genelia deshmukh
-
బొమ్మరిల్లు హీరోయిన్ స్టన్నింగ్ లుక్స్.. చిల్ అవుతోన్న రాశీ ఖన్నా!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్ స్టన్నింగ్ లుక్స్..బిస్కెట్స్ తింటూ చిల్ అవుతోన్న రాశీ ఖన్నా...భర్తతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోన్న సోనాక్షి సిన్హా.. దో పట్టి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆదిపురుష్ భామ..బ్లాక్ బ్యూటీలా పుష్ప భామ రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
దివాలీ వైబ్స్: నటి జెనీలియా స్పెషల్ లుక్
-
అర్ధరాత్రి బ్రేకప్ అంటూ మెసేజ్.. పిచ్చిదాన్నయ్యా: జెనీలియా
జెనీలియా.. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే ఈ బ్యూటీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటుడు రితేశ్ దేశ్ముఖ్తో లవ్‌లో ఉన్నప్పుడు ఓసారి తను అనుభవించిన బాధను పంచుకుంది. ఇంతకీ ఏమైందో జెనీలియా మాటల్లోనే విందాం.. రితేశ్, నేను ప్రేమించుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇది. తను చాలా లేట్‌గా నిద్రపోతాడు, నేనేమో ముందుగానే పడుకునేదాన్ని. ఒంటిగంటకు ఆ మెసేజ్ఓ రోజు అతడు ఇంతటితో ఆపేద్దాం అంటూ బ్రేకప్ మెసేజ్ పెట్టాడు. రాత్రి ఒంటిగంటకు ఆ మెసేజ్ పెట్టి పడుకున్నాడు. నేను అది తెల్లవారుజామున రెండున్నరకు చూశాను. నాకేం అర్థం కాలేదు. అసలెందుకిలా మెసేజ్ చేశాడని చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దున తొమ్మిదింటికి అతడు ఎప్పటిలా ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అని చాలా సాధారణంగా మాట్లాడాడు. ఏప్రిల్ ఫూల్..అప్పటికే టెన్షన్, బాధలో ఉన్న నేను.. ఇకపై మనం మాట్లాడుకోకూడదు, నేను నీతో మాట్లాడను అని చెప్పాను. అందుకతడు ఏమీ తెలియనట్లు ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నావ్? అని అడిగాడు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావ్? రాత్రి బ్రేకప్ అని మెసేజ్ చేశావ్‌గా అని నిలదీశాను. రితేశ్ నవ్వుతూ.. ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే. అందుకే అలా చెప్పానన్నాడు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? అని చాలాసేపు క్లాస్ పీకాను.నా అదృష్టంరితేశ్కు మహిళలంటే చాలా గౌరవం. నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోతాడు. మనసస్ఫూర్తిగా ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఇలా అన్నీ చూసుకునే పార్ట్నర్ దొరకడం నిజంగా నా అదృష్టం అని జెనీలియా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ -
Genelia Deshmukh: హ.హ్హ.. హాసిని.. అల్లరిపిల్లగా నచ్చేసింది (ఫోటోలు)
-
Genelia Deshmukh: కొత్త ట్రెండ్స్ వద్దు క్లాసిక్ లుక్కే ముద్దు అంటున్న బ్యూటీ (ఫోటోలు)
-
అందుకే సినిమాలకు దూరమయ్యాను : జెనీలియా
హా హా హాసినీ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలె వేద్(మజిలీకి రీమేక్)సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకుంది. భర్త రితేష్ డైరెక్షన్లో నటించిన ఆమె ఇందులో సమంత పాత్రను పోషించగా, చైతూ రోల్లో రితేష్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో తన నటనా జీవితంపై జెనీలియా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నా. ఇల్లాలిగా, పిల్లలకు మంచి తల్లిగా పూర్తి సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలకు దూరమయ్యా. ఇక రీసెంట్గా వేద్ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది. -
గాలి కిరీటి ‘వారాహి’ మూవీతో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిన్న(మార్చి 4) హైదరాబాద్ ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం హీరో గాలి కిరీటి లుక్‌ను సంబంధించిన వీడియోను చిత్రం బృందం విడుదల చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనిలియా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో చివరిగా జెనిలియా నా ఇష్టం సినిమాలో కనిపించింది. దాదాపు ఆమె సినిమాలకు దూరమై పదేళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో ఆమె తిరిగి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కాగా ‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మెప్పించిన జెనిలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. బొమ్మరిల్లులో హాహా హాసిని అంటూ ఆందరిని ఆకట్టుకున్న జెనిలియా ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తెలుగులో నితిన్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా. మంచు విష్ణు, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించిన జెనిలియా తమిళ, హిందీ చిత్రాల్లో సైతం హీరోయిన్ నటించింది. అక్కడ కూడా ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో 2013లో రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
చీరకట్టులో మెరిసిపోతున్న బొమ్మరిల్లు జెనీలియా
-
హ్యాపీ బర్త్‌డే చెప్పిన ఖుష్భు, నవ్విన బిగ్‌బాస్ బ్యూటీ
ఆమె నమ్మిందే చేస్తుందంటూ చీర ఫొటో షేర్ చేసిన జెనిలియా ‘శివగామి’కి హ్యాపీ బర్త్‌డే చెప్పిన ఖుష్భు బ్లాక్ అండ్ వైట్‌లో ఇలియానా, ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా.. ఇంకా ఎటిఎమ్కు వెళుతున్నారా అంటూ వీడియో షేర్ చేసిన శ్రీముఖి View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
అదే మన బలం
నటి జెనీలియా ఇటీవలే కరోనా బారిన పడ్డారట. కరోనాను జయించారట కూడా. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా చికిత్స సమయంలో రోజులు ఎలా గడిచాయనే విషయం గురించి జెనీలియా మాట్లాడుతూ – ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా సోకింది. దేవుడి దయ వల్ల›ఇవాళే (శుక్రవారం) కరోనా నెగటివ్ అని తేలింది. నాకు లభించిన ఆశ్వీర్వాదాల వల్ల, ప్రేమాభిమానాల వల్లే కరోనా నుంచి త్వరగా కోలుకోగలిగాను. మరో రకంగా చూస్తే ఈ 21రోజులు చాలా కష్టంగా గడిచాయి. పర్సనల్‌గా చాలెంజింగ్‌గా అనిపించిన సమయం ఇది. సినిమాలు చూస్తూ, స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒంటరితనం అనే దెయ్యం దరి చేరకుండా ఉండటం చాలా కష్టం. మళ్లీ నా కుటుంబ సభ్యులు, నా పిల్లలకు దగ్గర కావడం సంతోషంగా ఉంది. మనల్ని ప్రేమించేవాళ్ల చుట్టూ సమయం గడపాలి. అదే మన బలంగా మారుతుంది. అనారోగ్యంగా అనిపిస్తే దయచేసి టెస్ట్ చేయించుకోండి. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. ఫిట్‌గా ఉండండి. ఈ రాక్షస వైరస్‌తో మనం పోరాడగలిగే విధానం ఇదే’’ అన్నారు. -
నాకు కరోనా సోకింది: జెనీలియా
ముంబై: మహమ్మారి కరోనా ఎవరినీ వదలడం లేదు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా అందరినీ వెంటాడుతూ చుక్కలు చూపిస్తోంది. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ఈ జాబితాలో చేరారు. మూడు వారాల క్రితం తనకు కరోనా సోకిందన్న ఆమె.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మహమ్మారిని జయించి కుటుంబంతో హాయిగా గడిపేందుకు సిద్ధమయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా) ఈ మేరకు.. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే లక్షణాలేవీ బయటపడలేదు. దేవుడి దయ వల్ల నేను ఈరోజు కోవిడ్ నెగటివ్ ఫలితం వచ్చింది. నాపై కురిపించిన ఆశీర్వాదాలు వ్యాధితో నా పోరాటాన్ని సులభతరం చేశాయి. అయితే అదే సమయంలో 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం అనేది చాలా కఠినమైనది. ఫేస్‌టైం, ఇతరత్రా డిజిటల్ వ్యాపకాలు ఒంటరితనం అనే దుష్టశక్తిని అంతం చేయలేవు. నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యుల సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నింటి కంటే ఇదే అతిపెద్ద బలం. ప్రతీ ఒక్కరికి కావాల్సింది ఇదే’’ అంటూ జెనీలియా ఇన్‌స్టాలో భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. అదే విధంగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా.. వీలైనంత త్వరగా పరీక్ష చేయించుకుని, పౌష్టికాహార భోజనం తీసుకోవాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే కరోనా రక్కసితో పోరాడవచ్చని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జెనీలియా.. దక్షిణాదిన అగ్ర తారగా వెలుగొందిన విషయం తెలిసిందే. అరంగేట్ర సినిమాలో తనకు జోడిగా నటించిన రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్ అన్యోన్య జంటల్లో ఒకటిగా చెప్పుకొనే రితేశ్-జెనీలియాలకు రియాన్, రేహిల్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా రితేశ్.. మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) on Aug 29, 2020 at 6:47am PDT -
చికెన్ వితౌట్ చికెన్: ఊరిస్తున్న బాలీవుడ్ జంట
సాక్షి, ముంబై : బాలీవుడ్ జంట రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మొక్కల ఆధారిత మాంసాహార సంస్థను ప్రారంభించనున్నారు. ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో ఈ వెంచర్‌ను త్వరలో ప్రారంభించనున్నామని అధికారింగా ఈ జంట ప్రకటించింది. ఇందుకు అమెరికాకు చెందిన గ్లోబల్ సంస్థ ఆర్చర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ (ఎడిఎమ్) గుడ్ ఫుడ్స్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు వివరాలను రితీష్, జెనీలియా ట్విటర్లో షేర్ చేశారు. ‘ఇమేజిన్ మీట్స్’ బ్రాండ్ కింద మొక్కల ఆధారంగా రూపొందించే మాంసాహార ఉత్పత్తులను అందించనుంది. ఈ ఉత్పత్తుల వాసన, రుచి నిజమైన మాంసాహారాన్ని పోలి ఉంటాయట. ఈ మొక్కల ఆధారిత ఆహారాలు బఠానీ ప్రోటీన్, కొబ్బరి నూనె వంటి మొక్కల పదార్ధాల నుండి తయారు చేస్తారట. ముఖ్యంగా బిర్యానీ, కబాబ్, కూరలు ఇతర ఉత్పత్తులను రాబోయే నెలల్లో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా దాదాపు మూడేళ్ల క్రితం ఈ జంట పూర్తి శాకాహారిగా మారిన సంగతి తెలిసిందే. And our journey begins @ImagineMeats @geneliad pic.twitter.com/4nE IEIJy2G — Riteish Deshmukh (@Riteishd) July 21, 2020 Nice to MEAT you .. @ImagineMeats pic.twitter.com/uq8hVI8KoX — Genelia Deshmukh (@geneliad) July 20, 2020 -
మీకు వయసు పెరగదా?
మీకసలు వయసు పెరగదా?.. నటి జెనీలియా నటుడు జయంరవిని చూసి వేసిన ప్రశ్న ఇది. వీరిద్దరి వ్యవహారం ఏమిటని అనుకుంటున్నారా? జయరవి, జెనీలియా జంటగా సంతోష్ సుబ్రమణియమ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న జెనీలియా 2012లో పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. వరుస విజయాలతో తన గ్రాఫ్‌ను పెంచుకుపోతున్న జయం రవి తాజాగా కోమాలి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి కాజల్‌అగర్వాల్ కథానాయకి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కోమాలి. కాగా ఇందులో నటుడు జయంరవి 9 గెటప్ల్లో కనిసించనున్నారట. వీటిలో చిత్ర ఫస్ట్‌లుక్ పేరుతో ఒక్కో గెటప్‌ను ఒక్కో ప్రముఖ వ్యక్తితో విడుదల చేస్తున్నారు చిత్ర వర్గాలు. కాగా తాజాగా సోమవారం జయంరవి 9వ గెటప్‌ను ఆయన సోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఈ గెటప్ కోసం జయంరవి సుమారు 20 కిలోల బరువు తగ్గారు. ఈ గెటప్‌ను చేసిన దర్శకుడు మోహన్‌రాజా రవిని తొలి చిత్రం జయంలో చూసినట్లుగా ఉందని ప్రశంసించారు. అంతే కాదు జయంరవి విద్యార్థి గెటప్‌ను చూసి నటి కుష్బూ, దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, కార్తీక్‌తంగవేల్ శుభాకాంక్షలు తెలిపారు. నటి జెనీలియా జయంరవి ఫొటోను చూసి తన ట్విట్టర్లో పేర్కొంటూ మీకు వయసే పెరగదా? అని ప్రశ్నించారు. కోమాలి చిత్రంలో మీ గెటప్ చూసి ఆశ్యర్యపోయాను. శుభాభినందనలు అని జెనీలియా పేర్కొంది. నవ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్న కోమాలి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో కాజల్‌అగర్వాల్‌తో పాటు నటి సంయుక్తాహెగ్డే మరో హీరోయిన్గా నటిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. కోమాలి చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. What is this @actor_jayamravi ???? You are not aging at alll... You Look like a teenager all over again.. Good Luck https://t.co/aEUfly5LvE — Genelia Deshmukh (@geneliad) 26 May 2019 -
మరో బిడ్డకు జన్మనిచ్చిన హ..హ..హాసిని
హ హ హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరపించిన జెనీలియా రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే రియాన్ అనే నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. అందుకే తన పెద్ద కొడుకు చెపుతున్నట్టుగా, ' మా అమ్మ నాన్నలు నాకు చిన్ని తమ్ముణ్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక నాబొమ్మలన్ని తనవే' అంటూ రియాన్ ఫోటోతో కలిపి ట్వీట్ చేశాడు రితేష్. హిందీ, తెలుగు, తమిళ సినిమాలో నటించిన జెనీలియా, రితేష్‌తో వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఫోటోలు పోస్ట్ చేస్తున్న జెనీలియా, 'మా అర్హత కన్నా ఎక్కువగా ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d— Riteish Deshmukh (@Riteishd) 1 June 2016Thank you GOD for blessing me much more than I deserve. pic.twitter.com/9gZqpYTmB4— Genelia Deshmukh (@geneliad) 31 May 2016 -
'ఎంతరాత్రి వచ్చినా ఆట ఆడాకే నిద్రపోతాడు'
ముంబయి: తీరిక లేకుండా సినిమా షూటింగుల్లో పాల్గొని వస్తున్నా తన కుమారుడితో ఆడుకోకుండా తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ అస్సలు నిద్రపోడని నటి జెనీలియా దేశ్‌ముఖ్ చెప్పింది. రితేశ్‌ను చూసి తాను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటానని అంటోంది. ప్రస్తుతం బంజో అనే చిత్రం షూటింగ్లో తీరిక లేకుండా పాల్గొంటున్న రితేశ్.. ఒక రోజు తెల్లవార్లు షూటింగ్లో పాల్గొని తెల్లవారిన తర్వాత ఉదయం 7గంటలకు వచ్చి కూడా రితేశ్ తన ఏడాది కుమారుడితో ఆడుకుంటాడని, ఆ తర్వాతే నిద్రపోతాడని చెబుతూ మురిసిపోతోంది. 2012లో రితేశ్, జెనీలియాలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
లైఫ్‌లో గొప్ప నిర్ణయం అదే: రితేశ్
ముంబై: తన భార్య చేయందుకోవడమే జీవితంలో తను చేసిన గొప్ప పని అని బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ పొంగిపోతున్నాడు. వివాహ వార్షికత్సవం సందర్భంగా భార్య జెనీలియా పట్ల తన ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో అభిమానులతో సంతోషాన్ని అతడు పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయం జెనీలియాను ఎంచుకోవడమంటూ మంగళవారం రితేశ్ ట్విట్ చేశాడు. జీవితభాగస్వామి పట్ల తనకున్న అవ్యాజమైన అనురాగాన్ని ప్రకటించి మరోసారి ఆమె మనసు కొల్లగొట్టేసాడు. అటు అభిమానుల గుండెల్లో హీరోగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. కాగా తుఝె మెరీ కసమ్ సినిమాతో రీల్ లైఫ్ దంపతులుగా వెలిగిన జెనీలియా, రితేశ్ ముఖ్ రియల్ లైఫ్ లోనూ బాలీవుడ్ క్యూట్ కపుల్ గా అవతరించారు. సంతోషకరమైన వీరి వైవాహిక జీవితంలో 2004 లో కొడుకు రియాన్ ఎంటరై మరిన్ని వెలుగులు పూయించాడు. తొందర్లోనే జెనీలియా మరోబిడ్డకు జన్మనివ్వనుంది. పన్నెండేళ్లుగా బాలీవుడ్ లో తమదైన శైలిలో రాణిస్తూ సముచిత స్థానాన్ని సంపాదించుకున్నాడు రితేశ్. -
మా అబ్బాయిని మీరు చూశారా?
హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన జెనీలియా డిసౌజా ఇటీవలే తల్లి అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న జెనీలియా.. గుమ్మడిపండు లాంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చుక్కల చుక్కల చొక్కా వేసుకున్న తన కొడుకు పొటోను జెనీలియా స్వయంగా ట్విట్టర్లో షేర్ చేసింది. రియాన్ రితేష్ దేశ్‌ముఖ్ అనే పేరు పెట్టిన ఈ చిన్నారితో జెనీలియా తీయించుకున్న ఫొటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రస్తుతం శరవేగంగా వ్యాపిస్తోంది. బాలీవుడ్లోనే అందమైన జంటగా పేరొందిన జెనీలియా, రితేష్ 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. ఆ తర్వాతే మూడు ముళ్లు పడ్డాయి.