ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలంలో రూ. 7.50 కోట్లు వెచ్చించి మార్క్ వుడ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ సొంతం చేసుకుంది. కాగా వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ అన్రీచ్ నార్జే కూడా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను భర్తీ చేసే ఆటగాళ్లను టీమిండియా మాజీ క్రికెటర్ అంచనా వేశాడు. "మార్క్ వుడ్ ఈ ఏడాది సీజన్ నుంచి దూరం కావడం ఖాయం. అదే విధంగా దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ అన్రిచ్ నార్జే ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రబడా, బౌల్ట్, కమ్మిన్స్ వంటి చాలా మంది బౌలర్లు వేలంలో అమ్ముడు పోయారు.
ప్రస్తుతం ఈ జట్లుకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే కొంత మంది విదేశీ పేసర్లు వేలంలో అమ్ముడు పోలేదు. వారిలో ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ కూడా ఉన్నాడు. అతడు అద్భతమైన ఫాస్ట్ బౌలర్. టీ20ల్లో మంచి రికార్డును కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి వుడ్ స్ధానాన్ని కేన్ రిచర్డ్‌సన్‌తో భర్తీ చేయవచ్చు. అదే విధంగా నార్జే స్ధానాన్ని ఇంగ్లండ్ పేసర్ షాకిబ్ మహ్మద్ లేదా ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై తో భర్తీ చేయవచ్చు. టై అఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు ఒక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. అతడు ఆస్ట్రేలియా తరుపున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు" అని చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: Mithali Raj: మిథాలీ సంచలన, ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్!
We will miss you this season, speedster! @MAWood33 🚀 #LucknowSuperGiants family wishes our Woody a speedy recovery!💪
🎥: Fancode #AbApniBaariHai #TataIPL #IPL2022 #CricketNews #CricketUpdates pic.twitter.com/Kf9S1gUJuO
— Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2022
Comments
Please login to add a commentAdd a comment