టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.
ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్‌డేల్‌లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ తెరమీదకు వచ్చింది.
వరల్డ్‌కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్‌కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది.
కారణం ఏమిటి?
ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్‌మన్ గిల్‌తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లనుంది.
అవసరం లేదు
ఇక విండీస్ పిచ్‌లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్‌తో అవసరం లేదు.
ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్‌ట్రాగా ఆవేశ్ ఖాన్‌ను ఇంటికి పంపించాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, హిట్టర్ రింకూ సింగ్‌తో పాటు బ్యాకప్ పేసర్‌గా ఖలీల్ అహ్మద్‌ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించింది.
చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment