
'ఎంతరాత్రి వచ్చినా ఆట ఆడాకే నిద్రపోతాడు'
ముంబయి: తీరిక లేకుండా సినిమా షూటింగుల్లో పాల్గొని వస్తున్నా తన కుమారుడితో ఆడుకోకుండా తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ అస్సలు నిద్రపోడని నటి జెనీలియా దేశ్ముఖ్ చెప్పింది. రితేశ్ను చూసి తాను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటానని అంటోంది.
ప్రస్తుతం బంజో అనే చిత్రం షూటింగ్లో తీరిక లేకుండా పాల్గొంటున్న రితేశ్.. ఒక రోజు తెల్లవార్లు షూటింగ్లో పాల్గొని తెల్లవారిన తర్వాత ఉదయం 7గంటలకు వచ్చి కూడా రితేశ్ తన ఏడాది కుమారుడితో ఆడుకుంటాడని, ఆ తర్వాతే నిద్రపోతాడని చెబుతూ మురిసిపోతోంది. 2012లో రితేశ్, జెనీలియాలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.