పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కేన్ రిచర్డ్‌సన్ మోకాలి గాయం కారణంగా పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి స్ధానంలో న్యూ సౌత్ వేల్స్ పేసర్ బెన్ ద్వార్షుయిస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా పాకిస్తాన్ పర్యనటకు ముందు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ క్రమంలోనే అతడు గాయపడినట్లు తెలుస్తోంది.
ఇక రిచర్డ్‌సన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ద్వార్షుయిస్‌కు అంతగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదు. 2017లో జరగిన ట్రై-సిరీస్ ఆస్ట్రేలియా టీ20 జట్టులో ద్వార్షుయిస్ సభ్యుడుగా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది.అదే విధంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి రెండు టెస్టులు డ్రా ముగిశాయి. ఇక సిరీస్‌లో అఖరి టెస్టు లాహోర్ వేదికగా జరుగుతోంది. మరో వైపు పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరిను స్పిన్ కన్సల్టెంట్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది.
చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం'
Comments
Please login to add a commentAdd a comment