Khaleel Ahmed To Miss Majority Of Ranji Trophy 2022-23 Season Due To His Medical Condition - Sakshi
Sakshi News home page

ఆస్పత్రి బెడ్‌పై భారత ఆటగాడు.. ఆ టోర్నీ మొత్తానికి దూరం!

Published Tue, Dec 13 2022 10:26 AM | Last Updated on Tue, Dec 13 2022 11:45 AM

Khaleel Ahmed to miss majority of Ranji Trophy season due injury - Sakshi

టీమిండియా పేసర్‌, రాజస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ గాయం కారణంగా రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఖలీల్ అహ్మద్‌ ప్రస్తుతం మెకాలి గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా తన గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఖలీల్‌ అహ్మద్‌ అభిమానులతో పంచుకున్పాడు.

హాస్పిట్‌ల్‌ బెడ్‌ పై ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ... తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రంజీ ట్రోఫీలో చాలా మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు అతడు తెలిపాడు. ఒక వేళ తను పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే తిరిగి మళ్లీ జట్టులోకి చేరుతాని అని ఖలీల్‌ అన్నాడు. 

"క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టం. నా మెడికల్‌ కండీషన్‌ కారణంగా, నేను రాబోయే రంజీ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాను. నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను. నేను ఫిట్‌నెస్‌ సాధిస్తే తిరిగి మళ్లీ మైదానంలోఅడుగుపెడతాను. నేను కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికీ ధన్యవాదాలు" అని ట్విటర్‌లో  ఖలీల్‌ పేర్కొన్నాడు.

కాగా ఖలీల్‌ దాదాపు రెండేళ్ల నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో కూడా గాయం కారణంగా అతడు కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఖలీల్‌ అదరగొట్టాడు.

ఐపీఎల్‌-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు 11 వన్డేలు, 14 టీ20ల్లో భారత జట్టుకు ఖలీల్‌ ప్రాతినిథ్యం వహించాడు. అతడు చివరసారిగా టీమిండియా తరపున చివరగా 2019లో బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌లో ఆడాడు.


చదవండిRanji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్‌ ఎప్పుడంటే!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement