భారత యువ ఆటగాడు పృథ్వీ షా సెలక్టర్లకు మరోసారి గట్టి సవాల్ విసిరాడు . జాతీయ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ఆస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా ద్విశతకం సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 235 బంతుల్లోనే పృథ్వీ తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 237 పరుగులతో పృథ్వీ బ్యాటింగ్ చేస్తున్నాడు. షా ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 33 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
అతడితో పాటు ముంబై కెప్టెన్ అజింక్యా రహానే 73 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ముంబై భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. 89 ఓవర్లు ముగిసే సరికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 395 పరుగులు చేసింది.
ఇక పృథ్వీ షా చివరసారిగా 2021లో భారత్ తరపున ఆడాడు. అదే విధంగా టెస్టుల్లో ఆఖరిగా 2020లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు పృథ్వీ షా.. భారత సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment