hamstring injury
-
ఆస్పత్రి బెడ్‌పై భారత ఆటగాడు.. ఆ టోర్నీ మొత్తానికి దూరం!
టీమిండియా పేసర్, రాజస్తాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఖలీల్ అహ్మద్ ప్రస్తుతం మెకాలి గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా తన గాయానికి సంబంధించిన అప్డేట్ను ఖలీల్ అహ్మద్ అభిమానులతో పంచుకున్పాడు. హాస్పిట్ల్ బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రంజీ ట్రోఫీలో చాలా మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు అతడు తెలిపాడు. ఒక వేళ తను పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్లీ జట్టులోకి చేరుతాని అని ఖలీల్ అన్నాడు. "క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టం. నా మెడికల్ కండీషన్ కారణంగా, నేను రాబోయే రంజీ సీజన్లో చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాను. నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను. నేను ఫిట్నెస్ సాధిస్తే తిరిగి మళ్లీ మైదానంలోఅడుగుపెడతాను. నేను కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికీ ధన్యవాదాలు" అని ట్విటర్లో ఖలీల్ పేర్కొన్నాడు. కాగా ఖలీల్ దాదాపు రెండేళ్ల నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో కూడా గాయం కారణంగా అతడు కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం అతడు పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటిల్స్కు ప్రాతినిథ్యం వహించిన ఖలీల్ అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు 11 వన్డేలు, 14 టీ20ల్లో భారత జట్టుకు ఖలీల్ ప్రాతినిథ్యం వహించాడు. అతడు చివరసారిగా టీమిండియా తరపున చివరగా 2019లో బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌లో ఆడాడు. Dear all, it’s very hard to stay away from cricket, It's unfortunate, but due to my medical condition, I would be missing most of the matches of the upcoming Ranji season. I am on the road to recovery and will be back in the side once deemed fit. I am grateful for all the wishes pic.twitter.com/TA68ARmoPx — Khaleel Ahmed 🇮🇳 (@imK_Ahmed13) December 12, 2022 చదవండి: Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! -
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ దూరం!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న ఫించ్.. 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ అఖరిలో ఫించ్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫించ్ ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్థానంలో వైస్-కెప్టెన్ మాథ్యూ వేడ్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక తన గాయంకు సంబంధించిన అప్డేట్ను మ్యాచ్ అనంతరం ఫించ్ వెల్లడించాడు. "ప్రస్తుతం చాలా నొప్పిగా ఉంది. నేను రేపు(మంగళవారం) స్కానింగ్ కోసం వెళ్తాను. గతంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాను. స్కాన్ రిపోర్ట్స్ బట్టి విశ్రాంతి తీసుకోవాలా వద్ద అన్నది ఆలోచిస్తాను" అని ఫించ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇక నవంబర్ 4న ఆడిలైడ్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. In a positive update, it was just precautionary for Tim David, who was kept out from fielding with hamstring tightness 🤞 https://t.co/SpUaVotkhk — Fox Cricket (@FoxCricket) October 31, 2022 చదవండి: T20 WC 2022: 'బాబర్ అజం స్వార్దపరుడు.. కేవలం రికార్డుల కోసం మాత్రమే' -
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్!
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ కేన్ రిచర్డ్సన్ మోకాలి గాయం కారణంగా పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి స్ధానంలో న్యూ సౌత్ వేల్స్ పేసర్ బెన్ ద్వార్షుయిస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా పాకిస్తాన్ పర్యనటకు ముందు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ క్రమంలోనే అతడు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక రిచర్డ్సన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ద్వార్షుయిస్‌కు అంతగా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేదు. 2017లో జరగిన ట్రై-సిరీస్ ఆస్ట్రేలియా టీ20 జట్టులో ద్వార్షుయిస్ సభ్యుడుగా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది.అదే విధంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి రెండు టెస్టులు డ్రా ముగిశాయి. ఇక సిరీస్‌లో అఖరి టెస్టు లాహోర్ వేదికగా జరుగుతోంది. మరో వైపు పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరిను స్పిన్ కన్సల్టెంట్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' -
శ్రీలంకతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్!
స్వదేశంలో శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన అఖరి టీ20లో మోకాలి గాయంతో చాహర్ బాధపడ్డాడు. ఈ క్రమంలో 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన చాహర్ ఫీల్డ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టేట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే చాహర్ ఐపీఎల్లో కూడా కొన్ని మ్యాచ్‌లు దూరం కావల్సి వస్తుంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా లక్నో వేదికగా ఫిబ్రవరి 24న భారత్- శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక.. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్ చదవండి: Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్ శర్మ -
దక్షిణాఫ్రికాకు దెబ్బ మీద దెబ్బ
-
గుండె పగిలినంతపనైంది: క్రికెటర్
బెంగళూరు: గాయంతో జట్టుకు దూరం కావడం పట్ల టీమిండియా బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్వదేశంలో సిరీస్ జరుగుతుండగా తాను ఇంటికే పరిమితం కావాల్సి రావడం దురదృష్టకరంగా పేర్కొన్నాడు. తొడ కండరాల గాయంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం బోర్ కొట్టిందని చెప్పాడు. తన మనసంతా టీమిండియాతోనే ఉందని ‘బీసీసీఐ టీవీ’తో మాట్లాడుతూ అన్నాడు. ‘చాలా కాలం తర్వాత హోం సిరీస్ లో ఆడలేకపోవడం బాధ కలిగించింది. గాయంతో జట్టుకు దూరం కావడంతో గుండె పగిలినంతపనైంది. విదేశాల్లో చాలా సిరీస్ లు ఆడాను. ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాను. హోంసిరీస్ లో బాగా ఆడాలని అనుకున్నాను. గాయంతో నా ఆశలపై నీళ్లు చల్లింద’ని వాపోయారు. విశ్రాంతి సమయంలో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టానని చెప్పాడు. ‘ఖాళీగా ఇంటిదగ్గర కూర్చోవడం బోర్ కొట్టింది. ఈ ఆరు వారాలు భారంగా గడిచింది. మొదటి రెండు వారాలు అయితే ఏమీ చేయలేకపోయాను. ఉదయం నిద్ర లేవగానే ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వెళ్లడం, తర్వాత రీహెబిలిటేషన్ సెంటర్ లో గడపడంతోనే సరిపోయింది. మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తూనే గడిపాను. నా మనసంతా టీమిండియాతోనే ఉండేది. టీమ్ లో ఉన్నట్టే అనుకునేవాడిని. ఫుల్ ఫిట్ నెస్ సాధించి తొందరగా జట్టులో చేరాలని తపన పడుతుండేవాడిన’ని రాహుల్ చెప్పాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న రెండో టెస్టులో రాహుల్ ఆడనున్నాడు.