హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు | Heroine Nargis Fakhri robbed of 6 lakh in credit card fraud | Sakshi
Sakshi News home page

హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు

Published Wed, Aug 17 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు

హీరోయిన్ అకౌంట్లో 6 లక్షలు కాజేశారు

తన సినిమాలతో పాటు బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో బ్రేక్ అప్ వార్తలతో ఇటీవల తెగ హడావిడి చేస్తున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తన లేటెస్ట్ సినిమా బాన్జో ప్రమోషన్ సందర్భంగా అలిసి పోయిన నర్గీస్ తరువాత రిలాక్స్ అవ్వడం కోసం అమెరికా వెల్లింది. అక్కడ షాపింగ్లు, టూర్లతో ఎంజాయ్ చేసిన నర్గీస్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది.

అయితే అమెరికాలో షాపింగ్ చేస్తున్న సమయంలో తన క్రెడిట్ కార్డ్కు డూప్లికేట్ తయారు చేసిన దుండగులు ఆమె అకౌంట్ నుంచి దాదాపు 6 లక్షల రూపాయలను కాజేశారట. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఈ బ్యూటి తరువాత తన కార్డ్ బ్లాక్ చేయటంతో మరింత నష్టం జరగలేదు. ఆమె కార్డు డూప్లికేట్ ను వినియోగించిన వారు ఎక్కువగా షాపింగ్ చేయటంతో సీసీ కెమరాల ద్వారా వారిని పట్టుకోవటం పెద్ద కష్టమేమి కాదన్న హామి ఇచ్చారట అమెరికా పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement