిస్సయ్యాడా’’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఇక మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సైతం స్టార్క్ తుది జట్టులో లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘తను లేకుండా ఈరోజు మ్యాచ్ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కేవలం గాయపడితే తప్ప తనను పక్కనపెట్టడం సాధ్యం కాదు. అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చ గల బౌలర్ తను. అతడు లేకుండా ఆసీస్ మ్యాచ్ ఆడటం ఏమిటో నాకైతే ఏం అర్థం కావడం లేదు’’ అని ఈ కామెంటేటర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్ వంటి కీలక బౌలర్‌ను తప్పించిన ఆసీస్ భారీ మూల్యం చెల్లించకతప్పదంటూ అతడి ఫ్యాన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడుతున్నారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో స్టార్క్ ఇప్పటి వరకు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరంభంలో 2 వికెట్లు తీసినా 4 ఓవర్లలో ఏకంగా 43 పరుగులు సమర్పించుకుని తేలిపోయాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో మ్యాచ్‌లో అతడికి చోటు లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో కీలక పోరులో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్ దిగ్గజం.. అయితే! Aussie team no Mitchell Starc. Is he injured or dropped.? — Mark Waugh (@juniorwaugh349) November 4, 2022 Mitchell Starc dropped or just miss the team bus? #AUSvAFG #ICCT20WorldCup — Tom Moody (@TomMoodyCricket) November 4, 2022 -
SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సిరీస్ ఆస్ట్రేలియాదే!
Australia tour of Sri Lanka, 2022- కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అసలంక (39), కుశాల్ మెండిస్ (36) రాణించారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 26 బంతులు ఎదుర్కొని 26 పరుగులు సాధించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక.. టాపార్డర్ విఫలం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని బౌలర్లను కొనియాడాడు. శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారన్న ఫించ్.. మాథ్యూ వేడ్ అనుభవం జట్టును విజయాలకు చేర్చడంలో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ చేజార్చుకున్న లంక రాత స్వదేశంలోనైనా మారుతుందనుకుంటే అలా జరుగలేదు. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే పర్యాటక ఆసీస్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ జూన్ 11న పల్లెకెలెలో జరుగుతుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! -
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్!
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కేన్ రిచర్డ్సన్ మోకాలి గాయం కారణంగా పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి స్ధానంలో న్యూ సౌత్ వేల్స్ పేసర్ బెన్ ద్వార్షుయిస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా పాకిస్తాన్ పర్యనటకు ముందు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ క్రమంలోనే అతడు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక రిచర్డ్సన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ద్వార్షుయిస్‌కు అంతగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదు. 2017లో జరగిన ట్రై-సిరీస్ ఆస్ట్రేలియా టీ20 జట్టులో ద్వార్షుయిస్ సభ్యుడుగా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది.అదే విధంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి రెండు టెస్టులు డ్రా ముగిశాయి. ఇక సిరీస్‌లో అఖరి టెస్టు లాహోర్ వేదికగా జరుగుతోంది. మరో వైపు పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరిను స్పిన్ కన్సల్టెంట్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' -
'మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది'
ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలంలో రూ. 7.50 కోట్లు వెచ్చించి మార్క్ వుడ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ సొంతం చేసుకుంది. కాగా వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ అన్రీచ్ నార్జే కూడా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను భర్తీ చేసే ఆటగాళ్లను టీమిండియా మాజీ క్రికెటర్ అంచనా వేశాడు. "మార్క్ వుడ్ ఈ ఏడాది సీజన్ నుంచి దూరం కావడం ఖాయం. అదే విధంగా దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ అన్రిచ్ నార్జే ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రబడా, బౌల్ట్, కమ్మిన్స్ వంటి చాలా మంది బౌలర్లు వేలంలో అమ్ముడు పోయారు. ప్రస్తుతం ఈ జట్లుకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కొంత మంది విదేశీ పేసర్లు వేలంలో అమ్ముడు పోలేదు. వారిలో ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్సన్ కూడా ఉన్నాడు. అతడు అద్భతమైన ఫాస్ట్ బౌలర్. టీ20ల్లో మంచి రికార్డును కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి వుడ్ స్ధానాన్ని కేన్ రిచర్డ్‌సన్‌తో భర్తీ చేయవచ్చు. అదే విధంగా నార్జే స్ధానాన్ని ఇంగ్లండ్ పేసర్ షాకిబ్ మహ్మద్ లేదా ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై తో భర్తీ చేయవచ్చు. టై అఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు ఒక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. అతడు ఆస్ట్రేలియా తరుపున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు" అని చోప్రా పేర్కొన్నాడు. చదవండి: Mithali Raj: మిథాలీ సంచలన, ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్! We will miss you this season, speedster! @MAWood33 🚀 #LucknowSuperGiants family wishes our Woody a speedy recovery!💪 🎥: Fancode #AbApniBaariHai #TataIPL #IPL2022 #CricketNews #CricketUpdates pic.twitter.com/Kf9S1gUJuO — Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2022 -
IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా!
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం-2022 కొందరు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తే మరికొందరికి నిరాశను మిగిల్చింది. బెంగళూరులో రెండు రోజుల పాటు సాగిన ఆక్షన్‌లో 10 ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. అయితే, 217 స్థానాలకు క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉన్నా... 204 మందితోనే సరిపెట్టడం గమనార్హం. ఇక సురేశ్ రైనా, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ తదితర పేరున్న పలువురు ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఏ జట్టు కూడా వీరిని కొనేందుకు ఆసక్తికనబరచలేదు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ కూడా ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో.. తామిద్దరం అమ్ముడుపోకుండా మిగిలిపోవడంపై రిచర్డ్సన్ స్పందించాడు. ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘నిజంగా ఆడం జంపాను ఎవరూ కొనలేదంటే నేను విస్మయానికి గురయ్యాను. అయితే, నిజాయితీగా మాట్లాడుకుంటే... మేము గత సీజన్ మధ్యలోనే లీగ్ నుంచి వైదొలిగాము. ఈ విషయం గురించి తనతో సంభాషించే క్రమంలో... ‘‘ఇందుకు మనం కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని తనకు చెప్పాను. అయితే, ఆ సమయంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడమే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. అందుకే వెళ్లిపోయాము. వేలం సమయంలో ఫ్రాంఛైజీలు మాపై ఆసక్తి చూపకపోవడానికి, మమ్మల్ని కొనుగోలు చేయకపోవడానికి ఇదొక కారణమని నేను భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయానని చెప్పుకొచ్చాడు. మెగా వేలం నేపథ్యంలోనూ తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్ -2021 కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెకు కొందరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఆడం జంపా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ -
అతని స్థానంలో ఆర్సీబీలోకి కొత్త ఆటగాడు..
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీకి కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా రూపంలో షాక్ తగిలిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా ఉదృతమవుతున్న వేళ తాము ఐపీఎల్ ఆడలేమంటూ ఈ ఇద్దరు స్వదేశానికి వెళ్లిపోయారు. తాజాగా ఆర్సీబీ కేన్ రిచర్డ్సన్ స్థానంలో ముంబై ఇండియన్స్‌లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న స్కాట్ కుగ్గెలీజ్న్ను జట్టులోకి తీసుకురానుంది. మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ కింద ఆర్సీబీ ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో ఒక జట్టు నుంచి మరో జట్టుకు బదిలీ అయిన తొలి ఆటగాడిగా స్కాట్ కుగ్లెలీజ్న్ నిలిచాడు. అయితే ఆడమ్ జంపా స్థానంలో ఆర్సీబీ ఇంకా ఎవరిని తీసుకోలేదు. ఇక కుగ్లెలీజ్న్ 2019 ఐపీఎల్ సీజన్లో తొలిసారి సీఎస్కే తరపున ఆడాడు. ఎన్గిడి స్థానంలో ఆడిన అతను రెండు మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. చదవండి: ఆ ఇద్దరికి కోచ్ అవసరం లేదు -
IPL 2021: ఆర్సీబీకి భారీ షాక్.. వారిద్దరూ ఔట్!
-
IPL 2021: ఆర్సీబీకి భారీ షాక్.. వారిద్దరూ ఔట్!
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఐపీఎల్-2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫును ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఇప్పటికే తాను టోర్నీకి విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు అశ్విన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ కీలక ఆటగాడిని కోల్పోయినట్లయింది. ఇక తాజాగా రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఇలాంటి షాకే తగిలింది. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా ఐపీఎల్-2021 నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ధ్రువీకరించింది. ఈ మేరకు... ‘‘ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నారు. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు వారు అందుబాటులో ఉండరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం వారి నిర్ణయాన్ని గౌరవిస్తోంది. వారికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుంది’’ అని ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా, భారత్‌లో ఉన్న ఆటగాళ్లు వెంటనే వెనక్కి రావాలని ఆస్ట్రేలియా సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఇప్పుడు గనుక స్వదేశానికి రాకపోతే 3 నెలల పాటు రావడానికి వీల్లేదన్న షరతుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచన మేరకు సదరు ఆటగాళ్లు భారత్ నుంచి వెనక్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో రిచర్డ్సన్, రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడగా, ఆడం జంపా ఇంతవరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021లో కోహ్లి సేనకు ఇదే తొలి ఓటమి. చదవండి: IPL 2021: అప్పుడే మళ్లీ మైదానంలోకి దిగుతా: అశ్విన్ Official Announcment: Adam Zampa & Kane Richardson are returning to Australia for personal reasons and will be unavailable for the remainder of #IPL2021. Royal Challengers Bangalore management respects their decision and offers them complete support.#PlayBold #WeAreChallengers pic.twitter.com/NfzIOW5Pwl — Royal Challengers Bangalore (@RCBTweets) April 26, 2021 -
రిచర్డ్సన్కు కరోనా లేదు
కరోనా అనుమానంతో కివీస్‌తో తొలి వన్డేకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్కు ప్రమాదం ఏమీ లేదని తేలింది. ఉదయం అతనికి జరిపిన పరీక్షల్లో ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చింది. తొలి వన్డేకు ముందు రిచర్డ్సన్ గొంతు నొప్పితో బాధపడ్డాడు. అతడిని పరిశీలించి వైద్య బృందం సూచన మేరకు జట్టు నుంచి తప్పించి విడిగా ఉంచారు. ఇటీవలే అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో సందేహం పెరిగింది. దాంతో మ్యాచ్‌లో ఆడనివ్వకుండా వైద్య పరీక్షలకు పంపారు. -
ఆసీస్ క్రికెటర్‌కు కరోనా?
-
ఆసీస్ క్రికెటర్‌కు కరోనా.. మ్యాచ్‌కు దూరం?!
సిడ్నీ: తమ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ అనారోగ్యం పాలైన నేపథ్యంలో.. అతడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిని క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. దీంతో శుక్రవారం నాటి ఆసీస్- కివీస్ తొలి వన్డే మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత కేన్ 14 రోజుల క్రితమే తిరిగి వచ్చాడు. అతడు గొంతుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు మా వైద్య సిబ్బంది పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం అతడికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. జట్టుకు దూరంగా ఉంచుతున్నాం. టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాత.. అతడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంటాం’’అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు!) ఇక కరోనా వ్యాప్తి భయంతో మొదటి వన్డేను క్లోజ్డ్ డోర్స్‌లో నిర్వహించనున్నట్లు సీఏ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్... బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్19’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే వేల మందిని చంపేసింది. లక్ష మందికిపైగా సోకింది. దీంతో కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఐపీఎల్ నిర్వాహకులను కూడా ఈ వైరస్ భయం గడగడలాడిస్తోంది. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) JUST IN: Aussie quick Kane Richardson will miss today's #AUSvNZ ODI with results of COVID-19 test still pending. DETAILS: https://t.co/jNsxVLgRGc pic.twitter.com/SZRYEnQcJd — cricket.com.au (@cricketcomau) March 13, 2020 -
అసభ్యంగా ప్రవర్తించాడని క్రికెటర్‌కు జరిమానా
మెల్బోర్న్ : ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ జరిమానా విధించింది. దేశవాలి టీ20బిగ్‌బాష్‌లీగ్‌లో మార్కస్ స్టొయినిస్ మెల్బోర్న్ స్టార్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, రినిగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో స్టొయినిస్ తన సహచర ఆటగాడైన కేన్ రిచర్డ్సన్పై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆటగాడిగా ప్రవర్తన నియమావళి ఉల్లగించినందుకు గాను కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టొయినిస్‌కు 7500 ఆస్ట్రేలియన్ డాలర్లను జరిమానాగా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.' నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. కేన్ రిచర్డ్‌సన్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రౌండ్‌లోనే అంపైర్ల ముందు అతనికి క్షమాపణ చెప్పాను. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు మాత్రమే తెలుసు. క్రికెట్ ఆస్ట్రేలియా నాకు వేసిన జరిమానాను అంగీకరిస్తున్నా' అని మార్కస్ స్టొయినిస్ స్పందించాడు. సరిగ్గా ఆరు వారాల క్రితం ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున మ్యాచ్ ఆడుతూ ఇదే తరహాలో తీవ్ర అసభ్యపదజాలంతో దూషించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు భారీ జరిమానాను విధించింది. దీంతో నవంబర్‌లో పాక్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో పాటిన్సన్ మొదటి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఈ ఏడాది స్టొయినిస్ అసాధారణ ఆటతీరు కనబరిచి 281 పరుగులతో లీగ్ టాప్ స్కోర్ర్లలో ఒకడిగా నిలిచినా, జనవరిలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు కేన్ రిచర్డ్సన్ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కావడం విశేషం. 2018లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినప్పటి నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పు చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది , బౌలర్ బెన్‌క్రాప్ట్ 9 నెలల పాటు జట్టుకు దూరమయ్యరు.కాగా మార్కస్ స్టొయినిస్‌ను డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 4.80 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా, కేన్ రిచర్డ్సన్ను ఆర్సీబీ రూ. 4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. (క్రికెట్‌కు పఠాన్ గుడ్‌బై ) (ముగిసిన ఐపీఎల్ వేలం) -
మూడో వన్డేకు రిచర్డ్సన్ దూరం
సిడ్నీ:ఆస్ట్రేలియా పేస్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరుగనున్న మూడో వన్డేకు దూరం కానున్నాడు. శనివారం జరిగిన రెండో వన్డే అనంతరం రిచర్డ్సన్ కు వెన్నునొప్పి తీవ్రం కావటంతో అతని మూడో వన్డేకు విశ్రాంతినిచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పేర్కొంది. దీనిలో భాగంగానే అతన్ని స్వదేశానికి పంపుతున్నట్లు స్పష్టం చేసింది. రిచర్డ్సన్ స్థానంలో జోల్ పారిస్ ను జట్టులో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇటీవల భారత్ తో జరిగిన సిరీస్ ద్వారా పారిస్ వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ లో జరిగిన షెఫెల్డ్ షీల్డ్ కు ఆడిన పారిస్ 37 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో రాణించాడు.ఇప్పటికే గాయాలు బారిన పడి ఆరోన్ ఫించ్, జేమ్స్ ఫాల్కనర్ లు జట్టుకు దూరం కావడంతో సతమవుతున్న ఆస్ట్రేలియాకు రిచర్డ్సన్ కూడా వైదొలగడం మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను సాధించాలనుకుంటున్న ఆస్ట్రేలియా జట్టు తుది కూర్పుపై మల్లగుల్లాలు పడుతోంది. మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1 సమంగా ఉన్న సంగతి తెలిసిందే. -
2 సెంచరీలు చేసినా తలరాత మారలేదు!
-
2 సెంచరీలు చేసినా తలరాత మారలేదు!
నాలుగు మ్యాచులు.. ఐదు సెంచరీలు.. అయినా ఆస్ట్రేలియాకు అతిథిగా వెళ్లిన భారత్ అదృష్టరేఖ మారలేదు. ఆసిస్‌తో గడిచిన నాలుగు వన్డేల్లోనూ మెరుగ్గా స్కోరు చేసినా.. గెలుపు కోసం చివరవరకు పోరాడినా.. విజయలక్ష్మి మాత్రం ధోనీ సేన గడప తొక్కడం లేదు. తాజాగా ఓడిన నాలుగో వన్డేలో మరీ ఘోరం.. ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీలు చేశారు. 212 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివరకు వచ్చేసరికి టీమిండియా సైకిల్ స్టాండ్‌ను తలపించేలా కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్సన్ తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగడంతో నాటకీయరీతిలో కంగారు సేన 25 పరుగులతో విజయాన్ని చేజిక్కించుకుంది. కాన్బెర్రాలో జరిగిన నాలుగో వన్డేలో ఆద్యంతం బ్యాట్స్మెన్ల హవానే కొనసాగింది. భారత్ నుంచి విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, ఆసిస్ నుంచి ఆరోన్ ఫించ్ సెంచరీలు చేశారు. ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ క్రికెట్ జట్లు తలపడిన ఈ మ్యాచ్‌లో 671 పరుగులు నమోదయ్యాయి. కానీ చివరకు ఈ వన్డేను శాసించింది మాత్రం నిలకడలేని టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన రిచర్డ్సనే. తన అద్భుత బౌలింగ్‌తో 68 పరుగులకు 5 వికెట్లు తీశాడు. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 277 పరుగులు చేసి ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించింది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నప్పుడు భారత్ ఇంకా చేయాల్సిన పరుగులు 72 మాత్రమే. ధావన్ (126), కోహ్లి (106) కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో భారత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అంతా భావించారు. కానీ ఊహించనిరీతిలో కుప్పకూలి.. తన నిలకడలేనితనాన్ని నిరూపించకుంటూ టీమిండియా మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో 4-0తో అవమానకరరీతిలో వెనుకబడిపోయింది.