అతని స్థానంలో ఆర్‌సీబీలోకి కొత్త ఆటగాడు.. | IPL 2021: Scott Kuggeleijn Replacement For Kane Richardson In RCB | Sakshi
Sakshi News home page

అతని స్థానంలో ఆర్‌సీబీలోకి కొత్త ఆటగాడు..

Published Tue, Apr 27 2021 10:27 PM | Last Updated on Tue, Apr 27 2021 10:39 PM

IPL 2021: Scott Kuggeleijn Replacement For Kane Richardson In RCB - Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీకి కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా రూపంలో షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా ఉదృతమవుతున్న వేళ తాము ఐపీఎల్‌ ఆడలేమంటూ ఈ ఇద్దరు స్వదేశానికి వెళ్లిపోయారు. తాజాగా ఆర్‌సీబీ కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానంలో ముంబై ఇండియన్స్‌లో రిజర్వ్‌ ఆటగాడిగా ఉన్న స్కాట్ కుగ్గెలీజ్న్‌ను జట్టులోకి తీసుకురానుంది. మిడ్‌ సీజన్‌ ట్రాన్స్‌ఫర్‌ కింద ఆర్‌సీబీ ఈ అవకాశాన్ని వినియోగించుకుంది.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ మధ్యలో ఒక జట్టు నుంచి మరో జట్టుకు బదిలీ అయిన తొలి ఆటగాడిగా స్కాట్‌ కుగ్లెలీజ్న్‌ నిలిచాడు. అయితే ఆడమ్‌ జంపా స్థానంలో ఆర్‌సీబీ ఇంకా ఎవరిని తీసుకోలేదు. ఇక కుగ్లెలీజ్న్‌ 2019 ఐపీఎల్‌ సీజన్‌లో తొలిసారి సీఎస్‌కే తరపున ఆడాడు. ఎన్గిడి స్థానంలో ఆడిన అతను రెండు మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు.
చదవండి: ఆ ఇద్దరికి కోచ్‌ అవసరం లేదు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement