స్వదేశంలో శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన అఖరి టీ20లో మోకాలి గాయంతో చాహర్ బాధపడ్డాడు. ఈ క్రమంలో 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన చాహర్ ఫీల్డ్ నుంచి వైదొలిగాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టేట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే చాహర్ ఐపీఎల్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లు దూరం కావల్సి వస్తుంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా లక్నో వేదికగా ఫిబ్రవరి 24న భారత్- శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక.. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
చదవండి: Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment