టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 19వ ఓవర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి పెద్ద హైడ్రామా నడిచింది. నవీన్ ఉల్ హక్ తొలుత రన్ అప్‌కు వచ్చి బంతి వేయకుండా పిచ్ మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. తన చర్యకు బ్యాటర్‌తో పాటు అంపైర్‌కు క్షమాపణ చెప్పాడు.
ఇక రెండోసారి నవీన్ ఉల్ హక్ బంతిని వేద్దామనుకునే సమయానికి తనకు స్క్రీన్ అడ్డుగా వస్తుందని ఈసారి మ్యాక్స్‌వెల్ పక్కకు జరిగాడు. దీంతో నవీన్ ఉల్ హక్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. అలా ఒకసారి తాను ఆగిపోగా.. రెండోసారి మ్యాక్స్‌వెల్ ఆపడంతో నవీన్ ఉల్ హక్‌కు చిర్రెత్తింది. దీంతో మరుసటి బంతిని ఫుల్‌లెంగ్త్‌తో ఔట్‌సైడ్ వేయగా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతిని అందుకున్న నవీన్ ఉల్ హక్ అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రిచర్డ్‌సన్ పిచ్ మధ్యలోకి రావడంతో కసితో డైరెక్ట్ త్రో వేయగా బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రిచర్డ్‌సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తానికి మ్యాక్స్‌వెల్ చర్యతో చిర్రెత్తిన నవీన్ ఉల్ హక్ తన రివేంజ్‌ను రిచర్డ్‌సన్‌పై చూపించడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Made it count 🧐 pic.twitter.com/zYBoVMlZtL
— Aakash Srivastava (@Cursedbuoy) November 4, 2022
చదవండి: 27 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా విఫలం.. ఎట్టకేలకు
NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్!
Comments
Please login to add a commentAdd a comment