
మీకసలు వయసు పెరగదా?.. నటి జెనీలియా నటుడు జయంరవిని చూసి వేసిన ప్రశ్న ఇది. వీరిద్దరి వ్యవహారం ఏమిటని అనుకుంటున్నారా? జయరవి, జెనీలియా జంటగా సంతోష్ సుబ్రమణియమ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న జెనీలియా 2012లో పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు.
వరుస విజయాలతో తన గ్రాఫ్‌ను పెంచుకుపోతున్న జయం రవి తాజాగా కోమాలి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి కాజల్‌అగర్వాల్ కథానాయకి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కోమాలి. కాగా ఇందులో నటుడు జయంరవి 9 గెటప్‌ల్లో కనిసించనున్నారట. వీటిలో చిత్ర ఫస్ట్‌లుక్ పేరుతో ఒక్కో గెటప్‌ను ఒక్కో ప్రముఖ వ్యక్తితో విడుదల చేస్తున్నారు చిత్ర వర్గాలు.
కాగా తాజాగా సోమవారం జయంరవి 9వ గెటప్‌ను ఆయన సోదరుడు, దర్శకుడు మోహన్‌రాజా విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఈ గెటప్ కోసం జయంరవి సుమారు 20 కిలోల బరువు తగ్గారు. ఈ గెటప్‌ను చేసిన దర్శకుడు మోహన్‌రాజా రవిని తొలి చిత్రం జయంలో చూసినట్లుగా ఉందని ప్రశంసించారు. అంతే కాదు జయంరవి విద్యార్థి గెటప్‌ను చూసి నటి కుష్బూ, దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, కార్తీక్‌తంగవేల్ శుభాకాంక్షలు తెలిపారు.
నటి జెనీలియా జయంరవి ఫొటోను చూసి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ మీకు వయసే పెరగదా? అని ప్రశ్నించారు. కోమాలి చిత్రంలో మీ గెటప్ చూసి ఆశ్యర్యపోయాను. శుభాభినందనలు అని జెనీలియా పేర్కొంది. నవ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్న కోమాలి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇందులో కాజల్‌అగర్వాల్‌తో పాటు నటి సంయుక్తాహెగ్డే మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. కోమాలి చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.
What is this @actor_jayamravi ???? You are not aging at alll... You Look like a teenager all over again.. Good Luck https://t.co/aEUfly5LvE
— Genelia Deshmukh (@geneliad) 26 May 2019
Comments
Please login to add a commentAdd a comment