
నటి జెనీలియా ఇటీవలే కరోనా బారిన పడ్డారట. కరోనాను జయించారట కూడా. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా చికిత్స సమయంలో రోజులు ఎలా గడిచాయనే విషయం గురించి జెనీలియా మాట్లాడుతూ – ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా సోకింది. దేవుడి దయ వల్ల›ఇవాళే (శుక్రవారం) కరోనా నెగటివ్ అని తేలింది. నాకు లభించిన ఆశ్వీర్వాదాల వల్ల, ప్రేమాభిమానాల వల్లే కరోనా నుంచి త్వరగా కోలుకోగలిగాను. మరో రకంగా చూస్తే ఈ 21రోజులు చాలా కష్టంగా గడిచాయి.
పర్సనల్‌గా చాలెంజింగ్‌గా అనిపించిన సమయం ఇది. సినిమాలు చూస్తూ, స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒంటరితనం అనే దెయ్యం దరి చేరకుండా ఉండటం చాలా కష్టం. మళ్లీ నా కుటుంబ సభ్యులు, నా పిల్లలకు దగ్గర కావడం సంతోషంగా ఉంది. మనల్ని ప్రేమించేవాళ్ల చుట్టూ సమయం గడపాలి. అదే మన బలంగా మారుతుంది. అనారోగ్యంగా అనిపిస్తే దయచేసి టెస్ట్ చేయించుకోండి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. ఫిట్‌గా ఉండండి. ఈ రాక్షస వైరస్‌తో మనం పోరాడగలిగే విధానం ఇదే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment