Banjo
-
హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు
తన సినిమాలతో పాటు బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో బ్రేక్ అప్ వార్తలతో ఇటీవల తెగ హడావిడి చేస్తున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన లేటెస్ట్ సినిమా బాన్‌జో ప్రమోషన్ సందర్భంగా అలిసి పోయిన నర్గీస్ తరువాత రిలాక్స్ అవ్వడం కోసం అమెరికా వెల్లింది. అక్కడ షాపింగ్‌లు, టూర్లతో ఎంజాయ్ చేసిన నర్గీస్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే అమెరికాలో షాపింగ్ చేస్తున్న సమయంలో తన క్రెడిట్ కార్డ్‌కు డూప్లికేట్ తయారు చేసిన దుండగులు ఆమె అకౌంట్ నుంచి దాదాపు 6 లక్షల రూపాయలను కాజేశారట. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఈ బ్యూటి తరువాత తన కార్డ్ బ్లాక్ చేయటంతో మరింత నష్టం జరగలేదు. ఆమె కార్డు డూప్లికేట్ ను వినియోగించిన వారు ఎక్కువగా షాపింగ్ చేయటంతో సీసీ కెమరాల ద్వారా వారిని పట్టుకోవటం పెద్ద కష్టమేమి కాదన్న హామి ఇచ్చారట అమెరికా పోలీసులు. -
'ఎంతరాత్రి వచ్చినా ఆట ఆడాకే నిద్రపోతాడు'
ముంబయి: తీరిక లేకుండా సినిమా షూటింగుల్లో పాల్గొని వస్తున్నా తన కుమారుడితో ఆడుకోకుండా తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ అస్సలు నిద్రపోడని నటి జెనీలియా దేశ్‌ముఖ్ చెప్పింది. రితేశ్‌ను చూసి తాను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటానని అంటోంది. ప్రస్తుతం బంజో అనే చిత్రం షూటింగ్లో తీరిక లేకుండా పాల్గొంటున్న రితేశ్.. ఒక రోజు తెల్లవార్లు షూటింగ్లో పాల్గొని తెల్లవారిన తర్వాత ఉదయం 7గంటలకు వచ్చి కూడా రితేశ్ తన ఏడాది కుమారుడితో ఆడుకుంటాడని, ఆ తర్వాతే నిద్రపోతాడని చెబుతూ మురిసిపోతోంది. 2012లో రితేశ్, జెనీలియాలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.